Switch to English

జిల్లాల విభజన: చంద్రబాబుకి ‘చెక్‌’ పెడుతున్న వైఎస్‌ జగన్‌.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,449FansLike
57,764FollowersFollow

జిల్లాల విభజన తేనెతుట్టెలాంటిదన్నదాంట్లో ఎవరికీ ఎలాంటి సందేహాల్లేవు. అయితే, ఈ విషయంలో అధికార పార్టీకి అడ్వాంటేజెస్‌తోపాటు, డిజడ్వాంటేజెస్‌ కూడా వుంటాయి. నెగెటివిటీని అధిగమించడం అంత ఆషామాషీ వ్యవహారం కాదు. అయితే, తెలంగాణలో జిల్లాల విభజన విషయంలో సొంత పార్టీలో వచ్చిన నెగెటివిటీని అధికార తెలంగాణ రాష్ట్ర సమితి తేలిగ్గానే అధిగమించగలిగింది. తెలంగాణలో రాజకీయ పరిస్థితులు వేరు. టీఆర్‌ఎస్‌కి తెలంగాణలో బలమైన ప్రతిపక్షం లేదు. కానీ, ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి అలా కాదు.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల లొల్లి క్రమక్రమంగా తీవ్ర రూపం దాల్చుతోంది. సొంత పార్టీకి చెందిన ఓ సీనియర్‌ ఎమ్మెల్యేతోపాటు, స్పీకర్‌ పదవిలో వున్న మరో సీనియర్‌ నేత జిల్లాల విభజనపై పెదవి విప్పారు. ‘జిల్లాల విభజనకు వ్యతిరేకం కాదు..’ అంటూనే తమ సొంత జిల్లా శ్రీకాకుళం విషయంలో పెదవి విరుస్తున్నారు ధర్మాన ప్రసాదరావు, తమ్మినేని సీతారాం.

మరోపక్క, ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ ఈ జిల్లాల విభజనపై ఉలిక్కిపడుతోంది. లోక్‌సభ నియోజకవర్గాల వారీగా విభజన అంటే అది అస్సలేమాత్రం సమర్థనీయం కాదన్నది టీడీపీ వాదన. సాధారణంగా ఈ తరహా ‘విభజన’ రాజకీయాల వెనుక, అధికార పార్టీలకు రాజకీయ ప్రయోజనాలు సుస్పష్టం. గతంలో వైఎస్‌ హయాంలో, కొన్ని జిల్లాల్లో నియోజకవర్గాల విభజన తదితర పరిణామాలు గందరగోళంగా సాగాయి. అధికార పార్టీకి ఇలాంటి విషయాల్లో ఎడ్జ్‌ ఎక్కువ.

తమ రాజకీయ ప్రయోజనాల్ని దృష్టిలో పెట్టుకుని, ప్రత్యర్థుల్ని రాజకీయంగా దెబ్బకొట్టేలా ఈ విభజనలు చేస్తుంటాయి. ఇప్పుడు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం కూడా అదే స్కెచ్‌ వేస్తున్నట్లు తెలుస్తోంది. టీడీపీ బలంగా వున్న చోట్ల గ్రౌండ్‌ లెవల్లో ‘చీలిక’ తీసుకొస్తే, రాజకీయంగా అడ్వాంటేజ్‌ అవుతుందని వైసీపీ భావిస్తోందట. దాంతో టీడీపీలో గుబులు బయల్దేరింది.

మరోపక్క వైసీపీలో విన్పిస్తున్న ‘అసహనం’ జస్ట్‌ పబ్లిసిటీ స్టంట్‌గానే భావించాల్సి వస్తుందనీ, ఇదంతా విపక్షాల దృష్టి మరల్చడానికేనని టీడీపీ అనుమానం వ్యక్తం చేస్తోంది. దాదాపు ప్రతి జిల్లాల్లోనూ కొత్త జిల్లాల ఏర్పాటు కారణంగా టీడీపీ ఓటు బ్యాంకు చీలిపోయేలా అధికార వైసీపీ వ్యూహం ఖరారు చేసిందట. గతంలో వైఎస్‌ ఇదే తరహా విభజన రాజకీయాలకు తెర తీసి (అసెంబ్లీ నియోజకవర్గాల విభజన) టీడీపీని దారుణంగా దెబ్బ తీశారనీ, ఇప్పుడూ అదే పరిస్థితి రాబోతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

కాగా, 2024 ఎన్నికల నాటికి ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య పెరగబోతోంది. ఈ మేరకు విభజన చట్టంలోనే పొందుపర్చారు. దాంతో, ఈ జిల్లాల విభజనకీ, ఆ నియోజకవర్గాల పెంపు వ్యవహారానికీ పొంతన ఎలా కుదురుతుంది.? రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు ఎలా మారబోతున్నాయి.? అధికార పార్టీకి అడ్వాంటేజ్‌ అవుతుందా.? లేదంటే విభజన కాస్తా ‘బూమరాంగ్‌’ వ్యవహారంలా మారి, అధికార పార్టీని ఇరకాటంలో పడేస్తుందా.? వేచి చూడాల్సిందే.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

రాజకీయం

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

ఎక్కువ చదివినవి

Naveen Chandra : టాలెంటెడ్‌ హీరోకి దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డ్‌

Naveen Chandra : అందాల రాక్షసి సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్న నవీన్ చంద్ర హీరోగా ఇప్పటి వరకు ఎన్నో పాత్రల్లో నటించి మెప్పించాడు. ఈతరం యంగ్‌ హీరోల్లో చాలా మంది...

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

Bahubali Animated Series: మరో సంచలనం..! ‘బాహుబలి’పై రాజమౌళి ప్రకటన

Bahubali Animated Series: భారతీయ సినీ పరిశ్రమ మొత్తం తెలుగు సినిమా వైపు చూసేలా చేసిన సినిమాలు బాహుబలి (Bahubali) సిరీస్. రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో వచ్చిన రెండు సినిమాలు బాక్సాఫీస్ ను...

ఎన్నికల వేళ గిట్టబాటవుతున్న ‘కూలీ’.!

ఎన్నికల ప్రచారం ఓ ప్రసహనం ఈ రోజుల్లో.! మండుటెండల్లో అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీల క్యాడర్ పడే పాట్లు వేరే లెవల్.! కింది స్థాయి నేతల కష్టాలూ అన్నీ ఇన్నీ కావు.! ఇంతకీ, ఎన్నికల...

సినిమా రివ్యూ: ఆ ఒక్కటీ అడక్కు

అలనాటి మేటి చిత్రం.. అనదగ్గ వాటిల్లో ఒకటైన ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్‌తో అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన చిత్రం కావడంతో, సహజంగానే ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్‌లో సినిమాపై ఆసక్తి క్రియేట్...