పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ కరోనా సెకండ్ వేవ్ కు ముందు ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘన విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. హిందీ పింక్ కు ఈ సినిమా రీమేక్ అనే విషయం తెల్సిందే. పెద్ద ఎత్తున ఈ సినిమాలో మార్పులు చేర్పులు చేసి వకీల్ సాబ్ ను రూపొందించారు. పింక్ కు కమర్షియల్ ఎలిమెంట్స్ అద్ది పవన్ కళ్యాణ్ ఇమేజ్ కు తగ్గట్లుగా మార్చడంలో దర్శకుడు వేణు శ్రీరామ్ సక్సెస్ అయ్యాడు. దిల్ రాజు నిర్మించిన వకీల్ సాబ్ సినిమా మరో ఘనత దక్కించుకుంది.
IMDB లో ఒరిజినల్ వర్షన్ పింక్ కంటే కూడా అధనంగా వకీల్ సాబ్ రేటింగ్ ను దక్కించుకుంది. IMDB లో పింక్ కు 75.5 రేటింగ్ దక్కగా వకీల్ సాబ్ కు మాత్రం ఏకంగా 84.4 రేటింగ్ దక్కింది. ఒరిజినల్ వర్షన్ లో కంటే వకీల్ సాబ్ లో కమర్షియల్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉన్న కారణంగా ఎక్కువ రేటింగ్ దక్కింది. ఇక పింక్ తమిళ వర్షన్ నేర్కొండ పార్వై 73.4 రేటింగ్ ను దక్కించుకుంది. మూడు పార్ట్ ల్లో పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ కు మంచి రేటింగ్ దక్కింది. వకీల్ సాబ్ వసూళ్ల విషయంలో కూడా నెం.1 గానే నిలిచింది.
30430 84781Hello. Great job. I did not expect this. This really is a superb articles. Thanks! 144367