Switch to English

మూడు రాజధానులపై వెనక్కి తగ్గరు.! ముందుకు వెళ్ళరు.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

ఏ రాష్ట్రంలో అయినా, అధికార పార్టీ.. ఆ రాష్ట్ర రాజధాని విషయంలో అయోమయం సృష్టిస్తుందా.? ఇట్ హ్యాపెన్స్ ఓన్లీ ఇన్ ఇండియా.! దేశంలో ఏ రాష్ట్రాన్నైనా తీసుకోండి.. ఏ అధికార పార్టీని అయినా తీసుకోండి.! రాజధాని కేంద్రంగా ఎక్కువ అభివృద్ధి చేయాలనుకుంటాయి. ప్రత్యేకంగా అభివృద్ధి చేసినా, చెయ్యకపోయినా.. రాజధాని అభివృద్ధి చెందుతుంటుంది.. రాజధానికి వుండే ప్రత్యేకత అదే.

జిల్లా కేంద్రాల్ని తీసుకుంటే.. జిల్లాలో మిగతా పట్టణాలతో పోల్చితే, జిల్లా కేంద్రమే ఎక్కువ అభివృద్ధి చెందుతుంటుంది. చాలా అరుదుగా మాత్రమే ఓ జిల్లాలో ఇంకో పట్టణం, జిల్లా కేంద్రం కంటే ఎక్కువ అభివృద్ధి చెందడం చూస్తుంటాం. దానికి మళ్ళీ ప్రత్యేక కారణాలుంటాయ్.

ఉమ్మడి తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోయాక, పాత పేరుతో 13 జిల్లాలతో ఏర్పడ్డ కొత్త రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌కి రాజధాని అవసరమైతే, చంద్రబాబు ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ప్రకటించింది. నిజానికి, అప్పట్లోనో విజయవాడ, విశాఖపట్నం, కర్నూలు, తిరుపతి నగరాల్లో దేన్నో ఒకదాన్ని రాజధానిగా ప్రకటించి వుండాలి.

సరే, అప్పటి ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంది.. దానికి అప్పటి ప్రతిపక్షమూ ఆమోద ముద్ర వేసింది. ఛత్, చంద్రబాబు ప్రకటించిన రాజధాని అమరావతిని తానెందుకు అభివృద్ధి చేయాలి.? అని అనుకున్నట్టున్నారు ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ప్రతిపక్ష నేతగా వున్నప్పుడు లేని అభ్యంతరాలు, ముఖ్యమంత్రి అయ్యాక వచ్చాయి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి.

రాజధాని మీద వైసీపీకి అక్కసు వుందా.? లేదంటే, రాష్ట్రం మీదనే వైసీపీకి అక్కసు వుందా.? అన్న అనుమానాలు కలుగుతున్నాయిప్పుడు. మూడు రాజధానుల పేరుతో.. దాదాపు మూడేళ్ళు కాలయాపన చేసేశారు. ఇప్పుడేమో, సుప్రీంకోర్టును ఆశ్రయించారు.. అసలు రాష్ట్రాన్ని ఏం చేద్దామని వైసీపీ అనుకుంటోందిట.?

రాష్ట్రంలో రోడ్లు సరిగ్గా లేవు.. రోడ్లను బాగు చేయలేని ప్రభుత్వం, రాజధానులు కట్టేస్తామంటోంది.. అసలది ఎలా సాధ్యం.? వచ్చే ఎన్నికల దాకా విషయాన్ని సాగదీయాలనే ఉద్దేశ్యం, నెపాన్ని కోర్టుల మీదా, విపక్షాల మీద నెట్టేయాలన్న కుత్సిత రాజకీయం.. వెరసి, వైసీపీ రాష్ట్రానికి తీరని నష్టం చేసింది, చేస్తూనే వుంది.
మూడు రాజధానుల విషయం ముందుకెళ్ళదు.. వెనక్కీ తగ్గదు. మధ్యలో రాష్ట్రం నాశనమైపోతుంది. ఇదీ వైసీపీ అత్యద్భుత పాలన.!

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి మళ్లీ ఎప్పుడెప్పుడు సినిమాలు వస్తాయా అంటూ...

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...