Switch to English

‘జెర్సీ’ని తన్నుకుపోతున్న ‘కాంచన’

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,432FansLike
57,764FollowersFollow

స్ట్రెయిట్‌ తెలుగు సినిమాని డబ్బింగ్‌ సినిమాలు కలెక్షన్ల పరంగా దెబ్బ కొట్టడం అనేది కొత్త విషయం కాదు. అయితే ‘కాంచన-3’ లాంటి ఓ మాస్‌ హర్రర్‌ కామెడీ, ‘జెర్సీ’ లాంటి ఓ మంచి సినిమాపై ‘వసూళ్ళ దెబ్బ’ వేయడం చాలామంది సినీ జనాలకు నచ్చడంలేదు. డాన్స్‌ కొరియోగ్రాఫర్‌, దర్శకుడు, నటుడు లారెన్స్‌ నటించిన ‘కాంచన-3’ సినిమాకి తొలి రోజు మరీ అంత మంచి రేటింగ్స్‌ రాలేదుగానీ, వసూళ్ళ పరంగా మాత్రం సత్తా చాటుతోంది. ‘జెర్సీ’ సినిమాకి అదిరిపోయే రేటింగ్స్‌ వచ్చినా ఆ రేటింగ్స్‌కి తగ్గ వసూళ్ళు సాధించడంలో కొంత వెనుకబడుతున్నట్లు కన్పిస్తోంది.

తొలి వీకెండ్‌ ముగిసింది. ‘కాంచన-3’ పోటీలో లేకపోయి వుంటే, ‘జెర్సీ’ సినిమా తొలి వీకెండ్‌లో అదిరిపోయే వసూళ్ళను సొంతం చేసుకునేదని ట్రేడ్‌ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ‘జెర్సీ’కి ఇప్పుడు వచ్చిన వసూళ్ళు బాగానే వున్నా, ఈ జోరు సరిపోదనీ, ఇంతకు మించిన జోరు ప్రదర్శిస్తేనే ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ని మ్యాచ్‌ చేసేలా ఫైనల్‌ ఫిగర్స్‌ వుంటాయని అయితే అది సాధ్యమయ్యేలా కనిపించడంలేదని ఓ ట్రేడ్‌ పండితుడు అభిప్రాయపడ్డాడు. ఈ ఏడాది ఇప్పటిదాకా అత్యధిక రేటింగ్స్‌ సాధించిన సినిమా ఏదన్నా వుందంటే అది ‘జెర్సీ’ మాత్రమేనని వారు గుర్తు చేస్తున్నారు.

సంక్రాంతికి విడుదలైన ‘ఎఫ్‌-2’ (ఫన్‌ అండ్‌ ఫ్రస్ట్రేషన్‌) ఈ ఏడాది అత్యధిక వసూళ్ళను సాధించిన సినిమా. దానికి సైతం ఓ మోస్తరు రేటింగ్స్‌ మాత్రమే రావడం చూశాం. అలాంటి వసూళ్ళ సినిమా మళ్ళీ టాలీవుడ్‌కి ఏప్రిల్‌లోనే దొరికే అవకాశముంది. అయితే, ఏప్రిల్‌ మాత్రం తెలుగు సినిమాకి మంచి కళ తీసుకొచ్చింది. ‘మజిలీ’ సినిమా మంచి విజయాన్ని అందుకుంది, అదీ యావరేజ్‌ రేటింగ్స్‌తోనే. ‘చిత్రలహరి’ కూడా చెప్పుకోదగ్గ విసయాన్నే సాధించింది, ఇక్కడా రేటింగ్స్‌ గొప్పగా ఏం లేవు.

నాగచైతన్య కెరీర్‌లోనే బెస్ట్‌ ఫిలింగా మారింది ‘మజిలీ’. ‘చిత్రలహరి’ సైతం ఇటీవలి కాలంలో సాయిధరమ్‌ తేజ్‌కి అతి పెద్ద విజయంగా చెప్పుకోవాల్సి వుంటుంది. ‘జెర్సీ’ రాకతో ‘మజిలీ’కి కొంత ఉత్సాహం పెరిగితే, ఆ ఎఫెక్ట్‌తో ‘చిత్రలహరి’ కొంత వెనుకబడింది. ‘కాంచన-3’ విషయానికొస్తే, బి మరియు సి కేంద్రాల్లో వసూళ్ళ పరంగా సంచలనాలే సృష్టిస్తోంది ఈ హర్రర్‌ కామెడీ. తొలి వీకెండ్‌ ముగిసిన తర్వాత, రూరల్‌ ఏరియాస్‌లో ‘జెర్సీ’ని ‘కాంచన’ అధిగమించినా ఆశ్చర్యపోనక్కర్లేదంటున్నారు.

