న్యాచురల్ స్టార్ నాని నటించిన దసరా చిత్రం మార్చ్ 30న విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ము దులుపుతోన్న విషయం తెల్సిందే. మొదటి రోజే ఈ చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకుని 38 కోట్ల గ్రాస్ వసూలు చేయగా రెండు రోజులకు కలిపి ఇప్పుడు 50 కోట్ల గ్రాస్ మార్క్ ను టచ్ చేసింది. నిన్న వర్కింగ్ డే కాబట్టి ఆ మాత్రం ఫాల్ తప్పదంటున్నారు ట్రేడ్ పండితులు.
మళ్ళీ ఈరోజు, రేపు దసరా కలెక్షన్స్ పుంజుకుంటాయని చెబుతున్నారు. ఈ రకంగా చూసుకుంటే దసరా 100 కోట్ల మార్క్ ను టచ్ చేయడం ఎంతో దూరంలో లేదు. ఓవర్సీస్ లో కూడా దసరా ఈరోజో, రేపో 1 మిలియన్ మార్క్ ను టచ్ చేస్తోంది. ఇక ఫుల్ రన్ లో స్టడీగా ఉంటే 2 మిలియన్ టచ్ చేయడం కూడా అసాధ్యం కాకపోవచ్చు.
శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన విషయం తెల్సిందే.