Switch to English

అచ్చెన్నకు ‘నో’ బెయిల్‌: కేసు ‘వీక్‌’ అయితే.. ఇదెలా జరిగిందబ్బా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,466FansLike
57,764FollowersFollow

మాజీ మంత్రి, టీడీపీ ముఖ్య నేత కింజరాపు అచ్చెన్నాయుడికి హైకోర్టులో చుక్కెదురయ్యింది. బెయిల్‌ కోసం అచ్చెన్నాయుడు పెట్టుకున్న పిటిషన్‌ని హైకోర్టు కొట్టి పారేసింది. ఈఎస్‌ఐ కుంభకోణంలో అచ్చెన్నాయుడు ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం విదితమే. ‘అసలు ఇది నిలబడే కేసు కాదు.. ఇందులో అచ్చెన్నకు అసలు ప్రమేయమే లేదు.. కోర్టులో ఈ కేసు వీగిపోతుంది..’ అంటూ టీడీపీ నేతలు చెబుతూ వస్తున్నారు. అంత వీగిపోయే కేసు అయితే, అచ్చెన్నాయుడికి బెయిల్‌ ఎందుకు రావడంలేదు.?

రోజులు గడుస్తున్నాయ్‌.. బెయిల్‌ కోసం నానా రకాల ప్రయత్నాలూ చేస్తున్నారు అచ్చెన్నాయుడు. అయినా, ‘బెయిల్‌’ రూపంలో ఊరట మాత్రం దక్కడంలేదు. అంటే, అటువైపు కేసు చాలా స్ట్రాంగ్‌గా వున్నట్లే భావించాలేమో. కొద్ది రోజుల క్రితం అచ్చెన్నను ఏసీబీ అరెస్ట్‌ చేయడం అప్పట్లో రాజకీయంగా పెను దుమారం రేపింది. కొద్ది రోజులు ఆసుపత్రిలో చికిత్స పొంది, ఆ తర్వాత జైలుకు వెళ్ళిన అచ్చెన్నాయుడు, తర్వాత మళ్ళీ చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. రిమాండ్‌ ఖైదీగానే ఇవన్నీ జరుగుతున్నాయి అచ్చెన్నాయుడికి.

మంత్రిగా వున్న సమయంలో ఈఎస్‌ఐకి సంబంధించి మందులు, ఇతరత్రా మెడికల్‌ ఎక్విప్‌మెంట్‌ కొనుగోళ్ళ విషయమై అక్రమాలకు పాల్పడ్డారన్నది అచ్చెన్నాయుడిపై ప్రధాన ఆరోపణ. ఇదే తరహా ఆరోపణలు తెలంగాణలోనూ వచ్చాయి. అయితే, తెలంగాణలో రాజకీయ నాయకుల ప్రమేయం పెద్దగా కన్పించలేదు. పలువురు అధికారులు మాత్రం జైలుకు వెళ్ళాల్సి వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఈఎస్‌ఐ మెడికల్‌ స్కాం రాజకీయ ప్రకంపనలు సృష్టించింది.

మాజీ మంత్రి పితాని సత్యనారాయణ పేరు కూడా ఈ కేసులో ప్రముఖంగా విన్పిస్తోంది. ఇదిలా వుంటే, బెయిల్‌ కోసం అచ్చెన్నాయుడు మరోమారు హైకోర్టును ఆశ్రయిస్తారనే ప్రచారం జరుగుతోంది. మరోపక్క, సుప్రీంకోర్టుని ఆశ్రయించేందుకు కూడా అచ్చెన్న తరఫు లాయర్లు ప్రయత్నిస్తున్నారట. ఏదిఏమైనా, అచ్చెన్నకు బెయిల్‌ రాకపోవడంతో టీడీపీ శ్రేణుల్లో.. మరీ ముఖ్యంగా అచ్చెన్న అనుచరుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా...

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు...

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ...

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్...

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు...

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను...

రాజకీయం

పో..‘సాని’తనం.! ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం.!

‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.! ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.?...

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

ఎక్కువ చదివినవి

రఘురామకృష్ణరాజు పంతం పట్టి మరీ సాధించుకున్నారుగానీ.!

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు, వైసీపీని వీడి టీడీపీలో చేరి, టీడీపీ నుంచి ఉండి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీకి దిగుతున్న సంగతి తెలిసిందే. నర్సాపురం లోక్ సభ సీటుని బీజేపీ నుంచి ఆశించి...

Upasana: ఆవకాయ పట్టిన అత్తమ్మ.. ఆటపట్టించిన ఉపాసన.. వీడియో వైరల్  

Upasana: టాలీవుడ్ (Tollywood) లో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఒక సందడి. ఒక బ్రాండ్. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi). ఆయనొక ఇన్ స్పిరేషన్ పర్సనాలిటీ. నిత్యం సినిమాలతో బిజీ. పరిశ్రమ...

కూలీలపై హత్యా నేరం మోపుతారా.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరం నడిబొడ్డున హత్యాయత్నం జరిగిందంటూ వైసీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారం సందర్భంగా, గుర్తు తెలియని వ్యక్తి విసిరిన...

Nara Rohit: నారా రోహిత్ @20 ‘సుందరకాండ’.. ఫస్ట్ లుక్, రిలీజ్ డేట్ రివీల్

Nara Rohit: నారా రోహిత్ (Nara Rohit) హీరోగా నటిస్తున్న 20వ సినిమా ‘సుందరకాండ’. శ్రీరామనవమి పండగ సందర్భంగా చిత్ర బృందం టైటిల్ రివీల్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేసింది. నూతన దర్శకుడు...

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్ అంటున్న మేకర్స్

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad Square) తెరకెక్కబోతోంది. యూత్ ఓరియంటెడ్ మూవీస్...