Switch to English

నందమూరి కుటుంబం.. అప్పుడెందుకు స్పందించలేదు చెప్మా.!

స్వర్గీయ నందమూరి తారక రామారావు కుమార్తె భువనేశ్వరిపై వైసీపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేశారన్నది తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఆరోపణ. తన భార్యపై జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేశారంటూ భువనేశ్వరి భర్త, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కన్నీరు మున్నీరయ్యారు మీడియా ముందు.

దాంతో, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సహా, నందమూరి కుటుంబ సభ్యులు కొందరు మీడియా ముందుకొచ్చారు. నందమూరి బాలకృష్ణ మరో సోదరి చాముండేశ్వరి, సోదరుడు రామకృష్ణ తదితరులు మీడియా ముందుకొచ్చి, వైసీపీ నేతలు భువనేశ్వరిపై చేసిన వ్యాఖ్యల్ని ఖండించారు.

నారా భువనేశ్వరి మీద వైసీపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేసి వుంటే ఖండించాల్సిందే. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. సభ్య సమాజం ఇలాంటి వ్యవహారాల్ని హర్షించదు. వ్యక్తుల వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూడటం అనేది నాయకత్వం అనిపించుకోదు. ఆ సంగతి పక్కన పెడదాం.

స్వర్గీయ నందమూరి తారకరామారావు విషయంలో చంద్రబాబు వ్యవహరించిన తీరుని అప్పట్లో నందమూరి కుటుంబం ఎందుకు ఖండించలేకపోయింది. స్వర్గీయ ఎన్టీయార్, తనను చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని కన్నీరు మున్నీరైతే, ఎన్టీయార్ కుటుంబం నుంచి ఎవరూ ఆయన తరఫున నిలబడలేదేం.?

‘అబ్బే, అది వెన్నుపోటు కాదు.. నాయకత్వ మార్పు.. లక్ష్మీపార్వతి కారణంగా నందమూరి కుటుంబం, తెలుగుదేశం పార్టీ, అలాగే రాష్ట్రం ప్రమాదంలో పడింది కాబట్టే ఆ నిర్ణయం..’ అని చెబుతుంటారుట టీడీపీలో కొందరు నేతలు. కానీ, స్వయానా ఎన్టీయార్ కంటతడి పెట్టారు, బోరున విలిపించారు.. అల్లుడు చంద్రబాబు పొడిచిన వెన్నుపోటుపై.

అన్ని వ్యవహారాలూ ఇప్పుడు చర్చకు వస్తున్నాయ్.. నందమూరి కుటుంబం ఈ రోజు మీడియా ముందుకొచ్చి.. చంద్రబాబుకి మేలు చేయకపోగా.. నందమూరి కుటుంబమే విమర్శల్ని ఎదుర్కొనే పరిస్థితికి వచ్చింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

ఏపీలో నైట్ కర్ఫ్యూ వెనక్కు.. పండగే కారణం

ఆంద్ర ప్రదేశ్‌ ప్రభుత్వం తాజాగా కరోనా కేసుల కట్టడిలో భాగంగా నైట్‌ కర్ఫ్యూను అమలు చేయబోతున్నట్లుగా ప్రకటించిన విషయం తెల్సిందే. సంక్రాంతి ముందు ఇలాంటి కర్ఫ్యూ...

పవన్‌ వీరమల్లు షూటింగ్ లో జాయిన్‌ అయ్యేది ఎప్పుడంటే..!

పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ విడుదలకు సిద్దం అయ్యింది. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ సినిమా షూటింగ్‌ పూర్తి అయ్యి విడుదల కు...

టీడీపీకి సినిమా పరిశ్రమ ఎప్పుడు సహకరించలేదు

టాలీవుడ్‌ కు చెందిన ప్రముఖులు తెలుగు దేశం పార్టీకి సహకరిస్తున్నారు.. వారికి కనీసం ఏపీ రాష్ట్రం ఉంది అని కాని.. సీఎంగా జగన్‌ మోహన్‌ రెడ్డి...

ప్రాజెక్ట్‌ కే విడుదలపై ఓ పుకారు

ప్రభాస్‌ నటించిన రాధే శ్యామ్‌ విడుదలకు సిద్దంగా ఉంది. యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌ లో రూపొందిన రాధే శ్యామ్ ను సంక్రాంతికి విడుదల చేయాలని భావించినా...

తండ్రితో స్క్రీన్ షేర్ చేసుకొంటున్న శివాని రాజశేఖర్

రాజశేఖర్ లేటెస్ట్ గా శేఖర్ చిత్రంలో నటించిన విషయం తెల్సిందే. ఈ సినిమాను మొదట సంక్రాంతికి విడుదల చేయాలనుకున్నారు కానీ కోవిడ్ పాజిటివ్ కేసులు బాగా...

