Switch to English

సినిమా రివ్యూ: యాక్షన్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

నటీనటులు: విశాల్, తమన్నా..
నిర్మాత: శ్రీనివాస్ అడెపు
దర్శకత్వం: సుందర్ సి
సినిమాటోగ్రఫీ: డ్యూడ్లీ
మ్యూజిక్: హిప్ హాప్ తమిజ
ఎడిటర్‌: ఎన్.బి శ్రీకాంత్
విడుదల తేదీ: నవంబర్ 15, 2019
రేటింగ్: 2.5

స్వతహాగా తెలుగు వాడు కానీ హీరో అయ్యింది మాత్రం తమిళంలో, మొదటి నుంచి తమిళంతో పాటు, తెలుగులో కూడా తన సినిమాలు రిలీజ్ చేస్తూ మాస్ హీరోగా పేరు తెచ్చుకున్న హీరో విశాల్. ‘అభిమన్యుడు’, ‘పందెం కోడి 2’ లాంటి హిట్స్ తర్వాత విశాల్ నుంచి వస్తున్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘యాక్షన్’. తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి సుందర్ సి దర్శకత్వం వహించారు. విశాల్ కెరీర్లో మొదటి సారి సుమారు 55 కోట్ల బడ్జెట్ తో రూపొందించిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ యాక్షన్ థ్రిల్లర్ సీట్ ఎడ్జ్ లో కూర్చొని ఎంజాయ్ చేసేలా చేసిందా లేదా అనేది చూద్దాం.

కథ:

సుభాష్ (విశాల్) మిలిటరీలో ఓ కల్నల్, అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రెండవ కొడుకు. ఆంధ్రప్రదేశ్ లో సుభాష్ ఫాదర్ నేతృత్వంలో జరిగిన ఓ పబ్లిక్ ఈవెంట్ లో ప్రధాన మంత్రి కాండిడేట్ గుప్తని బాంబ్ బ్లాస్ట్ లో చంపేస్తారు. టెర్రరిస్టులతో కుమ్మక్కయ్యి సుభాష్ అన్నయ్య మరియు డిప్యూటీ సీఎం శ్రవణ్(రాంకీ) ఆ బాంబ్ బ్లాస్ట్ చేసాడని వార్తలు వస్తాయి. దాంతో శ్రవణ్ సూసైడ్ చేసుకుంటాడు. అలాగే సుభాష్ తనకి కాబోయే భార్య మీర(ఐశ్వర్య లక్ష్మి)ని కూడా ఈ బాంబ్ బ్లాస్ట్ లో కోల్పోతాడు. దీనిని పర్సనల్ గా తీసుకున్న సుభాష్ ఈ బాంబ్ బ్లాస్ట్ వెనకాల అసలు నిజానిజాలు తెలుసుకోవడం మొదలు పెడతాడు. అలా కథ ఇండియన్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అయిన సయ్యద్ ఇబ్రహీం మల్లిక్(కబీర్ సింగ్) కి లింక్ అవుతుంది. అసలు ఈ బాంబ్ బ్లాస్ట్ కి మల్లిక్ కి సంబంధం ఏమిటి? ఇందుకోసం గుప్త ని చంపాల్సి వచ్చింది.? పాకిస్థాన్ సెక్యూరిటీలో సేఫ్ గ ఆన్న మల్లిక్ ని సుభాష్ ఎలా చేరుకున్నాడు? చివరికి మల్లిక్ ని ఇండియా తీసుకొచ్చారా? లేదా అన్నదే కథ.

సీటీమార్ పాయింట్స్

ఆన్ స్క్రీన్:

‘యాక్షన్’ ఇదొక యాక్షన్ – థ్రిల్లర్ మూవీ.. అందుకే ముందుగా యాక్షన్ ఎపిసోడ్స్ గురించి మాట్లాడుకుందాం. సినిమాలోని ప్రతి యాక్షన్ ఎపిసోడ్ ఛేజింగ్ ఫార్మట్ లోనే ఉంటుంది. టర్కీలో షూట్ చేసిన విశాల్ – తమన్నా ఇంట్రడక్షన్ బ్లాక్, విశాల్ – ఆకాంక్ష పూరి మధ్య లండన్ లో జరిగే ఇంటర్వల్ బ్లాక్, సెకండాఫ్ లో వచ్చే అల్గోర్నియా ఛేజింగ్ ఎపిసోడ్స్ ఆడియన్స్ కి మంచి ఫీల్ ని ఇస్తాయి. అలాగే సెకండాఫ్ లో బ్యాంక్ హాకింగ్ బ్లాక్ కూడా సస్పెన్స్ ఫీల్ ని ఇస్తుంది. ఇకపోతే ఫస్ట్ హాఫ్ లో సినిమాకి కీలకం అయిన ఎమోషనల్ ఎపిసోడ్స్ డీసెంట్ గా ఉన్నాయి. అందువల్ల ఫస్ట్ హాఫ్ లో ఎక్కడా డ్రాప్ ఉండదు. అలాగే సెకండాఫ్ కూడా మొదటి 30 నిమిషాలు స్పీడ్ గానే ఉంటుంది.

