తెలుగులో సిద్దు ఫ్రమ్ శీకాకుళం సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్సిన శ్రద్ధ దాస్, ఆ సినిమాతో గ్లామర్ భామగా మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఆ తరువాత పలు తెలుగు సినిమాల్లో నటించినా ఈమెకు కెరీర్ పరంగా సరైన సక్సెస్ మాత్రం దక్కలేదు. దాంతో క్రియేటివ్ దర్శకుడు కృష్ణవంశీ తీసిన మొగుడు సినిమాలో గోపిచంద్ సరసన నటించింది. ఆ సినిమాలో అదరగొట్టేలా బికినీతో షాకిచ్చింది. ఆ పోజులు చూసి జనాలు షాకయ్యారు కానీ ఆమెకు హిట్టు మాత్రం దక్కలేదు. దాంతో తెలుగులో లాభం లేదనుకుందో ఏమో అటు బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చి రెండు సినిమాల్లో నటించింది.
అవికూడా యావరేజ్ హిట్స్ గా మిగలడంతో శ్రద్ధ తాజాగా ప్యూర్ సోల్ అంటూ ఓ షార్ట్ ఫిలింలో నటించింది. ఓ వేశ్య మనోభావాన్ని, కల్మషం లేని హృదయాన్ని ఓ పెయింటర్ కళా దృష్టితో గొప్ప చిత్రంగా వేస్తాడు. మెసెజ్ ఓరియెంటెడ్ కథతో సాగిన ఈ షార్ట్ ఫిలిం ప్యూర్ సోల్ అనే టైటిల్ తో తెరకెక్కింది. వర్ణ అనే పెయింటర్ లవ్ లో ఫెయిల్ అయి ఓ మంచి పెయింటర్ గా పేరు తెచ్చుకుంటాడు.పారిస్ లో జరిగే పెయింటింగ్ ప్రదర్శనలో తన 100 వ పెయింటింగ్ పోటీలో పెట్టె క్రమంలో ఆ పెయింటింగ్ కోసం ఒక వేశ్య శ్వేత (శ్రద్ధ దాస్ ) ను ఎంచుకుంటాడు. ఆ పెయింటింగ్ వేసే క్రమంలో వీరిద్దరి మధ్య జరిగే సంభాషణ, వేశ్యగా మారిన శ్వేత మనసు ఎంత స్వచ్ఛమైందో తెలుసుకుంటాడు వర్ణ. తాను ప్రేమించిన అమ్మాయిలో అబద్దాన్ని చూసిన వర్ణ .. శ్వేతా లో ప్యూరిటీ చూస్తాడు. అలాగే వర్ణ లోని నిజాయితీని గమనిస్తుంది శ్వేత. తాను తన శరీరాన్ని మాత్రమే అమ్ముకుంటున్నాను తప్ప మనసును కాదంటూ శ్వేతా చెప్పిన మాటలకు ఫిదా అయినా వర్ణ ఓ గొప్ప పెయింటింగ్ ని గీస్తాడు.
ఆ పెయింటింగ్ ని చూసిన శ్వేత, వర్ణ గొప్పతనానికి ఫిదా అవుతుంది. ఈ షార్ట్ ఫిలిం కోసం శ్రద్ధ దాస్ న్యూడ్ గా నటించి షాకిచ్చింది. ఇటీవలే విడుదలైన ఈ షార్ట్ ఫిలింకు మంచి ప్రశంశలు దక్కుతున్నాయి. దర్శకుడు కూడా జెన్యూన్ ప్రయత్నం చేసాడని అంటున్నారు. మళ్ళీ తెలుగులో హీరోయిన్ గా ప్రయత్నాలు మొదలు పెడుతున్న ఈ అమ్మడి ప్రయత్నాలు తెలుగులో ఫలిస్తాయో లేదో చూడాలి.
