Switch to English

‘బులుగు’ ‘పచ్చ’ రాజకీయ పైత్యానికి జనసేన మాత్రమే విరుగుడు మంత్రం.!

‘‘ఓడినా బాధపడబోను.. రాజకీయాల్లో గెలుపోటములు సహజం. సినిమా రంగంలో కూడా ఎన్నో ఎత్తుపల్లాల్ని చవిచూశాను. నిజానికి, నేను ఓడిపోలేదు. చాలామంది ఓటర్ల మనసుల్ని గెలుచుకున్నాను. నాకు కొంతమందైనా ఓట్లు వేశారంటే, వారిని గెలిచినట్లే కదా.? ప్రజా సేవ కోసం రాజకీయాల్లోకి వచ్చిన నేను ఎన్ని అవమానాల్ని అయినా భరించడానికి సిద్ధంగా వున్నాను. నా ఇంట్లో ఆడవాళ్ళని మీరు కించపర్చినా.. వారి పట్ల అసభ్యకరంగా మాట్లాడినా, మీ ఇంట్లోని ఆడవారి పట్ల గౌరవభావంతోనే వుంటాను. మా పార్టీ నుంచి ఎవరూ మీ ఇళ్ళలోని ఆడవాళ్ళపై విమర్శలు చేయనివ్వను..’’ ఇదీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పదే పదే చెప్పే మాట.

కొన్నాళ్ళ క్రితం వివాదాస్పద నటి శ్రీరెడ్డి, అత్యంత జుగుప్సాకరంగా పవన్ కళ్యాణ్ తల్లిని దూషించినప్పుడు.. ఆ సమయంలో, ‘రాజకీయాల్లో ఇలాంటివన్నీ వుంటాయి.. వాటి పట్ల సంయమనం పాటించకపోతే ఎలా.?’ అని తెలుగుదేశం పార్టీ నాయకులే చాలామంది స్పందించారు. ‘ఈ సమయంలో నిరసనలు తెలుపుతారా.? ఇంకో రోజు పెట్టుకోవచ్చు కదా.?’ అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు పరోక్షంగా పవన్ కళ్యాణ్‌ని ఎద్దేవా చేశారు.

ఇప్పుడేమయ్యింది.? చంద్రబాబుకి అసెంబ్లీలో అవమానం జరిగింది. మీడియా ముందుకొచ్చి ఏడ్చేశారాయన. నిజమే, డెబ్భయ్యేళ్ళ వయసులో.. ఇంతటి అవమాన భారం.. జీర్ణించుకోవడం కష్టమే. కానీ, నొప్పి ఎవరికైనా ఒకేలా వుంటుంది. టీడీపీ, వైసీపీ కలిసి గతంలో జనసేన అధినేతని మానసికంగా దెబ్బకొట్టేందుకు, పవన్ కళ్యాణ్ తల్లి మీద కొందరు ‘పెయిడ్ ఆర్టిస్టులతో’క్ష (శ్రీరెడ్డి, కత్తి మహేష్) జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేయించిన సంగతి తెలిసిందే.

రాజకీయాల్లో మార్పు రావాల్సిందేననీ, ప్రజల ఆలోచనా ధోరణి మారాలనీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నినదించేది ఇందుకే. రాయలసీమ జిల్లాల్లో వరదలు ముంచెత్తుతోంటే, ఆ రాయలసీమ ప్రాంతానికి చెందిన ఇద్దరు నాయకులు నడుపుతున్న రెండు ప్రధాన రాజకీయ పార్టీలు.. అసెంబ్లీలో వ్యక్తిగత దూషణలకు దిగడాన్ని ఏమనుకోవాలి.?

రాష్ట్రాన్ని ఈ రెండు ప్రధాన పార్టీలు ఉద్ధరించేశాయనీ, ఉద్ధరించేస్తాయని భావిస్తే, అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు. రాయలసీమలో వర్షాలు, వరదల కారణంగా మృతుల సంఖ్య పెరుగుతోంటే, ముఖ్యమంత్రి సహా మంత్రులు, ఇతర అధికార పార్టీ నేతలు, ప్రతిపక్షం టీడీపీకి చెందిన నేతలు.. బూతుల వ్యవహారాలపై రచ్చ చేసుకుంటున్నారు. రాష్ట్రానికి ఏం కావాలో, ఎలాంటి రాజకీయం కావాలో ప్రజలు తేల్చుకోవాల్సిన సందర్భమిది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

బలిసి కొట్టుకునేది మీరు.. మేము కాదు

ఒక వైపు టాలీవుడ్ సినీ ప్రముఖులు ఏపీ లో ఉన్న టికెట్ల రేట్లను పెంచి తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్న నేపథ్యంలో మరో వైపు వైకాపాకు...

ఏపీలో టికెట్ల రేట్ల వివాదంపై బాలయ్య కామెంట్స్

ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ల వ్యవహారం రోజు రోజు పెరుగుతూ ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఇటీవల రాంగోపాల్ వర్మ అమరావతి వెళ్లి మంత్రి పేర్ని నాని తో...

లతాజీ హెల్త్‌ బులిటెన్‌.. 12 రోజులు తప్పదు

ప్రముఖ గాయని లతా మంగేష్కర్ ఇటీవల కరోనా బారిన పడ్డ విషయం తెలిసిందే. ఆమె వయస్సు 92 సంవత్సరాలు అవ్వడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి....

