Switch to English

ఏపీలో పక్కదారి పడ్తున్న ‘సంక్షేమం’.. ఇది ఎవరి వైఫల్యం.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,468FansLike
57,764FollowersFollow

ఆంధ్రప్రదేశ్‌లో సంక్షేమ పథకాల పేరుతో ‘ఓటు బ్యాంకు రాజకీయాలు’ ఏ స్థాయిలో నడుస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చంద్రబాబు హయాంలో సంక్షేమ పథకాలన్నీ ‘పచ్చ చొక్కాలకే’ అన్న ప్రచారం జరిగింది. ఇప్పుడు వైఎస్‌ జగన్‌ హయాంలోనూ అదే జరుగుతోంది. అయితే, ఇప్పుడు వైసీపీ చొక్కాల వైపే సంక్షేమ పథకాలు మొగ్గు చూపుతున్నట్లుంది పరిస్థితి. ‘పార్టీలు చూడం.. ఓటు వేసినవారికీ, వేయనివారికీ మా ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు అందుతాయి..’ అని సాక్షాత్తూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి చెబుతున్నా, గ్రౌండ్‌ లెవల్‌లో పరిస్థితులు అందుకు భిన్నంగా వుంటున్నాయి.

తాజాగా వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరపైకి తీసుకొచ్చిన ‘కాపు నేస్తం’ పథకం, అర్హులైనవారికి దక్కడం లేదన్న విమర్శలతోపాటు, అనర్హుల చేతుల్లోకి ఆ పథకం తాలూకు సొమ్ములు వెళుతున్నాయన్న విమర్శలు విన్పిస్తున్నాయి. కర్నూలు జిల్లాలో ‘కాపు నేస్తం’ నిర్దేశించబడిన వారికి కాకుండా, ఇతర కులాలకు చెందినవారికి దక్కడంతో అంతా విస్తుపోతున్నారు. విషయం బయటకు పొక్కడంతో అధికారులు నానా హైరానా పడుతున్నారు. అనర్హులకు ఇప్పటికే చేరిపోయిన ఆ డబ్బుల్ని తిరిగి రాబట్టేందుకు అధికారులు నానా తిప్పలూ పడాల్సి వస్తోంది.

ఇది ఒక్క ‘కాపు నేస్తం’ విషయంలోనే కాదు, చాలా విషయాల్లో ఇదే పరిస్థితి కన్పిస్తోంది. కొద్ది రోజుల క్రితం తూర్పుగోదావరి జిల్లాలో పేదలకు ఇళ్ళ పట్టాల కోసం ప్రైవేటు భూమిని సేకరించిన అధికారులు, ఈ క్రమంలో భూమిని విక్రయించిన వ్యక్తికి రెండు సార్లు చెల్లింపులు జరపడం వివాదాస్పదమయ్యింది. అదనంగా చెల్లించిన డబ్బుని తిరిగి రాబట్టడానికి అధికారులు పడ్తున్న తిప్పలు అన్నీ ఇన్నీ కావు.

ఇక, పేదలకు ఇళ్ళ స్థలాలు ఇచ్చే కార్యక్రమానికి సంబంధించి ఎక్కువగా అనర్హులే లిస్ట్‌లో వున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్న విషయం విదితమే. మరి, ఈ వైఫల్యాలకు కింది స్థాయి అధికారులు బాధ్యత వహిస్తారా.? లేదంటే, ‘వైసీపీ కండువాల’ ఒత్తిడి మేరకే, పథకాలు పక్కదారి పడుతున్నాయని అనుకోవాలా.? కుప్పలు తెప్పలుగా సంక్షేమ పథకాల్ని ప్రకటించేసి, గ్రౌండ్‌ లెవల్‌లో సరైన మెకానిజం లేకుండా చేయడంతోనే ఈ పరిస్థితి తలెత్తుతోందన్న విపక్షాల విమర్శలకు ప్రభుత్వం ఏం సమాధానమిస్తుందో వేచి చూడాలి.

ఏపీలో పక్కదారి పడ్తున్న ‘సంక్షేమం’.. ఇది ఎవరి వైఫల్యం.?

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Puri Jagannadh: ఎవరు కొడితే బొమ్మ బ్లాక్ బస్టరవుద్దో.. అతనే ‘పూరి...

Puri Jagannadh: సినిమాకి హీరోకి ఉండే క్రేజే వేరు. సరైన సినిమాపడి స్టార్ స్టేటస్ వస్తే ఫ్యాన్స్ పెరుగుతారు.. డెమీ గాడ్ కూడా అయిపోతాడు. హీరో...

Harish Shankar: చోటా కె.నాయుడుపై హరీశ్ శంకర్ ఆగ్రహం.. బహిరంగ లేఖ

Harish Shankar: టాలీవుడ్ (Tollywood) సీనియర్ స్టార్ సినిమాటోగ్రాఫర్ చోటా కె.నాయుడు (Chota K Naidu) పై బ్లాక్ బస్టర్ దర్శకుడు హరీశ్ శంకర్ (Harish...