కొంత భయం, ఇంకొంత గ్లామర్‌, దానికి తోడు కామెడీ ఇవన్నీ రిపీట్‌ ఆడియన్స్‌ని రప్పిస్తున్నాయనీ, అదే ‘కాంచన-3’కి కాసుల వర్షం కురిపిస్తోందని నిస్సందేహంగా చెప్పొచ్చు. ‘జెర్సీ’ సహా మిగిలిన రెండు ఏప్రిల్‌ రిలీజ్‌లూ ఎమోషనల్‌ పాయింట్‌తో అల్లుకున్న కథలే. దాంతో, రిపీట్‌ ఆడియన్స్‌ స్ట్రెయిట్‌ తెలుగు సినిమాలకంటే, డబ్బింగ్‌ సినిమా వైపుకే కనిపిస్తున్నారు.

ఏదిఏమైనా, ‘మజిలీ’తోపాటు ‘చిత్రలహరి’ కూడా సేఫ్‌ జోన్‌లోకి వెళ్ళిపోయిన దరిమిలా, ‘జెర్సీ’ ఇప్పుడు ఆ జోన్‌లోకి ఎంటర్‌ అవ్వాల్సింది. అయితే ‘కాంచన-3’ అందుకు ప్రతిబంధకంగా మారిన దరిమిలా, మంచి సినిమాని ప్రేక్షకులు గట్టెక్కిస్తారా? లేదంటే డబ్బింగ్‌ సినిమాతోనే పండగ చేసుకోవడంలోనే మునిగి తేలుతారా? అనే ప్రశ్నలకు సమాధానం వీకెండ్‌ ముగిశాక తొలి రోజు అయిన నేటి సాయంత్రానికే దొరకవచ్చు.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...

వైసీపీ ఇస్తే తీసుకుంటాం.! ఓటు మాత్రం కూటమికే వేస్తాం.!

‘ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్ని నమ్మడానికి వీల్లేదు. ఆ పార్టీ నుంచి గెలిచి, ఈ పార్టీలోకి దూకేస్తారు. పూటకో పార్టీ మార్చేస్తారు..’ అని జనం చర్చించుకోవడం చూస్తున్నాం. మరి, ఆ జనం గురించి...

ఎక్కువ చదివినవి

Chiranjeevi: పిఠాపురం ప్రజలు పవన్ ను గెలిపించండి.. అండగా ఉంటాడు: చిరంజీవి

Chiranjeevi: ‘జనమే జయం అని నమ్మే పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మీ ముందుకు వచ్చాడు. మీ కోసం సైనికుడిగా.. సేవకుడిగా నిలబడతాడు. మీకేం చేయగలడో చూడాలంటే పిఠాపురం ప్రజలు జనసేన (Janasena)కు...

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...

Janasena: నిర్మాత ఏఎం.రత్నంకు జనసేన కీలక బాధ్యతలు.. పవన్ కల్యాణ్ నిర్ణయం

Janasena: ఏపీలో ఎన్నికల పర్వం దగ్గరకొస్తోంది. ఈక్రమంలో జనసేన (Janasena) తన ఎన్నికల ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గానికి నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam)ను అధినేత పవన్...

బర్త్ డే స్పెషల్ : రౌడీ స్టార్‌ టు ఫ్యామిలీ స్టార్‌

2012 లో వచ్చిన లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌ సినిమాలో చిన్న పాత్రలో కనిపించిన విజయ్ దేవరకొండ 2015 లో మొదటి సారి మెయిన్ లీడ్‌ రోల్‌ ను ఎవడే సుబ్రహ్మణ్యంలో చేశాడు. ఆ...

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి మళ్లీ ఎప్పుడెప్పుడు సినిమాలు వస్తాయా అంటూ...