Switch to English

సినిమా రివ్యూ: వార్

91,429FansLike
56,274FollowersFollow

నటీనటులు: హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్, వాని కపూర్ తదితరులు..
ఎడిటర్‌: ఆరిఫ్ షేక్
సినిమాటోగ్రఫీ: బెంజమిన్ జాస్పర్
మ్యూజిక్: విశాల్ – శేఖర్
దర్శకత్వం: సిద్దార్థ్ ఆనంద్
నిర్మాణం: యష్ రాజ్ ఫిలిమ్స్
నిర్మాత: ఆదిత్య చోప్రా
విడుదల తేదీ: 02 అక్టోబర్ 2019

బాలీవుడ్ యాక్షన్ హీరోస్ అయిన హృతిక్ రోషన్ – టైగర్ ష్రాఫ్ కలిసి నటించిన హై బడ్జెట్ మల్టీ స్టారర్ యాక్షన్ థ్రిల్లర్ ‘వార్’. గతంలో హృతిక్ రోషన్ తో ‘బాంగ్ బాంగ్’ సినిమా తీసిన సిద్దార్థ్ ఆనంద్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాని యాష్ రాజ్ ఫిలిమ్స్ వారు నిర్మించారు. ‘ధూమ్’ సీరీర్ తరహాలో ‘వార్’ సినిమా ట్రైలర్ ఉండడంతో ఈ సినిమాకి మంచి క్రేజ్ ఉంది. ఆ క్రేజ్ వల్ల ఈ సినిమాని హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో కూడా రిలీజ్ అవుతోంది. మరి ఈ వార్ సినిమాలో ట్రైలర్ లో ఉన్నంత కిక్ ఉందొ లేదో ఇప్పుడు చూద్దాం.

కథ:

ఇండియా ది బెస్ట్ సీక్రెట్ ఏజంట్ కబీర్(హృతిక్ రోషన్). దేశం కోసం ప్రాణాలకు తెగించడానికి కూడా సిద్ధంగా ఉండే కబీర్ ఒక్కసారిగా ఇండియాకి విరోధిగా మారి కొన్ని అక్రమాలు చేస్తుంటాడు. అప్పుడు ఇండియన్ గవర్నమెంట్ కబీర్ ని ఆపగల సత్తా ఎవరికి ఉందా అని ఆలోచించి, కబీర్ శిష్యుడు ఖలీద్(టైగర్ ష్రాఫ్) ని రంగంలోకి దింపుతారు. ఇక అక్కడి నుంచి కబీర్ చేసే అరాచకాలను ఆపడం కోసం ఖలీద్ ఏం చేసాడు? ఖలీద్ తనని పట్టుకోవాలని ట్రై చేస్తున్నాడని తెలిసినప్పుడు కబీర్ ఏం చేసాడు? కబీర్ – ఖలీద్ మధ్య జరిగిన ఛాలెంజ్ ఏంటి? అసలు కబీర్ దేశానికి విరోధిగా ఎందుకు మారాడు? చివరికి ఖలీద్ కబీర్ ని ఆపగలిగాడా? లేదా? అన్నదే ‘వార్’ కథ.

ఆన్ స్క్రీన్ స్టార్స్:

వార్ సినిమాలో 80% ఇద్దరే కనపడతారు. వారే హృతిక్ రోషన్ అండ్ టైగర్ ష్రాఫ్. ఒక్కొక్కరి గురించి చెప్పుకుంటే.. స్క్రీన్ మీద హృతిక్ రోషన్ మార్క్స్ అన్నీ కొట్టేసాడని చెప్పాలి. హృతిక్ మ్యానరిజమ్స్, యాటిట్యూడ్, ఎక్స్ ప్రెషన్స్ సింప్లీ సూపర్బ్. ఇవి కాకుండా ఇందులో తను చేసిన స్టంట్స్ అందరినీ సర్ప్రైజ్ చేస్తాయి. హృతిక్ రోషన్ కి ఇచ్చిన ఎలివేషన్ షాట్స్ మైండ్ బ్లోయింగ్ అని చెప్పాలి.

టైగర్ ష్రాఫ్ కూడా చాలా బాగా చేసాడు. ఇందులో చాలా సెటిల్ గా ఉండే పాత్రలో తన నటన చాలా బాగుంది. ముఖ్యంగా కొన్ని ఎమోషనల్ సీన్స్ లో చాలా బాగా చేసాడు. తనకి ఇచ్చిన హీరోయిక్ సీన్స్ లో తన బెస్ట్ ఇచ్చాడనే చెప్పాలి. కానీ ఓవరాల్ గా చూసుకుంటే మనకు టైగర్ ష్రాఫ్ ని హృతిక్ రోషన్ డామినేట్ చేసాడని చెప్పాలి. ఒక్క మాటలో చెప్పాలంటే హృతిక్ వన్ మాన్ షో అనచ్చు.