రాజకీయం

యూపీలో బీజేపీ గట్టి దెబ్బ.. ఎస్పీలోకి మంత్రి ఎమ్మెల్యేలు జంప్‌

ఉత్తరప్రదేశ్‌ లో జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు గాను అఖిలేష్ యాదవ్‌ పార్టీ అయిన సమాజ్ వాది పార్టీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. బీజేపీ కి అత్యంత కీలకమైన ఉత్తర ప్రదేశ్...

చిరంజీవి ప్రజారాజ్యంపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

మెగాస్టార్ చిరంజీవిపై టీడీపీ అధినేత చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. 2009లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టకుంటే ఆనాడే అధికారంలోకి వచ్చేవాళ్లమని అన్నారు. చిరంజీవి పార్టీ పెట్టకముందు, తర్వాత కూడా తనతో బాగానే...

బులుగు జర్నలిజం: నష్టమొస్తే సినిమాలెందుకు తియ్యాలి.?

సినిమా అంటే వ్యాపారం.. విజయవంతమైన సినిమాల విషయానికొస్తే, 2 శాతం వరకు మాత్రమే వుంటుంది.. అలాంటప్పుడు, నష్టాల్లో సినిమా వ్యాపారమెందుకు చెయ్యాలి.? అంటూ బులుగు జర్నలిజం ఓ అద్భుతమైన ప్రశ్న సంధించేసింది. దాంతో,...

మధ్యతరగతే లక్ష్యం.. ‘జగనన్న స్మార్ట్ టౌన్ షిప్స్’ ను ప్రారంభించిన సీఎం జగన్

మధ్యతరగతి వారికి ‘జగనన్న స్మార్ట్ టౌన్ షిప్స్’ ద్వారా మార్కెట్ ధర కంటే తక్కువకే ఫ్లాట్లు ఇస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ‘జగనన్న స్మార్ట్ టౌన్ షిప్స్’...

హీరో సిద్దార్ధ బూతు పైత్యం వెనుక.!

పాపం ‘మహాసముద్రం’ సినిమా దెబ్బకి తన అడ్రస్ సినీ రంగంలో గల్లంతయ్యిందనుకున్నాడో ఏమో, ఆ ఆవేదనలో సోషల్ మీడియా వేదికగా బూతు ట్వీటు ద్వారా పాపులారిటీ పెంచుకునేందుకు ప్రయత్నించి చిక్కుల్ని కొనితెచ్చుకున్నాడు. మొన్నామధ్యన...

ఎక్కువ చదివినవి

పావురం కాలికి చైనా భాషలో ట్యాగ్..! విచారిస్తున్న పోలీసులు

కాలికి చైనా ట్యాగ్ ఉన్న ఓ పావురం ప్రకాశం జిల్లా చీమకుర్తిలో స్థానికుల కంటపడటం కలకలం రేపుతోంది. ఇదే తరహా పావురం ఓడిశాలోనూ కనబడటం విశేషం. ఈ పావురం స్థానికంగా ఓ భవనంపై...

త్వరలో.. ఏపీలో జగనన్న స్మార్ట్ టౌన్స్..!

ఇప్పటికే జగనన్న కాలనీలు నిర్మిస్తున్న వైసీపీ ప్రభుత్వం.. త్వరలో మధ్య ఆదాయ వర్గాల వారి కోసం జగనన్న స్మార్ట్ టౌన్స్ నిర్మించనుంది. గుంటూరు జిల్లా మంగళగిరి ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ సమీపంలో జగనన్న...

ఆచార్య కూడా వాయిదా పడనుందా?

కోవిడ్ కారణంగా బాగా ఎఫెక్ట్ అయిన చిత్రాల్లో ఆచార్య కూడా ఒకటి. మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందుతోన్న ఈ చిత్రం గత మూడేళ్ళ నుండి ప్రొడక్షన్ దశలోనే ఉంది....

సేనాపతిపై ప్రశంసలు కురిపించిన చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి ఇటీవలే విడుదలైన సేనాపతిపై ప్రశంసలు కురిపించాడు. తన కూతురు సుష్మితతో కలిసి నిర్మించిన విష్ణు ప్రసాద్ గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ ను కూడా మెచ్చుకున్నారు. "సేనాపతి చూసాను. యువ దర్శకుడు పవన్...

విషాదం: మునేరు వాగులో గల్లంతైన చిన్నారులు మృత్యువాత

సరదాగా గడపాల్సిన సంక్రాంతి పండుగ సెలవులు ఆ చిన్నారులను మృత్యు తీరాలకు చేర్చాయి. కృష్ణా జిల్లాలోని చందర్లపాడు మండలం ఏటూరులోని మునేరు వాగులో విద్యార్ధుల గల్లంతు ఘటన విషాదమైంది. ఈత కొట్టేందుకు వెళ్లిన...