Switch to English

సినిమా రివ్యూ: తెనాలి రామకృష్ణ బిఏ బిఎల్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,467FansLike
57,764FollowersFollow
సినిమా రివ్యూ: తెనాలి రామకృష్ణ బిఏబిఎల్
 

నటీనటులు:  సందీప్ కిషన్, హన్సిక, వరలక్ష్మీ శరత్ కుమార్, అయ్యప్ప, మురళీ శర్మ, వెన్నెల కిషోర్, సప్తగిరి, తదితరులు
నిర్మాత:  అగ్రహారం నాగిరెడ్డి, సంజీవ్ రెడ్డి, రూప జగదీష్
దర్శకత్వం:  జి నాగేశ్వర రెడ్డి
సినిమాటోగ్రఫీ: సాయి శ్రీరామ్
మ్యూజిక్: సాయి కార్తిక్
ఎడిటర్‌: ఛోటా కే ప్రసాద్
విడుదల తేదీ: నవంబర్ 15, 2019
రేటింగ్: 2/5

చాలా కాలం నుంచి ఓ స్ట్రాంగ్ కమర్షియల్ హిట్ కోసం ఎదురుచూస్తున్న హీరో సందీప్ కిషన్ కి ‘నిను వీడని నీడను నేనే’ సినిమా ఒక మోస్తారు హిట్ ఇచ్చింది. కానీ తను ఆశిస్తున్న సూపర్ స్ట్రాంగ్ కమర్షియల్ హిట్ ఇవ్వలేదు. దానికోసం ఈ సారి కమర్షియల్ ఎంటర్టైనర్స్ తీయడంలో మంచి పేరున్న జి. నాగేశ్వరరెడ్డితో కలిసి ‘తెనాలి రామకృష్ణ బిఏబిఎల్’ సినిమా చేసాడు. సందీప్ కిషన్ కెరీర్లోనే అత్యధిక థియేటర్స్ లో నవంబర్ 15న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాని మేము స్పెషల్ ప్రీమియర్ షో చూసాము. 2 గంటలు నాన్ స్టాప్ నవ్వులు ఉండమని చెప్పుకున్న ఈ సినిమా ఎంతవరకూ ప్రేక్షకులను నవ్వించిందో ఇప్పుడు చూద్దాం..

కథ: 

ఓపెన్ చేస్తే.. కర్నూలు కొండారెడ్డి బురుజు దగ్గర ఓ మర్డర్. అదే కర్నూలులో జనహితం కోరే ఇండస్ట్రియలిస్ట్ వరలక్ష్మీ దేవి(వరలక్ష్మీ శరత్ కుమార్)ని ఆ కేసులో ఇరికిస్తారు. ఇదిలా ఉండగా మంచి టాలెంట్ ఉన్నా, అస్సలు కేసులే లేని లాయర్ మన తెనాలి రామకృష్ణ(సందీప్ కిషన్). అలా కేసుల కోసం చూస్తున్న తరుణంలో ఓ రోజు అనుకోకుండా ఇద్దరినీ కాంప్రమైజ్ చేయడం వల్ల మనీ వస్తుంది. దాంతో కోర్టులో పెండింగ్ లో ఉన్న కేసుల్ని కాంప్రమైజ్ చేస్తూ మనీ సంపాదిస్తుంటాడు. కానీ తెనాలి ఫాదర్ దుర్గారావు(రఘుబాబు)కి మాత్రం తెనాలిని ఒక సక్సెసఫుల్ లాయర్ గా చూడాలనుకుంటుంటాడు. అదే టైంలో అనుకోకుండా వరలక్ష్మీ దేవిని మర్డర్ కేసులో ఇరికించిన వారి గురించి తెనాలికి తెలుస్తుంది. అప్పుడు తెనాలి వరలక్ష్మీ దేవి పక్కన నిలబడి కేసు గెలిపిస్తాడు. అలా బయటకి వచ్చిన తనని బెనర్జీ చంపాలనుకుంటాడు. అసలు ఈ బెనర్జీ ఎవరు? ఎందుకు ప్రజలకి మంచి చేసే వరలక్ష్మీ దేవిని చంపాలనుకున్నాడు? ఆ టైములో తెనాలి ఏం చేసాడు? ఇంతకీ మొదట్లో జరిగిన మర్డర్ ఎవరిదీ? ఆ మర్డర్ చేసిన అసలైన దోషి ఎవరు.? ఎలా ఆ నేరాన్ని తెనాలి ప్రూవ్ చేసాడు అన్నదే కథ.