వాణి కపూర్ రోల్ చాలా చిన్నదనే చెప్పాలి. కానీ తన పాత్ర వల్లే సినిమాకి ఎమోషన్ తోడైంది. ఆ ఎమోషనల్ సీన్స్ లో చాలా బాగా చేసింది. అలాగే పాటలో తన గ్లామర్ కూడా మాస్ ఆడియన్స్ కి ఒక అట్రాక్షన్ గా చెప్పచ్చు. ఇక ముఖ్య పాత్రలు చేసిన అనుప్రియ గోయెంకా, అశుతోష్ రాణ తమ పాత్రలకు న్యాయం చేశారు.

ఆఫ్ స్క్రీన్ స్టార్స్:

వార్ ఒక యాక్షన్ థ్రిల్లర్.. హాలీవుడ్ మిషన్ ఇంపాజిబుల్ తరహాలో దీనిని చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఇలాంటి సినిమా చేయాలంటే టాప్ నాచ్ విజువల్స్ ఉండాలి. ఆ విషయంలో సినిమాటోగ్రాఫర్ బెంజమిన్ జాస్పర్ 200% బెస్ట్ అవుట్ ఫుట్ ఇచ్చాడని చెప్పాలి. అలాగే సంచిత్ బల్హార – అంకిత్ బల్హార అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వార్ కి మరో హైలైట్. విజువల్స్ అండ్ మ్యూజిక్ సినిమాని చాలా వరకూ నిలబెట్టాయని చెప్పాలి. విశాల్ శేఖర్ కంపోజ్ చేసిన 2 పాటలు కూడా థియేటర్ లో ఎంజాయ్ చేసేలా ఉన్నాయి. ఆరిఫ్ షైక్ ఎడిటింగ్ కూడా బాగుంది.

అలాగే యాక్షన్ ఎపిసోడ్స్ కూడా ఈ సినిమాకి బిగ్గెస్ట్ హైలైట్ అని చెప్పాలి. కొన్ని మేజర్ సీక్వెన్స్ లు హాలీవుడ్ నుంచి స్ఫూర్తి తీసుకున్నా మనకు తగ్గ మార్పులు చేసి తీసిన విధానం ఆడియన్స్ కి ఎంగేజ్ అయ్యేలా ఉంది. ఇక డైరెక్టర్ సిద్దార్థ్ ఆనంద్ కంప్లీట్ హీరోయిక్ మోమెంట్స్ మీదే కథని రాసుకోవడం, వాటిని స్క్రీన్ పై ఆవిష్కరించడంలో సక్సెస్ అయ్యాడు. కానీ స్ట్రాంగ్ కథని ఎంచుకోవడంలో, అలాగే టైట్ స్క్రీన్ ప్లే రాసుకోవడంలో ఫెయిల్ అయ్యాడు. అలాగే తను రాసుకున్న ట్విస్ట్ లలో సగం ఆడియన్స్ గెస్ చేయగలరు, సగం మాత్రం థ్రిల్ చేస్తాయి. హీరోస్ ఇమేజ్ బేస్ చేసుకొని కంప్లీట్ కమర్షియల్ యాక్షన్ థ్రిల్లర్ చేయడంలో డైరెక్టర్ సిద్దార్థ్ ఆనంద్ సక్సెస్ అయ్యాడు. ఇక యష్ రాజ్ ఫిలిమ్స్ ప్రొడక్షన్ వాల్యూస్ టాప్ నాచ్ అని చెప్పాలి.

సీటీమార్ పాయింట్స్:

 • హృతిక్ రోషన్ ఇమేజ్ అండ్ పెర్ఫార్మన్స్
 • కొన్ని యాక్షన్ బ్లాక్స్
 • టైగర్ ష్రాఫ్ పాత్రలోని ట్విస్ట్స్
 • ఇరాక్ లో జరిగే యాక్షన్ బ్లాక్
 • సెకండాఫ్ లో వచ్చే బైక్ అండ్ కార్ ఛేజింగ్ సీక్వెన్స్
 • క్లైమాక్స్ మాన్ టు మాన్ ఫైట్

ఓకే ఓకే పాయింట్స్:

 • వాణి కపూర్ ఎమోషనల్ టచ్ టచ్
 • సింపుల్ ఇంటర్వల్ బ్లాక్
 • ఏరోప్లేన్ లో జరిగే ప్రీ ఇంటర్వల్ సీక్వెన్స్

బోరింగ్ పాయింట్స్:

 • సింపుల్ స్టోరీ లైన్
 • స్క్రీన్ ప్లే టైట్ గాలేకపోవడం
 • అక్కడక్కడా బోరింగ్ అనిపించే డ్రామా సీన్స్
 • ఊహించదగిన విధంగా ఉండే స్క్రీన్ ప్లే
 • హాలీవుడ్ సినిమాలను గుర్తు చేసేలా ఉండే పలు సీన్స్