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

Ritu Varma: నభా నటేశ్-ప్రియదర్శికి రీతూవర్మ క్లాస్.. ట్వీట్ వార్ వైరల్

Ritu Varma: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ‘డార్లింగ్’ సంబోధనపై మాటల యుద్ధం వైరల్ అయిన సంగతి తెలిసిందే....

Chiranjeevi: చిరంజీవితో రష్యన్ సినిమా ప్రతినిధుల భేటీ.. చర్చించిన అంశాలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)తో రష్యా నుంచి వచ్చిన మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి...

రాజకీయం

మెగాస్టార్ చిరంజీవి మీద పడి ఏడుస్తున్న వైసీపీ బ్యాచ్.!

2024 ఎన్నికల్లో దారుణ పరాజయాన్ని ముందే ఊహించుకున్న వైసీపీ, ప్రతి చిన్న విషయానికీ కలత చెందుతోంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పుట్టినరోజు సందర్భంగా పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు...

జగన్‌కి షాకిచ్చిన విద్యార్థులపై సస్పెన్షన్ వేటు.!

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల్లో ‘బస్సు యాత్ర’ సందర్భంగా మైండ్ బ్లాంక్ అయ్యింది. అదీ, ఓ విద్యా...

పిఠాపురంలో వంగా గీతకు అదే పెద్ద మైనస్.!

నామినేషన్ల పర్వం షురూ అయ్యింది.! జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 23న పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు. పిఠాపురంలో జనసేనాని పోటీ చేస్తున్నారని కన్ఫామ్ అయినప్పటికీ, ఇప్పటికీ.....

గ్రౌండ్ రిపోర్ట్: నిడదవోలులో జనసేన పరిస్థితేంటి.?

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని నిడదవోలు నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు ఎలా వున్నాయ్.? 2024 ఎన్నికల్లో ఏ పార్టీ ఈ నియోజకవర్గం నుంచి గెలవబోతోంది.? నాటకీయ పరిణామాల మధ్య జనసేన పార్టీకి ‘కూటమి’ కోటాలో...

స్క్రిప్ట్ చేతిలో వైఎస్ జగన్ ఎందుకు బందీ అయ్యారు.!?

అసలేమయ్యింది వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి.? సుదీర్ఘ పాదయాత్ర చేసిన సమయంలో ఎవరి స్క్రిప్ట్ అవసరం లేకుండానే ప్రసంగాలు చేశారు కదా.? కానీ, ఇప్పుడేమయ్యింది.? స్క్రిప్టు చేతిలో వుంటే తప్ప మాట్లాడలేకపోతున్నారు.. ఆ...

ఎక్కువ చదివినవి

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్ అంటున్న మేకర్స్

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad Square) తెరకెక్కబోతోంది. యూత్ ఓరియంటెడ్ మూవీస్...

నీలి కూలి మీడియా పాట్లు.! అన్నీ ఇన్నీ కావయా.!

ఘటన జరిగింది.! అది కావాలనే చేయించుకున్నారా.? ఎవరైనా కావాలని చేశారా.? అన్నది ఓ దశాబ్ద కాలం తర్వాతైనా తేలుతుందో లేదో తెలియదు.! ఓ గొడ్డలితో గుండె పోటు.. ఓ కోడి కత్తి.. అలా...

Nara Rohit: నారా రోహిత్ @20 ‘సుందరకాండ’.. ఫస్ట్ లుక్, రిలీజ్ డేట్ రివీల్

Nara Rohit: నారా రోహిత్ (Nara Rohit) హీరోగా నటిస్తున్న 20వ సినిమా ‘సుందరకాండ’. శ్రీరామనవమి పండగ సందర్భంగా చిత్ర బృందం టైటిల్ రివీల్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేసింది. నూతన దర్శకుడు...

పిఠాపురంలో వంగా గీతకు అదే పెద్ద మైనస్.!

నామినేషన్ల పర్వం షురూ అయ్యింది.! జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 23న పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు. పిఠాపురంలో జనసేనాని పోటీ చేస్తున్నారని కన్ఫామ్ అయినప్పటికీ, ఇప్పటికీ.....

స్క్రిప్ట్ చేతిలో వైఎస్ జగన్ ఎందుకు బందీ అయ్యారు.!?

అసలేమయ్యింది వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి.? సుదీర్ఘ పాదయాత్ర చేసిన సమయంలో ఎవరి స్క్రిప్ట్ అవసరం లేకుండానే ప్రసంగాలు చేశారు కదా.? కానీ, ఇప్పుడేమయ్యింది.? స్క్రిప్టు చేతిలో వుంటే తప్ప మాట్లాడలేకపోతున్నారు.. ఆ...