తమిళ సినీ దర్శకుడు విఘ్నేశ్ శివన్, సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార తల్లిదండ్రులయ్యారు. ఈమేరకు తమ సంతోషాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. విఘ్నేశ్ శివన్ సోషల్ మీడియా ద్వారా అభిమానులకు ఈ గుడ్ న్యూస్ చెప్పారు. తాము తల్లిదండ్రులయ్యామని.. ఇద్దరు ట్విన్ బాయ్స్ జన్మించారని ఆనందం వ్యక్తం చేశారు.
మాకు కవల పిల్లలు జన్మించారని.. ఈ ఆనంద క్షణాలను మీతో పంచుకుంటున్నామని.. మీ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఈ సందర్భంగా కోరారు. నయన్ దంపతులు తల్లిదండ్రులు కావడంతో సోషల్ మీడియా వేదికగా వారికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా పలు ఫొటోలు షేర్ చేశారు విఘ్నేశ్ శివన్. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఆమద్య ఘనంగా మహాబలిపురంలో వీరిద్దరూ ఘనంగా వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.
Nayan & Me have become Amma & Appa❤️
We are blessed with
twin baby Boys❤️❤️
All Our prayers,our ancestors’ blessings combined wit all the good manifestations made, have come 2gethr in the form Of 2 blessed babies for us❤️😇
Need all ur blessings for our
Uyir😇❤️& Ulagam😇❤️ pic.twitter.com/G3NWvVTwo9— Vignesh Shivan (@VigneshShivN) October 9, 2022