విశ్లేషణ:

ఓ పక్కా కమర్షియల్ సినిమాలో ఉండాల్సిన హీరో యాటిట్యూడ్, హీరో ఇమేజ్ కి తగ్గట్టు ఎలివేషన్స్, మైండ్ బ్లోయింగ్ అనిపించే యాక్షన్ బ్లాక్స్, కొన్ని మంచి ట్విస్ట్ లను పర్ఫెక్ట్ గా మిక్స్ చేసి చేసిన ‘వార్’ సినిమా బాగానే ఆకట్టుకుంటుంది. స్టోరీ – స్క్రీన్ ప్లే, కొన్ని ట్విస్ట్ లు ఊహించేలా ఉండడమే చెప్పుకోదగిన మైనస్ పాయింట్స్. హృతిక్ రోషన్ మరియు టైగర్ ష్రాఫ్ లకి యాక్షన్ ఇమేజ్ ఉండడం కూడా ‘వార్’ కి ప్లస్ అయ్యింది. ఫైనల్ గా ‘వార్’ ఈ దసరాకి కలెక్షన్స్ కొల్లగొట్టే సినిమాఅవుతుంది .

ఫైనల్ పంచ్: వార్ – హృతిక్ రోషన్ వన్ మాన్ షో.!

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘నవాబ్’ మూవీ కోసం 12 ఎకరాల్లో డంప్ యార్డ్ సెట్

ముఖేష్ గుప్తా, అనన్య నాగళ్ల హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా నవాబ్. ఈ చిత్రంలో రామ రాజ్, మురళీ శర్మ, రాహుల్ దేవ్, శ్రవణ్ రాఘవేంద్ర,...

‘లెహరాయి’ నుండి “బేబీ ఒసేయ్ బేబీ” పాట విడుదల

బెక్కం వేణుగోపాల్ సమర్పణలో ఎస్ ఎల్ ఎస్ మూవీస్ నిర్మాణ సంస్ణ లో రంజిత్, సౌమ్య మీనన్ హీరో హీరోయిన్స్ గా, ధ‌ర్మ‌పురి ఫేం గగన్...

అందం కోసం బుట్టబొమ్మ సర్జరీపై క్లారిటీ

హీరోయిన్ పూజా హెగ్డే తన అందాన్ని పెంచుకోవడం కోసం ఇటీవల ముక్కు సర్జరీ చేయించుకుంది అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన విషయం...

బాబోయ్‌ రష్మిక మరీ అంత పెంచేసిందా?

నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం వరుసగా బాలీవుడ్ లో సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. సౌత్ లో కొన్ని ఆఫర్స్ ని ఈమె కాదన్నట్లుగా...

బిగ్‌బాస్‌ 6 : ఆ సర్వే టాప్‌ 5 లో శ్రీసత్య

ప్రముఖ జాతీయ మీడియా సంస్థ ఓర్మాక్స్ వారు ప్రతివారం సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అయ్యే సెలబ్రెటీల జాబితాను ప్రకటిస్తూ ఉంటారు. సోషల్‌ మీడియాలో ఎక్కువగా ఎవరి...

రాజకీయం

గులాబీ రాజకీయం.! జాతీయ తెలుగు పార్టీ దిశగా.!

ఇంతలోనే ఎంత మార్పు.? నిజానికి, ఈ మార్పు మంచిదే.! తెలుగు తల్లి ఎవనికి తల్లి.? అని ప్రశ్నించిన తెలంగాణ రాష్ట్ర సమితి, ఇప్పుడు ‘తెలుగు పార్టీ, జాతీయ రాజకీయాల్లో సత్తా చాటబోతోంది..’ అని...

అమరావతి రైతుల పాదయాత్ర: మంత్రుల బెదిరింపులు.! జనం బేఖాతర్.!

రాజధాని అమరావతి విషయంలో మంత్రులు బెదిరింపులకు దిగుతున్నారు. జనాన్ని రెచ్చగొడుతున్నారు. అమరావతి నుంచి అరసవెల్లికి జరుగుతున్న మహా పాదయాత్రను అడ్డుకునేందుకు ప్రభుత్వం స్థాయిలో, పార్టీ స్థాయిలో ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా.. అవి సఫలం...

కేసీయార్ స్కెచ్.! ఆంధ్రప్రదేశ్‌లోనూ టీఆర్ఎస్ పోటీ.?

‘ఆంధ్రప్రదేశ్‌లోనూ తెలంగాణ రాష్ట్ర సమితి పోటీ చేయాలని అక్కడి ప్రజలు కోరుకుంటున్నారు..’ అని పలు సందర్భాల్లో గులాబీ పార్టీ నేతలు వ్యాఖ్యానించడం చూశాం. ఆ లిస్టులో తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్...