ఇక నటన పరంగా చూసుకుంటే.. విశాల్ సీరియస్ మిలిటరీ కల్నల్ పాత్రలో బాగా చేసాడు. ముఖ్యంగా యాక్షన్ ఎపిసోడ్స్ విషయంలో చాలా కష్టపడ్డాడు, తన కష్టానికి తగ్గట్టుగానే ఆ ఎపిసోడ్స్ కి మంచి మార్క్స్ పడ్డాయి. తమన్నా మొదటి సారి సీరియస్ అండ్ యాక్షన్ స్కిల్స్ తో అందరినీ సర్ప్రైజ్ చేసింది. తన పాత్రకి పూర్తి న్యాయం చేసింది. అలాగే ఒక పాటలో తన మాస్ ఆడియన్స్ తన నుంచి ఆశించే గ్లామర్ తో కూడా మెప్పించింది. ముఖ్యంగా పాటలోని బికినీ ట్రీట్ మాస్ ఆడియన్స్ కి స్పెషల్ గిఫ్ట్ అని చెప్పాలి. నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో ఆకాంక్ష పూరి సూపర్బ్ గా చేసింది. రిస్కీ స్టంట్స్ తో పాటు, ఓ పాటలో గ్లామర్ తో మాస్ ఆడియన్స్ చేత విజిల్స్ వేయించుకుంది. మిగిలిన పాత్రలు చేసిన రాంకీ, కబీర్ సింగ్, ఐశ్వర్య లక్ష్మీ, ఛాయా సింగ్ తదితరులు తమ పాత్రల పరిధిమేర నటించారు. యోగిబాబు ఉన్న రెండు సీన్స్ లో మనల్ని కాస్త నవ్విస్తాడు. షారా పాత్ర కూడా కొంత నవ్విస్తాడు.

ఆఫ్ స్క్రీన్:

టెక్నికల్ టీం పరంగా అంటే ప్రొడక్షన్ డిజైనింగ్ అని చెప్పాలి. సినిమా ఎక్కడ కావాలంటే అక్కడ లొకేషన్స్ ఇచ్చి సౌత్ ఇండియన్ స్క్రీన్ పై చూడని చాలా లొకేషన్స్ లో షూట్ చేసి ఆడియన్స్ కి ఓ మంచి ఫీల్ వచ్చేలా డిజైన్ చేశారు. ప్రొడక్షన్ వాల్యూస్ సింప్లీ సూపర్బ్. ఆ రిచ్ నెస్ ని పర్ఫెక్ట్ గా చూపించిన క్రెడిట్ మాత్రం డిఓపి డ్యూడ్లీకి చెందుతుంది. అతని ఫ్రెమింగ్ అండ్ షూట్ చేసిన విధానం చాలా బాగున్నాయి. కొన్ని చోట్ల అతను ట్రై చేసిన డిఫరెంట్ మేకింగ్ తెలుగువారికి కొత్తగా అనిపిస్తుంది. అతని విజువల్స్ కి హిప్ హాఫ్ తమిళ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా హెల్ప్ అయ్యింది. ముఖ్యంగా యాక్షన్ ఎపిసోడ్స్ కి ఇచ్చిన మ్యూజిక్ బాగుంది. అలాగే యాక్షన్ కొరియోగ్రాఫర్స్ చేసిన అన్ని ఛేజింగ్ యాక్షన్ చాలా బాగున్నాయి. సుందర్ సి డైరెక్టర్ గా 60% మార్క్స్ కొట్టేశాడని చెప్పాలి.

మైనస్ పాయింట్స్

ఆన్ స్క్రీన్:

ఆన్ స్క్రీన్ పరంగా చెప్పుకోవాలంటే.. కథా పరంగా మూవీ ప్లే ఓకే అయినప్పటికీ సెకండాఫ్ చివరి 30 నిమిషాలు చాలా స్లో అయిపోతుంది. యాక్షన్ థ్రిల్లర్ సినిమాల్లో సెకండాఫ్ మిడిల్ లో ప్లానింగ్ లో భాగంగా స్లో అవ్వడం కామన్, కానీ ప్రీ క్లైమాక్స్ మరియు క్లైమాక్స్ ఎపిసోడ్స్ మరియు ట్విస్ట్స్ నెక్స్ట్ లెవల్ లో ఉండేలా ప్లాన్ చేసి ఆడియన్స్ కి ఓ మంచి ఫీల్ ఇచ్చి థియేటర్ నుంచి పంపుతారు. కానీ ఈ సినిమాలో అది మిస్ అయ్యింది. అంతవరకూ ఆసక్తికరంగా అనిపించినా చివరి 20 నిమిషాలు మాత్రం నిరాశపడతారు. ఎందుకంటే అప్పటికే మూడు లాంగ్ ఛేజింగ్ ఎపిసోడ్స్ చూసి ఇక చాలు ఇలాంటివి ఒక్కటన్నాహీరో – విలన్ కి డైరెక్ట్ ఫైట్ పెట్టండి అని ఎదురు చూస్తున్న ఆడియన్స్ కి ప్రీ క్లైమాక్స్ ఛేజ్ ఫైట్ బోర్ కొడుతోంది. అలాగే క్లైమాక్స్ లో కూడా పెద్ద థ్రిల్స్ ఏం లేకపోవడం ఇంకా నీరుగార్చేస్తుంది. సెకండాఫ్ లో తమన్నా పాట అట్రాక్షన్ అయినా సినిమా ఫ్లోకి చిన్న డిస్టర్బన్స్ అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ లో ఎమోషనల్ పెయిన్ బాగుంది కానీ దానిని నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్ళే సీన్స్ సెకండాఫ్ లో లేకపోవడం వలన కథలో ఎమోషనల్ కనెక్షన్ కాస్త మిస్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ లో అక్కడక్కడా స్లోగా అనిపించడం, ఎంటర్టైన్మెంట్ కూడా కొందరికి నచ్చకపోవచ్చు.

ఆఫ్ స్క్రీన్:

ఎప్పుడూ సినిమాకి కథే హీరో.. ఆ హీరో విషయంలో సుందర్ సి పెద్దగా కష్టపడలేదు. యాక్షన్ థ్రిల్లర్ జానర్ లో మూవీ అనగానే అందరిలీనే చాలా మంది చేసేసిన ఓ మిలిటరీ ఆఫీసర్ పాకిస్థాన్ టెర్రరిస్ట్ మీద రివెంజ్ తీర్చుకోవడం అనే సేమ్ టు సేమ్ పాయింట్ నే తీసుకున్నారు. తెలుగు, తమిళ్, హిందీతో పాటు హాలీవుడ్ సినిమాల్లో మనం చాలా సార్లు చూసేసిన కథే. దాన్ని మనం చూసి చూడనట్టు వదిలేద్దామనుకోవాలంటే కథనంతో అయినా ఆకట్టుకోవాలి. కానీ కథనం కూడా చాలా చాలా వీక్ గా ఉంది. సినిమా వెళ్ళే విధానాన్ని మనం ముందే ఊహించేయగలం. కథనంలో చేసిన మరో మేజర్ మిస్టేక్.. ఇది యాక్షన్ థ్రిల్లర్ మూవీ.. యాక్షన్ తో పాటు అదిరిపోయే నాలుగైదు థ్రిల్స్ అండ్ ట్విస్ట్స్ ఉండాలి. కానీ ఇందులో మనల్ని థ్రిల్ చేసేలా ఒక్క ట్విస్ట్ కూడా లేకపోవడం బాధాకరం. కేవలం యాక్షన్ ఎపిసోడ్స్ మీదే దృష్టి పెట్టారు. ఆ థ్రిల్స్ కనుక ఉండి ఉంటే సినిమా రిజల్ట్ ఇంకోలా ఉండేది.

యాక్షన్ సినిమాల్లో హీరో – విలన్ మధ్య జరిగే యాక్షన్ బ్లాక్ మాత్రమే ఆడియన్స్ కి కిక్ ఇస్తుందనే చిన్న లాజిక్ ని డైరెక్టర్ సుందర్ సి మిస్ అయ్యాడు. అంతకు మించి ఒక టెర్రరిస్ట్ పాత్రని అంతలా ఎస్టాబ్లిష్ చేసినప్పుడు, హీరో అతన్ని పట్టుకోవడం కోసం అతని సామ్రాజ్యంలోకే వచ్చినప్పుడు విలన్ హీరోకి చుక్కలు చూపించాలి అప్పుడే విలనిజం హైలైట్ అవుతుంది. ఆ టైంలో హీరో వాడిని కొడితే ఆడియన్స్ ఫీలింగ్ పీక్స్ కి వెళ్తుంది. కానీ ఈ బేసిక్ పాయింట్ ని మిస్ అయ్యి, ఇండియాని భయపెట్టిన విలన్ ని చివరికి బఫూన్ ని చేయడం పెద్ద డిజప్పాయింట్ మెంట్ అనే చెప్పాలి. అలాగే అన్నీ ఛేజింగ్ యాక్షన్ బ్లాక్స్ మాత్రమే కాకుండా కొన్ని మాన్ టు మాన్ యాక్షన్ ఎపిసోడ్స్ పెట్టాల్సింది. అలాగే ఎమోషనల్ కంటెంట్ ని కూడా ఇంకా బెటర్ గా ప్రెజంట్ చేసే కొన్ని సీన్స్ ఉంటే సెకండాఫ్ లో ఇంకా బెటర్ ఫీల్ వచ్చేది. జస్ట్ మేకింగ్ పరంగా డైరెక్టర్ సక్సెస్ అయినప్పటికీ కథ – కథనం పరంగా ఫెయిల్ అయ్యాడు. ఇక ఎడిటర్ ఎన్. శ్రీకాంత్ ఎడిటింగ్ బాగుంది. కానీ లెంగ్తీ యాక్షన్ సీక్వెన్స్ లను ఇంకాస్త కట్ చేసి ఉండవచ్చు. తెలుగు డైలాగ్స్ జస్ట్ ఓకే అనేలా ఉన్నాయి.