సీటీమార్ పాయింట్స్:

ఆన్ స్క్రీన్:

తెరమీద మనల్ని బాగా నవ్వించే సీన్ సత్య కృష్ణన్ చేసిందనే చెప్పాలి. కెఏ పాల్ పాటల స్టైల్ లో తను మాట్లాడడం సూపర్బ్. ఉన్నది రెండే రెండు సీన్స్ అయినప్పటికీ బాగా నవ్వుకుంటాం ముఖ్యంగా కోర్ట్ సీన్ లో ఆవిడ బిట్ హైలైట్. ఆ హిలేరియస్ బిట్ కి కంటిన్యూగా వచ్చే కోర్ట్ సీన్ కూడా బాగుంది. అలాగే బెనర్జీతో సందీప్ కిషన్ – వరలక్ష్మీ శరత్ కుమార్ బస్సు ఎపిసోడ్ బాగుంది. ముఖ్యంగా అక్కడ వరలక్ష్మీ శరత్ కుమార్ నెగటివ్ షేడ్స్ సూపర్బ్ అనిపిస్తాయి. వెన్నెల కిషోర్ ఫామిలీ ద్వారా రివీల్ చేసే ఒక ట్విస్ట్ బాగుంది. ఓవరాల్ గా అక్కడక్కడా కొన్ని కామెడీ సీన్స్ ఒక మోస్తారుగా నవ్విస్తాయి.

ఇక నటీనటుల పరంగా చెప్పుకోవాలంటే.. వరలక్ష్మీ శరత్ కుమార్ ఇప్పటికే తమిళంలో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు చేసి శభాష్ అనిపించుకున్నారు. అదే తరహాలో ఇక్కడ కూడా అందరూ  వరలక్ష్మీ శరత్ కుమార్ పెర్ఫార్మన్స్ ని మెచ్చుకుంటారు. తన పాత్రకి డబ్బింగ్ కూడా బాగా చెప్పారు. ఇక హీరో సందీప్ కిషన్ ఇందులో కొత్తగా ఏమీ ఎట్రీ చేయలేదు. అన్ని కమర్షియల్ సినిమాల్లో లానే ఇందులోనూ చేశారు. పెర్ఫార్మన్స్ పరంగా యాజిటీజ్ గా ఉంది, కానీ ఇందులో డాన్సులు కాటా బెటర్ గా ట్రై చేసారు. అయ్యప్ప, మురళీ శర్మ, సప్తగిరి తమ పాత్రల పరిధిమేర నటించారు.
ఆఫ్ స్క్రీన్:

ఆఫ్ స్క్రీన్ పరంగా అంటే..  సాయి శ్రీరామ్ విజువల్ మేకింగ్ చాలా బాగుంది. కలర్ఫుల్ గా తీశారు ముఖ్యంగా పాటల విజువల్స్ మనల్ని లేచెల్లకుండా చూసేలా చేస్తాయి. అలాగే సాయి కార్తీక్ అందించిన పాటలు బాగున్నాయి, అంతకు మించి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. ఎలివేషన్ సీన్స్ లో మ్యూజిక్ అదిరింది. వెంకట్ కంపోజ్ చేసిన ప్రీ ఇంటర్వల్, ఇంటర్వెల్ యాక్షన్ ఎపిసోడ్స్ బాగున్నాయి. కిరణ్ ఆర్ట్ వర్క్ బాగుంది.

మైనస్ పాయింట్స్:

ఆన్ స్క్రీన్:

ఈ చిత్ర టీం అంతా రెండు గంటలు గ్యారంటీగా నవ్విస్తాం అని చెప్పుకొచ్చారు, కానీ వారు నవ్విస్తాం అని నమ్మిన సీన్స్ ఏవీ పెద్దగా నవ్వించలేకపోవడమే ఈ సినిమాకి బిగ్గెస్ట్ మైనస్. రాసుకున్న కామెడీ సీన్స్ అన్నీ అవుట్ డేటెడ్ మరియు ఇప్పటికీ చాలా సినిమాల్లో చూసేసాం. మరీ కొన్ని సీన్స్ అయితే హిట్ అయినా కామెడీ ఎపిసోడ్స్ ని మళ్ళీ రిపీట్ చేయడానికి ట్రై చేశారు. చాలా సీన్స్ మనకు రాజా ది గ్రేట్, ఎఫ్2 సినిమాలలోని సీన్స్ ని ఎక్కువగా గుర్తుకు తెస్తాయి. సీన్ లో కంటెంట్ లేకుండా ప్రాసలు ట్రై చేశారు, దాంతో అవి పేలలేదు. అలాగే ప్రతి సినిమాని నడిపించే ఒక ఎమోషన్ ఉంటుంది. ఈ సినిమాలోనూ ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ లో కంటెంట్ ఉంది. కానీ స్క్రీన్ మీదకి తీసుకొచ్చే ప్రక్రియలో అది మొత్తం డైల్యూట్ అయిపొయింది. అందుకే ఈ ఎమోషన్ కి కనెక్ట్ అవ్వరు. సో అతుకుల బొంతలా సాగే కొన్ని సీన్స్ చూస్తున్నాము అనే ఫీలింగ్ వస్తుంది. చమ్మక్ చంద్ర తో చేసిన జబర్దస్త్ స్కిట్ టైపు సీన్స్ నవ్వించకపోగా చాలా ఎబ్బెట్టుగా ఉన్నాయి. అలాగే సినిమాని ఎక్కడా సీరియస్ మోడీ లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయలేదు. చాలా సింపుల్ గా పై పైన ఆక్ ఈజ్ పాక్, పాక్ ఈజ్ లాక్ అన్నట్టు చెప్పి ఫినిష్ చేసేసారు.

ముఖ్యంగా ఇలాంటి ఈసినిమాలో ఇంటెర్వల్ మరియు క్లైమాక్స్ బెటర్ గా ఆశిస్తారు. ఇంటర్వల్ బ్లాక్ చాలా సప్పగా ఉండడంతో ఇదేం ఇంటర్వెల్ బాంగ్ రా బాబూ, సర్లే వాళ్ళు ఇచ్చారు తప్పదు మనం తీసుకోవాలి అని బ్రేక్ తీసుకుంటాం తప్ప సెకండాఫ్ చూడాలి అనే ఆసక్తిని ఇంటర్వల్ బ్లాక్ క్రియేట్ చేయలేదు. అలాగే ప్రీ క్లైమాక్స్ అండ్  క్లైమాక్స్ కూడా చాలా సిల్లీగా ఫినిష్ చేసేసారు. టైటిల్ లో బిఏబిఎల్ అని పెట్టిన దానికన్నా ఈ సినిమాలో రెండు మూడు స్ట్రాంగ్ కోర్ట్ సీన్స్ ఉండాల్సింది, కానీ లేవు. చాలా సింపుల్ గా వాదన లేకుండా కేసు ఫినిష్ చేసేసి కథ ముగించేయడం చూసి ఏంటి అయిపోయిందా, ఇంతోటి దానికా ఇంత సేపు లాగ్ చేసింది అనే ఫీలింగ్ తో బయటకి వస్తాం. అలాగే వెన్నెల కిషోర్ ఎపిసోడ్స్ అయితే ఎక్కడా మనకు నవ్వు తెప్పించదు. సెకండాఫ్ లో ఒక నాలుగు సీన్స్ తర్వాత మళ్ళీ ట్రాక్ మర్చి కామెడీ చేయించాలని చేసిన ప్రయత్నం నవ్వించకపోగా చిరాకు తెప్పించేస్తుంది.

ఆఫ్ స్క్రీన్:

ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో సందీప్ కిషన్.. సరిగా గుర్తింపులేని ఎంతోమంది టాలెంటెడ్ పీపుల్ కలిసి ఈ సినిమా చేసారు అని చెప్పారు.. వారి టాలెంట్ ఏ రేంజ్ అనేది ఇప్పుడు చెప్తా.. ప్రతి సినిమాకి ప్రాణం కథ.. ఈ సినిమా కథని రాజసింహా రాశారు. స్టోరీ లైన్ చాలా అంటే చాలా పాతది. చెప్పాలంటే ఒక 3 జెనరేషన్స్ నుంచి ఇలాంటి కథల్ని చూసి చూసి మన ఆదిఅయిన్స్ కి బోర్ కొట్టేసింది. అంత పాత కథ. సరే అది పక్కన పెడదాం.. కథ పాతదైనా కథలోని సీన్స్ అన్నా కొత్తగా ఉన్నాయా అంటే అవీ లేదు. సీన్స్ అన్నీ అక్కడో ఇక్కడో ఏదో ఒక సినిమాలో చూసినవే.. ఇక మరి ఏ విధంగా ఈ టాలెంటెడ్ రైటర్ మంచి కథ రాసినట్టు.??

