పురపాలక ఎన్నికల్లో కారు జోరు పెంచింది. పురపాలక ఎన్నికల్లో చెప్పినట్టుగానే తెరాస పార్టీ దూసుకుపోతున్నది. పార్టీపై కొంత వ్యతిరేకత కనిపిస్తున్నా, ఆ వ్యతిరేకత మాత్రం పెద్దగా కనిపించడం లేదని మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ఎన్నికలు ప్రారంభించినప్పటి నుంచే కారు స్పీడ్ అందుకుంది. మొదటి రౌండ్ నుంచే స్పష్టమైన ఆధిక్యం కనబరుస్తూ వస్తున్న తెరాస పార్టీ ఇప్పటికే 64 స్థానాలు కైవసం చేసుకుంది.
మొత్తం 120 మున్సిపాలిటీలకు గాను ఇప్పటికే సగానికిపైగా గెలుచుకోవడం విశేషం. 9 కార్పొరేషన్లలో ఒకటి ఇప్పటికే తెరాస పార్టీ కైవసం చేసుకోవడం విశేషం. కనీసం 20కి పైగా మున్సిపాలిటీలు కైవసం చేసుకోవాలని చూసిన కాంగ్రెస్ కు భంగపాటు ఎదురైంది. ఇటు బీజేపీకి కూడా ఓటర్లు చుక్కలు చూపించారు. ఇప్పటి వరకు కాంగ్రెస్ 4 చోట్ల విజయం సాధిస్తే, బీజేపీ 3 చోట్ల విజయం సాధించింది.
మరోవైపు మజ్లీస్ పార్టీ కూడా బోణి కొట్టింది. ఆ పార్టీ రెండు మునిసిపాలిటీలు కైవసం చేసుకుంటే, ఇతరులు రెండో చోట్ల విజయం సాధించారు. మొత్తానికి కార్ జోరైతే ఆగడం లేదు. బ్రేకులు వేయకుండా దూసుకుపోతున్నది. ఇదే స్పీడ్ ను చివరి వరకు కొనసాగిస్తే వందకు పైగా స్థానాలను గెలుచుకోవడం ఈజీ అంటున్నారు. మరి చూద్దాం ఎలా జరుగుతుందో.
937086 709074Some times its a discomfort in the ass to read what weblog owners wrote but this internet website is actually user genial ! . 46651
255792 716344TeenVogue? Searching for fashion advice, celebrity buzz or beauty trends? Discover it all in Teen Vogue 386523