అక్కినేని నాగ చైతన్య తొలిసారిగా ఓటిటిలో దర్శనమివ్వబోతున్నాడు. చైతూ ఓటిటి డెబ్యూ చేస్తోన్న సిరీస్ దూత. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సిరీస్ ను అమెజాన్ ప్రైమ్ వీడియో స్ట్రీమ్ చేయనుంది. ఈ సిరీస్ డిసెంబర్ 1 నుండి అందుబాటులోకి వస్తుంది.
పూర్తి స్థాయి థ్రిల్లర్ గా ఈ సిరీస్ రూపొందినట్లు ట్రైలర్ చూస్తే అర్ధమవుతోంది. ఈరోజు నాగ చైతన్య పుట్టినరోజు సందర్భంగా దూత ట్రైలర్ విడుదలైంది. ఎనిమిది ఎపిసోడ్స్ గా రూపొందించిన ఈ సిరీస్ లో నాగ చైతన్య సాగర్ అనే జర్నలిస్ట్ గా కనిపిస్తాడు.
వరస హత్యలు, దానికి ముందే న్యూస్ పేపర్ క్లిప్పింగ్స్ ఆ ఎపిసోడ్ కు సంబంధించి కనిపించడం వంటివి అన్నీ ఆసక్తికరంగా సాగాయి. థ్రిల్లర్ సిరీస్ లను వరస ట్విస్ట్ లను ఇష్టపడేవారికి ఈ సిరీస్ ఒక ఆప్షన్ అనవచ్చు.