‘జ..గన్’ అంటోన్న రోజా.! ‘గన్..జా’ అంటోన్న టీడీపీ.! అసలేంటి కథ.?

ఆడ పిల్లకి అన్యాయం జరిగితే, గన్ కంటే ముందుగా జగన్ అక్కడ వుంటాడంటూ పదే పదే వైసీపీ నేత రోజా చెప్పడం చూశాం. ఎమ్మెల్యేగా వున్నప్పటినుంచీ ఆమె ఇవే మాటలు చెబుతూ వస్తున్నారు....

మొగల్తూరు రాజకీయం.! ప్రభాస్, చిరంజీవి.. అసహనం వ్యక్తం చేసిన వేళ.!

‘మరీ ఇంత నీఛానికి దిగజారుతారా.?’ అన్న చర్చ సినీ పరిశ్రమలో చాలామంది ప్రముఖుల మధ్య జరుగుతోంది. సినీ నటుడు, మాజీ కేంద్ర మంత్రి, దివంగత కృష్ణంరాజు సంస్మరణ కార్యక్రమం ఆయన సొంతూరులో నిర్వహించిన...

ఎక్కువ చదివినవి

బిగ్ బాస్ 6 ఆడియన్స్: నిజమా? పెయిడ్ ఆర్టిస్ట్ లా?

బిగ్ బాస్ అనేది సూపర్ హిట్ రియాలిటీ షో. ఈ షో ను ఫాలో అయ్యేవారు కోట్లల్లోనే ఉంటారు. ఈ షో నుండి బయటకు వచ్చాక అవకాశాలు ఎలా ఉంటాయి అన్నది పక్కనపెడితే...

ఆది సాయికుమార్ “సీఎస్ఐ సనాతన్” గ్లింప్స్ విడుదల

చాగంటి ప్రొడ‌క్ష‌న్ లో ఆది సాయికుమార్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా "సీఎస్ఐ సనాతన్". ఈ చిత్రంలో క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేషన్ (సియ‌స్ ఐ) ఆఫీస‌ర్ గా ఆదిసాయికుమార్ ఒక కొత్త రోల్...

ఒకేసారి రెండు సినిమాలతో పిల్లలమర్రి రవితేజ తెరంగేట్రం.

కళామ తల్లిని నమ్ముకున్నావాళ్ళు ఎప్పుడో ఒకసారి సక్సెస్ కొడతారు. ఆర్టిస్ట్ అవుదామని ఎన్నో కలలతో వచ్చి మోడల్ గా మారి, ప్రొడక్షన్ మేనేజర్ గా ఎన్నో సినిమాలు చేసి ఇప్పుడు ఏకంగా హీరోగా...

రాశి ఫలాలు: బుధవారం 28 సెప్టెంబర్ 2022

పంచాంగం  శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయణం శరద్ఋతువు ఆశ్వయుజ మాసం సూర్యోదయం: ఉ.5:52 సూర్యాస్తమయం: సా.5:57 తిథి: ఆశ్వయుజ శుద్ధ తదియ రా.1:50 వరకు తదుపరి ఆశ్వయుజ శుద్ధ చవితి సంస్కృతవారం: సౌమ్య వాసరః (బుధవారం) నక్షత్రము: చిత్త ఉ.7:33...

రాశి ఫలాలు: మంగళవారం 27 సెప్టెంబర్ 2022

పంచాంగం శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయణం శరద్ఋతువు ఆశ్వయుజ మాసం సూర్యోదయం: ఉ.5:53 సూర్యాస్తమయం: సా.5:57 తిథి: ఆశ్వయుజ శుద్ధ విదియ రా.2:49 వరకు తదుపరి ఆశ్వయుజ శుద్ధ తదియ సంస్కృతవారం: భౌమవాసరః (మంగళవారం) నక్షత్రము: హస్త ఉ.7:26 వరకు...
సినిమా రివ్యూ: వార్నటీనటులు: హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్, వాని కపూర్ తదితరులు.. ఎడిటర్‌: ఆరిఫ్ షేక్ సినిమాటోగ్రఫీ: బెంజమిన్ జాస్పర్ మ్యూజిక్: విశాల్ - శేఖర్ దర్శకత్వం: సిద్దార్థ్ ఆనంద్ నిర్మాణం: యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మాత: ఆదిత్య చోప్రా విడుదల తేదీ: 02 అక్టోబర్ 2019 బాలీవుడ్ యాక్షన్ హీరోస్ అయిన హృతిక్ రోషన్ - టైగర్ ష్రాఫ్ కలిసి నటించిన హై బడ్జెట్ మల్టీ స్టారర్ యాక్షన్ థ్రిల్లర్ 'వార్'. గతంలో...