సినిమా టికెట్ల ఇష్యూ వదిలేయండి అంటూ మంత్రి సలహా

ఏపీలో ఉన్న టికెట్ల రేట్ల విషయంలో మీడియా వ్యవహరిస్తున్న తీరుపై మంత్రి పేర్ని నాని అసంతృప్తి వ్యక్తం చేశాడు. రాష్ట్రంలో మరే సమస్య లేనట్లుగా మొత్తం...

ఏపీలో నైట్ కర్ఫ్యూ వెనక్కు.. పండగే కారణం

ఆంద్ర ప్రదేశ్‌ ప్రభుత్వం తాజాగా కరోనా కేసుల కట్టడిలో భాగంగా నైట్‌ కర్ఫ్యూను అమలు చేయబోతున్నట్లుగా ప్రకటించిన విషయం తెల్సిందే. సంక్రాంతి ముందు ఇలాంటి కర్ఫ్యూ...

రాజకీయం

జగనన్న స్మార్ట్ టౌన్ షిప్స్.. ఇదోరకం యాపారం.!

ప్రైవేటు రియల్ ఎస్టేట్ వ్యాపారుల వద్ద భూములు (నివాస స్థలాలు) కొనుగోలు చేస్తే అనేక సమస్యలొస్తాయ్.. అదే ప్రభుత్వం దగ్గర వాటిని కొంటే, వివాదాలకు ఆస్కారం వుండదు. నిజానికి, మంచి ఆలోచనే ఇది....

చంద్రబాబు ప్రేమబాణాన్ని జనసేనాని తిరస్కరించినట్లేనా.?

ఇది మామూలు కరువు కాదు.. బీభత్సమైన కరువు.. తెలుగుదేశం పార్టీకి సంబంధించి. అందుకే, పొత్తుల కోసం చంద్రబాబు ఆరాటం అప్పుడే షురూ అయ్యింది. ప్రేమ బాణాల్ని సంధిస్తున్నాం, అటు వైపు నుంచి సరైన...

స్టూడెంట్ లీడర్ గానే రాజకీయాల్లో ఎదిగాను: చంద్రబాబు

  ‘నాకు ఎటువంటి రాజకీయ నేపథ్యం లేదు.. యూనివర్సిటీ నుంచే స్టూడెంట్ లీడర్ గా ఎదిగాను. యువత, నిపుణులు రాజకీయాల వైపు రావాలి’ అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. స్వామి వివేకానంద...

వైసీపీ ఎమ్మెల్యే ‘బలుపు’ వ్యాఖ్యలపై టాలీవుడ్ ఫైర్

కోవూరు వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇటివల ‘సినిమా వాళ్లకు బలిసింది’ అంటూ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై టాలీవుడ్ ఫైర్ అయింది. ప్రముఖ దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ దీనిపై...

పవన్ కు సోపేస్తున్న రఘురామ

వైకాపా రెబల్ పార్లమెంటు సభ్యుడు అయిన రఘు రామ కృష్ణ రాజు తన పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. వైకాపా గత కొన్నాళ్లుగా ఆయన పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేయాల్సిందిగా...

ఎక్కువ చదివినవి

హీరో సిద్దార్ధ బూతు పైత్యం వెనుక.!

పాపం ‘మహాసముద్రం’ సినిమా దెబ్బకి తన అడ్రస్ సినీ రంగంలో గల్లంతయ్యిందనుకున్నాడో ఏమో, ఆ ఆవేదనలో సోషల్ మీడియా వేదికగా బూతు ట్వీటు ద్వారా పాపులారిటీ పెంచుకునేందుకు ప్రయత్నించి చిక్కుల్ని కొనితెచ్చుకున్నాడు. మొన్నామధ్యన...

వైద్య శాస్త్రంలో అద్భుతం..! మనిషికి పంది గుండె అమర్చిన వైద్యలు

నేడు అవయువ దానం ద్వారా ఎందరికో ప్రాణాలు నిలుస్తున్నాయి. అవయువ దానంపై అవగాహన కూడా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. అయితే.. ఇక్కడ జరిగిన అవయువ దానం ద్వారా వైద్య శాస్త్రంలో చారిత్రక ఘట్టం...

బులుగు జర్నలిజం: నష్టమొస్తే సినిమాలెందుకు తియ్యాలి.?

సినిమా అంటే వ్యాపారం.. విజయవంతమైన సినిమాల విషయానికొస్తే, 2 శాతం వరకు మాత్రమే వుంటుంది.. అలాంటప్పుడు, నష్టాల్లో సినిమా వ్యాపారమెందుకు చెయ్యాలి.? అంటూ బులుగు జర్నలిజం ఓ అద్భుతమైన ప్రశ్న సంధించేసింది. దాంతో,...

దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు..! ఒక్కరోజులోనే..

దేశంలో కరోనా తీవ్రత రోజురోజుకీ పెరుగుతోంది. ప్రతిరోజూ లక్షకు తక్కువగ కాకుండా కొత్త కరోనా కేసులు నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో 1,79,723 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ముందురోజుతో పోలిస్తే...

రాజమౌళి కోసం రామాయణాన్ని వదులుకున్న మహేష్?

సూపర్ స్టార్ మహేష్ బాబు ఫెవరెట్ దర్శకులలో దర్శక ధీరుడు రాజమౌళి కూడా ఒకడు. రాజమౌళితో పనిచేయడం పట్ల పలు మార్లు ఆసక్తిని కనబరిచాడు. నిజానికి బాహుబలి తర్వాత మహేష్ తోనే జక్కన్న...