సరే కథ పాతదే కథనంతో ఆకట్టుకున్నారా అనే విషయానికి వస్తే.. ఒకరు కాదు ముగ్గురు: రాజు, గోపాల కృష్ణ, జి నాగేశ్వర రెడ్డి కలిసి కాథనం రాశారు. అయినా ఏం లాభం లేదు.. ఇంతమంది బుర్రలు అలోచించి రాసినవి ఆడియన్స్ చాలా ఈజీగా ఊహించేస్తారు. చెప్పాలంటే కథలో ట్విస్ట్ లతో పాటు నెక్స్ట్ సీన్ అండ్ డైలాగ్స్ కూడా యిట్టె చెప్పేస్తున్నారు. ఇక ఆడియన్స్ ని ఎలా మీరు ఎంగేజ్ చేసినట్టు. కనీసం నవ్వించి ఉన్నా ఆ నవ్వులో ఫ్లో మిస్ అయినా పర్లేదు కానీ నవ్వించలేకపోవడంతో కథనం విషయంలో ముగ్గురు బుర్ర బద్దలు కొట్టుకొని రాసింది మరీ బోరింగ్ గా తయారైంది. ముఖ్యంగా సెకండాఫ్ సెకండ్ పార్ట్ అయితే బాబోయ్, ఎందుకీ సాగదీత, మాకీ టార్చర్ ఏల అనే ఫీలింగ్ ని ఇస్తుంది.

ఇక డైరెక్టర్ గా జి. నాగేశ్వర రెడ్డి, ఏ విషయాన్ని సీరియస్ గా తీసుకోలేదనేది క్లియార్ గా స్క్రీన్ మీద తెలిసిపోతుంది. కామెడీ, ఎమోషన్, పాత్రల డిజైనింగ్, అలాగే పాత్రల జస్టిఫికేషన్ సరిగా ఉండదు. సీన్ లో కంటెంట్/ఫన్ ఉంటే ప్రాస డైలాగ్స్ అవసరం లేదు, ఎమోషన్ ఫ్లో బాగుంటే అనవసరపు కామెడీ సీన్స్ మధ్యలో రావు, హీరో – విలన్ మధ్య పోటీ లేకపోతే చాలా సీన్స్ పండవు, ఇలాంటి బేసిక్ లాజిక్స్ కూడా ఎలా మిస్సయ్యారో డైరెక్టర్. విలన్ పాత్రలకి పరిచయం చెప్పుడు ఇచ్చే బిల్డప్ ఎవరెస్టు రేంజ్ లో ఉంటే రాను రాను ఆ పాత్రల దిగజారుడు పాతాళానికి పడిపోయింది. అందుకే హీరో – విలన్ మధ్య డ్రామాలో అస్సలు కిక్ ఉండదు. ఈయన సినిమాల్లో ది వరస్ట్ క్లైమాక్స్ గా దీనిని చెప్పుకోవచ్చు. కమర్షియల్, హిట్ అనే పిచ్చిలో అదే మూస పద్దతిని ఫాలో అయ్యి గట్టిగా దెబ్బ తిన్నారని చెప్పాలి. ఇక నివాస్, భవానీ ప్రసాద్, జి. నగేస్జ్వార్ రెడ్డి కలిసి రాసుకున్న డైలాగ్స్ కూడా పెద్దగా పేలలేదు. అంతా అనవసరపు ప్రాసలే తప్ప, మనకు గుర్తుండిపోయే డైలాగ్ ఒక్కటీ లేదు. ప్రేక్షకులు ఎప్పుడో అప్డేట్ అయ్యారు, వారి మొబైల్లో ఫ్రీగా కొన్ని వందల రకాల ఎంటర్టైన్మెంట్స్ దొరుకుతున్నాయి, వారు డబ్బులిచ్చి థియేటర్ కి వస్తున్నారంటే వారికన్నా ఉపాదాటేలో ఉండాలి అనే లాజిక్ రచయితా – దర్శకులు మర్చిపోకూడదని మనవి.

చోటా కె ప్రసాద్ ఎడిటింగ్ అంతగా లేదని చెప్పాలి. రన్ టైమ్ షార్ట్ చేయాలనీ చాలా కట్ చేశారు. అందుకే కొన్ని సీన్స్ లో జుంప్స్ ఉంటాయి. అలాగే చాలా సీన్స్ లాగ్ ఉన్నా వదిలేశారు. చెప్పాలంటే ఈయన్ని ఏమీ అనలేం ఎందుకంటే కంటెంట్ అలా ఉంది కాబట్టి.. నిర్మాణ విలువలు బాగున్నా, ఇలాంటి వీక్ కథకి అంత పెట్టడం, డైరెక్షన్ లో కూడా బెటర్ అవుట్ ఫుట్ తీసుకురాకపోవడంతో ఈ చిత్ర బడ్జెట్ అంతా బూడిదలోపోసిన పన్నీరైంది.

