ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ రెండో వేవ్ ప్రారంభమవుతోందనే వార్తలతో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో కరోనా వ్యాక్సిన్ తీసుకురావాలని అనేక దేశాలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో ఆస్ట్రాజెనెకా, ఫైజర్, మోడెర్నా, స్పుత్నిక్-వి వ్యాక్సిన్లు ముందు వరుసలో ఉన్నాయి. ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ సాయంతో వ్యాక్సిన్ తయారుచేస్తున్న ఆస్ట్రాజెనెకా మినహా మిగిలిన మూడు కంపెనీలు తమ ఫలితాలను వెల్లడించాయి. ఇప్పుడు ఆక్స్ ఫర్డ్ తమ ఫేజ్2 ఫలితాలు ప్రకటించడం సంచలనం రేపుతోంది. కారణం.. ఈ వ్యాక్సిన్ వృధ్దుల్లో కూడా సమర్ధవంతంగా పని చేయడమే.
ఇప్పటివరకూ చేస్తున్న ప్రయోగాలు కేవలం 18 నుంచి 55 ఏళ్ల వయసు వారి మధ్యలో మాత్రమే జరుగుతున్నాయి. కానీ.. ఆక్స్ ఫర్డ్ జరిపిన ప్రయోగాల్లో వృద్ధుల్లో చిన్న చిన్న సమస్యలు తప్పితే.. చాలా ప్రభావంతంగా యాంటీ బాడీస్ తయారవుతున్నాయని ప్రకటించింది. ఈ విషయాన్ని మెడికల జర్నల్ ‘ది లాన్సెట్’ ప్రచురించింది. ఫేజ్3 ప్రయోగాల్లో కూడా మంచి ఫలితాలు రాబడతామని అంటోంది. దీంతో ప్రపంచం చూపు ఇప్పుడు ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ పై పడింది. కరోనా బారిన పడి మృతి చెందుతున్న వారిలో ఎక్కువగా 60 ఏళ్ల పైబడిన వారే ఉండటం కూడా ఆక్స్ ఫర్డ్ టీకాపై ఆసక్తి పెరగడం ఒక కారణం.
టీకా ప్రయోగించిన 560 మందిలో 240 మంది 70 ఏళ్లు పైబడిన వారేనని తెలిపింది. వ్యాక్సిన్ ఇచ్చిన 14 రోజుల్లో యాంటీబాడీల డెవలెప్ మెంట్ గుర్తించామని.. మరో 28 రోజులకు రెండో డోస్ వేయగా 209 మందిలో 208 మంది కోలుకున్నారని తెలిపింది. ఇప్పటివరకూ ఫైజర్ 95, మోడెర్నా 94.5, స్పుత్నిక్-వి 92 శాతం వ్యాక్సిన్ సక్సెస్ అయినట్టు ప్రకటించాయి.
606737 115197Hello! Ive been following your blog for a while now and lastly got the courage to go ahead and give you a shout out from Kingwood Texas! Just wanted to mention maintain up the excellent work! 424528
454252 836356Vi ringrazio, considero che quello che ho letto sia ottimo 342345
726458 29931whoah this blog is magnificent i enjoy reading your posts. Keep up the great work! You know, lots of people are seeking about for this information, you could assist them greatly. 862500