అక్కినేని నాగ చైతన్య హీరోగా నటించిన తాజా చిత్రం లవ్ స్టోరీ. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తై పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఏప్రిల్ 16న ఈ చిత్రం విడుదలవుతోంది. ఇక లవ్ స్టోరీ బిజినెస్ ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. ఎందుకంటే లవ్ స్టోరీపై మంచి అంచనాలు ఉన్నాయి.
సాయి పల్లవి ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. అలాగే శేఖర్ కమ్ముల ఈ చిత్రానికి దర్శకుడు. వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా అనగానే అంచనాలు ఆటోమేటిగ్గా పెరిగిపోతాయి. రీసెంట్ గా విడుదలైన సారంగా దరియా సాంగ్ ప్రస్తుతం సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.
లవ్ స్టోరీ సినిమా ప్రస్తుతం రికార్డ్ బిజినెస్ జరుపుకుంటోంది. ఆంధ్ర ప్రాంత హక్కులను ఇప్పటికే 15 కోట్లకు అమ్మారు. అలాగే నైజాంలో యాషియన్ సినిమాస్ సొంతంగా విడుదల చేసుకుంటోంది. ఓవర్సీస్ లో ఈ చిత్రం 6 కోట్లకు అమ్ముడుపోయింది. ఇక సాటిలైట్, డిజిటల్ అన్ని హక్కులు కలుపుకుని లవ్ స్టోరీ దాదాపు 50 కోట్లకు బిజినెస్ అయింది.
740637 39471Enjoyed reading this, really very good stuff, appreciate it. 527620
192455 728014I actually enjoy reading on this website, it holds fantastic articles . 203595