Switch to English

సెప్టెంబర్ 17 చుట్టూ రాజకీయం.! తెలంగాణ కష్టం పగవాడిక్కూడా రాకూడదు.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

సెప్టెంబర్ పదిహేడవ తేదీకి వున్న ప్రాధాన్యత ఏంటో తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమకారులు, మేధావులు, రాజకీయ నాయకులు బహు చక్కగా చెప్పారు. ఏమయ్యిందోగానీ, ఆ ఉద్యమకారులు, మేధావులు, రాజకీయ నాయకులు.. ఎనిమిదేళ్ళుగా సైలెంటయిపోయారు.

తెలంగాణ రాష్ట్ర సాధనలో సెప్టెంబర్ 17వ తేదీ కూడా కీలక భూమిక పోషించింది. తెలంగాణకు జాతీయ స్థాయిలో గుర్తింపు సెప్టెంబర్ 17వ తేదీ కారణంగా రావాల్సిందేనంటూ అప్పట్లో తెలంగాణ రాష్ట్ర సమితి నినదించిన విషయాన్ని ఎలా విస్మరించగలం.? సెప్టెంబర్ 17వ తేదీ ప్రతి ఏడాదిలాగానే, ఈ ఏడాది కూడా వచ్చింది. కాకపోతే, ఈసారి కాస్త కొత్తగా.

కేంద్రం, సెప్టెంబర్ 17వ తేదీని ‘విమోచన దినోత్సవం’గా నిర్వహించింది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా హైద్రాబాద్ వచ్చారు.. పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్నాటకల్లోని ప్రభుత్వ పెద్దలకు ప్రత్యేకంగా ఆహ్వానాలు పంపింది కేంద్రం. తెలంగాణకూ అలాంటి ఆహ్వానమే పంపినా.. తెలంగాణ ప్రభుత్వం తరఫున అందరూ మొహం చాటేశారు.

ఇంకోపక్క, తెలంగాణ రాష్ట్ర సమితి ‘తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం..’ అంటూ వేడుకలు నిర్వహించింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్ నేతృత్వంలో ఈ వేడుకలు జరిగాయి. కాంగ్రెస్ పార్టీది ఇంకో తంతు. కొత్త తెలంగాణ తల్లిని తెలంగాణ పీసీసీ ఆవిష్కరించింది. కమ్యూనిస్టులేమో తమకు తోచిన రీతిలో సెప్టెంబర్ 17వ తేదీని నిర్వహించడం గమనార్హం.

జాతీయ స్థాయిలో తెలంగాణకు గుర్తింపు తీసుకురావాల్సిన తేదీ సెప్టెంబర్ 17. ఎందుకంటే, అదే రోజు భారతదేశంలో ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలోని భూభాగంతోపాటు, ప్రస్తుతం కర్నాటకలోనూ, మహారాష్ట్రలోనూ వున్న కొంత ప్రాంతానికి నిజాం పాలన నుంచి స్వాతంత్ర్యం లభించింది.

దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం వస్తే, పైన చెప్పుకున్న ప్రాంతానికి (అప్పటి హైద్రాబాద్ స్టేట్.. నిజాం సంస్థానం..) 1948 సెప్టెంబర్ 17న స్వాతంత్ర్యం సిద్ధించింది.. అదీ, భారత సైన్యం జరిపిన సైనిక చర్య ద్వారా. దానికి ఆపరేషన్ పోలో అని పేరు పెట్టారు అప్పట్లో నిజాం పాలన నుంచి విముక్తి.. భారతదేశంలో హైద్రాబాద్ స్టేట్ విలీనం.. ఇలా చాలా ప్రత్యేకతలున్నాయ్ సెప్టెంబర్ 17వ తేదీకి. కానీ, ఈ అద్భుతమైన ఘట్టాన్ని చరిత్ర పుటల్లో సరిగ్గా లిఖించలేదు. ఇప్పుడెలా దాన్ని జరుపుకోవాలో తెలియని దుస్థితి తెలంగాణ సమాజానిది. ఈ కష్టం పగవాడిక్కూడా రాకూడదంతే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

రాజకీయం

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

ఎక్కువ చదివినవి

Prachi Nigam: యూపీ టాపర్ పై ట్రోలింగ్.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన బాలిక

Prachi Nigam: సోషల్ మీడియాలో కొందరి విపరీత పోకడకలకు హద్దు లేకుండా పోతోంది. ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) విద్యార్ధిని పదో తరగతి పరిక్షల్లో 98.5శాతం ఉత్తీర్ణత సాధించిన బాలిక సత్తాను కొనియాడకుండా రూపంపై...

ఉప్మాకి అమ్ముడుపోవద్దు: పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్.!

ఇది మామూలు వార్నింగ్ కాదు.! చాలా చాలా స్ట్రాంగ్ వార్నింగ్.! అయితే, ఆ హెచ్చరిక ఎవర్ని ఉద్దేశించి.? ఉప్మాకి అమ్ముడుపోయేటోళ్ళు రాజకీయాల్లో ఎవరుంటారు.? ఉప్మాకి అమ్ముడుపోవద్దని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎవర్ని...

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...

చెల్లెలి చీర రంగు మీద పడి ఏడ్చేవాళ్ళని ఏమనగలం.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన ప్రస్తుతానికి.! ఎన్నికల తర్వాత ఆ పదవి వుంటుందా.? ఊడుతుందా.? అన్నది వేరే చర్చ. ఓ రాజకీయ పార్టీకి అధినేత కూడా.! ఎంత బాధ్యతగా మాట్లాడాలి.? అదీ కుటుంబ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు. నేడు ఆమె పుట్టినరోజు...