విశ్లేషణ:

విశాల్ – తమన్నాలను యాక్షన్ అవతార్ లో ప్రెజెంట్ చేసిన ‘యాక్షన్’ మూవీ జస్ట్ ఓకే అనేలా ఉందే తప్ప గొప్పగా ఉంది అనేలా లేదు. డైరెక్టర్ సుందర్ సి సినిమాకి ‘యాక్షన్’ అనే టైటిల్ పెట్టడం వలన అనుకుంటా కేవలం యాక్షన్ ఎపిసోడ్స్ మీదే దృష్టి పెట్టి మిగిలిన అన్నిటినీ అనగా థ్రిల్స్, ట్విస్ట్స్, బెటర్ ఎమోషనల్ సీన్స్ ని లైట్ తీసుకున్నాడని క్లియర్ గా తెలుస్తుంది. ఆయన గ్రాండ్ విజువల్స్ ఉండాలి అని లొకేషన్స్ మరియు మేకింగ్ మీద పెట్టిన శ్రద్ధతో సగం బెటర్ స్క్రిప్ట్ మరియు స్క్రీన్ ప్లే మీద పెట్టి ఉంటే సినిమా యావరేజ్ అని కాకుండా సూపర్ హిట్ అనే టాక్ ని తెచ్చుకునేది. ఓవరాల్ గా చెప్పాలి అంటే ‘యాక్షన్’ సినిమా గ్రాండ్ విజువల్స్ తో కూడిన యాక్షన్ సినిమాలు ఇష్టపడే వారికి మాత్రమే బెటర్ ఫిల్మ్ అనిపిస్తుంది. మిగతా వారికి జస్ట్ యావరేజ్ గా అనిపించే సినిమా ‘యాక్షన్’.

ఫైనల్ పంచ్: యాక్షన్ – యాక్షన్ ఓకే, థ్రిల్స్ లేవేంటమ్మా.?

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

రాజకీయం

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

ఎక్కువ చదివినవి

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి..

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ ప్రాణకోటిలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఉన్నారు....

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు తమ మేధస్సుని రాత రూపంలోకి మలచి...

జగన్ విషయంలో కేసీయార్ సెల్ఫ్ గోల్.! కానీ, ఎందుకిలా.?

కేసీయార్ మహా మాటకారి.! వ్యూహాలు రచించడంలో దిట్ట.! తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఆయనే.! వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీయార్, హ్యాట్రిక్ కొట్టలేకపోయారు.. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లా...

Prachi Nigam: యూపీ టాపర్ పై ట్రోలింగ్.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన బాలిక

Prachi Nigam: సోషల్ మీడియాలో కొందరి విపరీత పోకడకలకు హద్దు లేకుండా పోతోంది. ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) విద్యార్ధిని పదో తరగతి పరిక్షల్లో 98.5శాతం ఉత్తీర్ణత సాధించిన బాలిక సత్తాను కొనియాడకుండా రూపంపై...
నటీనటులు: విశాల్, తమన్నా.. నిర్మాత: శ్రీనివాస్ అడెపు దర్శకత్వం: సుందర్ సి సినిమాటోగ్రఫీ: డ్యూడ్లీ మ్యూజిక్: హిప్ హాప్ తమిజ ఎడిటర్‌: ఎన్.బి శ్రీకాంత్ విడుదల తేదీ: నవంబర్ 15, 2019 రేటింగ్: 2.5 స్వతహాగా తెలుగు వాడు కానీ హీరో అయ్యింది మాత్రం తమిళంలో, మొదటి నుంచి తమిళంతో పాటు, తెలుగులో కూడా తన సినిమాలు రిలీజ్ చేస్తూ మాస్ హీరోగా పేరు తెచ్చుకున్న హీరో విశాల్. 'అభిమన్యుడు', 'పందెం కోడి...సినిమా రివ్యూ: యాక్షన్