కొత్త వస్తువు కొన్నప్పుడు ఉత్సాహం తొణికిసలాడుతూ ఉంటుంది ఎవరికైనా. చిన్నదైనా.. పెద్దదైనా తమ కష్టార్జితంతో కొనుక్కున్నప్పుడు మురిపంగా చూసుకుంటాం కూడా. ఇక వాహనాల విషయంలో మరీను. జాగ్రత్తగా చూసుకుంటాం. ఎటువంటి గీతలు మరకలు పడకుండా చూసుకుంటాం. అలానే ఓ వ్యక్తి తాను కొన్న కొత్త కారును అంతే మురిపింగా చూసుకోవాలని తపించాడు. అయితే.. అనుకోని ప్రమాదానికి ఆ కారే గురైంది.. అదీ ఆయన తప్పిదంతోనే.
ఎక్కడ జరిగిందో తెలీదు కానీ.. ఓ వ్యక్తి కొత్త కారు కొనుక్కున్నాడు. అంతే ఆనందంలో కారు డ్రైవ్ చేసుకుంటూ ఇంటికి వచ్చాడు కూడా. అయితే.. కొత్త కారుతో గేటులోకి రాగానే బ్యాలెన్స్ తప్పాడు. దీంతో అక్కడే వరుసగా పార్క్ చేసి ఉన్న బైక్ ల పైకి దూసుకెళ్లిపోయాడు. దీంతో ఆ బైకులన్నీ కారు వేగం దాటికి దెబ్బతిన్నాయి. ఓ మాజీ వైమానిక అధికారి ఈ వీడియో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది. అయితే.. ఇది ఆయన తప్పిదమో.. కారులో సాంకేతిక లోపమో తెలీదు.
What a grand arrival home ? pic.twitter.com/ilSeNcKexD
— Sqn Ldr Vinod Kumar (Retd) (@veekay122002) October 7, 2022
672129 182208Quite interesting topic , appreciate it for putting up. 608312
296042 713356I really like what you guys are up too. Such clever work and exposure! Keep up the really excellent works guys Ive incorporated you guys to my own blogroll. 826515