పోలవరం జాతీయ ప్రాజెక్టు.! రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలు ఎందుకు ఈ విషయమై కొట్టుకు ఛస్తున్నాయన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో పోలవరం ప్రాజెక్టు పనులు ముందుకు కదిలినా, ఆ ప్రాజెక్టు అంతకు ముందు చాలా ఏళ్ళ క్రితం ప్లాన్ చేయబడింది. బ్రిటిష్ హయాంలోని ప్రతిపాదన జరిగిన ఆ ప్రాజెక్టుకి ఇన్ని దశాబ్దాలుగా రాజకీయ గ్రహణం పట్టింది.. ఆ గ్రహణం కొనసాగుతూనే వుంది.
చంద్రబాబు హయాంలో పోలవరం ప్రాజెక్టు పేరుతో పెద్ద పబ్లిసిటీ స్టంట్ నడిచింది. 2018 చివరి నాటికి ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నారు.. చెయ్యలేకపోయారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో అంతకు మించిన పబ్లిసిటీ స్టంట్లు నడుస్తున్నాయి. 2020 చివరికి అన్నారు.. 2021 కూడా వెళ్ళిపోయింది.. 2022 చివరి నాటికి అయినా పూర్తవుతుందో లేదో తెలియని పరిస్థితి.
ఈ ప్రాజెక్టు విషయమై తాజాగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చిన్నపాటి చర్చ జరిగితే, ఈ క్రమంలో మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ప్రతిపక్షం మీద విరుచుకుపడిపోయారు. అరుపులు కేకలతో మంత్రిగారు ఎవర్ని భయపెట్టదలచుకున్నారన్నదే ఇక్కడ మిలియన్ డాలర్ల ప్రశ్న.
నిజానికి, మంత్రిగారు కన్నెర్ర జేయాల్సింది కేంద్రం మీద. కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీని మంత్రి అనిల్ నిలదీయాల్సి వుంది. ఎందుకంటే, పోలవరం ప్రాజెక్టుకి నిధులు ఇవ్వాల్సింది కేంద్రమే. అన్నీ వున్నా అల్లుడి నోట్లో శని అన్న చందాన, జాతీయ ప్రాజెక్టుని పూర్తి చేసుకోలేని దౌర్భాగ్య పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానిది.
చంద్రబాబు హయాంలో పోలవరం ప్రాజెక్టు పూర్తి కాలేదు.. చంద్రబాబుని జనం ఇంటికి పంపించారు. మరి, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో పనులెందుకు పూర్తి కావడంలేదు.? వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కూడా జనం ఇంటికి పంపించాలని వైసీపీ కోరుకుంటోందా.? మంత్రి అనిల్ ఆలోచన కూడా అంతేనా.? కాలమే, అన్ని ‘వంకర్లకీ’ సమాధానం చెబుతుంది.
604249 717395Fascinating post. Ill be sticking around to hear much much more from you guys. Thanks! 683904
168659 633586That being said by use it all, planet is actually restored just a little far more. This situation in addition will this certain Skin tightening and starting to be moved and into the mood of these producing activities. every day deal livingsocial discount baltimore washington 455554
874955 686197I really like your writing style, great information, thankyou for posting : D. 8496
441708 690272Chaga mushroom tea leaf is thought-about any adverse health elixir at Spain, Siberia and a lot of n . Countries in europe sadly contains before you go ahead significantly avoidable the main limelight under western culture. Mushroom 84160
132336 521797Wohh exactly what I was looking for, appreciate it for posting . 882192