శేఖర్ కమ్ముల సినిమాలన్నీ మంచి కాఫీ తాగిన అనుభూతిని ఇస్తాయి. 2017లో ఫిదాతో సినీ ప్రేక్షకుల్ని మంచి ప్రేమకథతో కట్టిపడేసిన శేఖర్ మరోసారి ఆ మ్యాజిక్ రిపీట్ చేసేందుకు రెడీ అయ్యారు. నాగచైతన్య, సాయి పల్లవి కాంబినేషన్ లో ‘లవ్ స్టోరి’ సినిమా తెరకెక్కించారు. ఈ సినిమా టీజర్ ను ఈరోజు రిలీజ్ చేశారు. టీజర్లో మళ్లీ శేఖర్ తన మ్యాజిక్ చూపించారు. నవతరం ఆలోచనలతో ఉన్న రేవంత్, మౌనికల ప్రేమకథ ఇది.
ఇందులో నాగచైతన్యతో తెలంగాణ యాస పలికించారు. ఫిదాలో తెలంగాణ యాసతో ఫిదా చేసిన సాయిపల్లవి మరోసారి అవే పలుకులు పలికింది. ‘మౌనీ.. ఏం చేస్తవ్ ఆ సాఫ్ట్ వేర్ జాబ్.. కళ్లద్దాలొస్తయ్.. అంటూ నాగచైతన్య, ఏందిరా.. నన్నొదిలేస్తవ.. అంటూ సాయిపల్లవి’ మ్యాజిక్ చేసేలా ఉన్నారు. పవన్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోరింగ్, శేఖర్ కమ్ముల మార్క్ టేకింగ్ టీజర్ లోనే మంచి ఫీల్ తీసుకొస్తోంది. దీంతో సినిమాపై అంచనాలు పెరిగాయనే చెప్పాలి.
Here’s #Lovestoryteaser for you all … hope you enjoy the glimpse of this journey as much as I did ! 👉 https://t.co/FDqwVJWzEG
.
.@sai_pallavi92 @sekharkammula@SVCLLP #AmigosCreations @AsianSuniel @pawanch19 @adityamusic @NiharikaGajula pic.twitter.com/Er0BOZtaj2— chaitanya akkineni (@chay_akkineni) January 10, 2021
772258 817868Its truly a good and valuable piece of info. Im glad that you just shared this useful information with us. Please keep us informed like this. Thanks for sharing. 609200