నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన జెర్సీ ఇటీవలే విడుదలై యూనానిమస్ టాక్ తో సూపర్ హిట్ అందుకుంది. ఈ సినిమా అటు విమర్శకుల ప్రశంశలు సైతం అందుకుంటూ క్లాసిక్ సినిమా అంటూ పొగిడేస్తున్నారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన జెర్సీ తెలుగు రాష్ట్రాలతో పాటు అటు ఓవర్ సీస్ లోకూడా దుమ్ము రేపుతోంది. భారీ వసూళ్ల దిశగా దూసుకుపోతుంది. ఈ సినిమాపై పలువురు స్టార్స్ కూడా ప్రశంశల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా మన రౌడీ హీరో విజయ్ దేవరకొండ కూడా జెర్సీ పై ప్రశంశలు కురిపించాడు.
ఈచిత్రం చూస్తుంటే నాని పై ఎంతో ప్రేమ కలిగింది. క్రికెటర్ అర్జున్ క్లాప్ కొట్టించాడు. సినిమాలో లీనం అయ్యేలా చేసాడు. హిట్టింగ్ తో ఉక్కిరి బిక్కిరి చేసాడు. దర్శకుడు గౌతమ్ తిన్ననూరి వెరీ టాలెంటెడ్ అనడానికి ఈ ఒక్క సినిమా చాలు. జెర్సీ ప్రేమలో ఓ గమనిక, నాని ఈ దెబ్బతో హైదరాబాద్ సన్ రైజర్స్ కు ఆడొచ్చు .. స్ట్రైకింగ్ అదరగొట్టాడు. అంటూ ఆసక్తికరమైన ట్విట్ చేసాడు విజయ్. ప్రస్తుతం విజయ్ ట్విట్ వైరల్ అవుతుంది. ఇప్పటికే ఈ ట్విట్ కు ఇరవైరెండు వేల లైక్స్ వచ్చాయి.
Jersey ❤
I choked up, I clapped, I rooted for Arjun.@NameisNani – Full love to you.@gowtam19 – I am so excited to see all that you have in store.Note – Nani should play for SRH. What striking.
— Vijay Deverakonda (@TheDeverakonda) April 21, 2019
నానితో విజయ్ దేవరకొండకు మంచి రిలేషన్ ఉంది. ఇద్దరు కలిసి ఎవడె సుబ్రహ్మణ్యం సినిమాలో నటించారు. ఇక నాని కూడా తనకు చాలా సంతృప్తి ఇచ్చిన సినిమా ఇదేనని చెప్పాడు. ఈ సినిమా పై నాని పెట్టుకున్న ఆశలు నెరవేరాయి. మొత్తానికి నాని కెరీర్ లోనే బెస్ట్ సినిమాగా ప్రశంశలు అందుకుంటున్నాడు. జెర్సీ విషయంలో ఇప్పటికే ఎన్టీఆర్, అల్లు అర్జున్ తో పాటు పలువురు స్టార్స్ ప్రశంశలు కురిపిస్తున్నారు.