విశ్లేషణ: 

బిఫోర్ రిలీజ్ ‘తెనాలి రామకృష్ణ బిఏబిఎల్’ టీం చెప్పిన మాట ‘ 2 గంటలు నాన్ స్టాప్ గా నవ్విస్తాం.. సినిమా చూసాక ఆడియన్స్ రెస్పాన్స్ – 2 గంటలు కాదు కదా 20 నిమిషాలు కూడా నవ్వించలేకపోయారు. దాంతో చూసే ఆడియన్స్ దీనికంటే టీవీలోనో, యుట్యూబ్ లోనో నాలుగు జబర్దస్త్ వీడియోలు చూసుకుంటే బాగుండేదని ఫీలవుతున్నారు. మాస్, కమర్షియల్ అనే ఇమేజ్ వేటలో, మేము రాసిందే కామెడీ, దానికి నాలుగు పాటలు, మూడు ఫైట్లు పెడితే చాలు అని సినిమా తీసిన విధానం చూస్తుంటే ప్రేక్షకులు పెట్టె మనీ కి బేసిక్ రెస్పెక్ట్ కూడా ఇవ్వడం లేదనేది క్లియర్ గా ఈ సినిమా లో కనపడుతుంది. కనీసం తెనాలి రామకృష్ణ అనే గ్రేట్ లెజెండ్ పేరు టైటిల్ లో ఉన్నప్పుడు ఆయన రేంజ్ ని మ్యాచ్ అయ్యే సీన్స్ ఒక రెండన్నా ఉండాలిగా.?? అలాంటప్పుడు టైటిల్ మరియు హీరోకి ఆ పేరెందుకు.?? ఇలా అడిగితే చాలా బొక్కలే ఉన్నాయి. ఓవరాల్ గా ఇదొక ఎంటర్టైనర్, ఫుల్ నవ్విస్తాం అని చెప్పి అని చెప్పి కంప్లీట్ గా మనల్ని నవ్వించలేకపోయిన సినిమానే ‘తెనాలి రామకృష్ణ బిఏబిఎల్’.

కొసమెరుపు: థియేటర్ బయటకి వస్తూ ఓ కామన్ ఆడియన్ అన్న మాట ‘దీనికి మించిన కామెడీ జబర్దస్త్, పటాస్, యు ట్యూబ్ వీడియోస్ లో చూస్తున్నాం… వీళ్ళు మాత్రం అప్డేట్ అవ్వకుండా ఇంకా అదే రొట్ట ఫార్మట్ లో, అదే ప్రాస మూసలో తీస్తారేంట్రా, అప్డేట్ అవ్వరా’ అని తన ఫ్రెండ్ ని అడిగితే, తనొక లుక్ ఇచ్చి ‘సినిమా రిజల్ట్ తేడా కొడితే మారుతారేమో’ చూద్దాం అనుకుంటూ వెళ్లారు. అర్థం చేసుకుంటే నేటి రచయితలు ఎంత అడ్వాన్స్ గా ఉండాలో తెలుస్తుంది.

ఫైనల్ పంచ్: ‘తెనాలి రామకృష్ణ బిఏబిఎల్’ – నవ్వులేమోగానీ, చిరాకు మాత్రం పెట్టిస్తాడు.

68 COMMENTS

  1. Хотите получить идеально ровные стены в своей квартире или офисе? Обращайтесь к профессионалам на сайте mehanizirovannaya-shtukaturka-moscow.ru! Мы предоставляем услуги по механизированной штукатурке стен в Москве и области, а также гарантируем быстрое и качественное выполнение работ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను...

Upasana: ఆవకాయ పట్టిన అత్తమ్మ.. ఆటపట్టించిన ఉపాసన.. వీడియో వైరల్  

Upasana: టాలీవుడ్ (Tollywood) లో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఒక సందడి. ఒక బ్రాండ్. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi). ఆయనొక ఇన్ స్పిరేషన్...

Puri Jagannadh: ఎవరు కొడితే బొమ్మ బ్లాక్ బస్టరవుద్దో.. అతనే ‘పూరి...

Puri Jagannadh: సినిమాకి హీరోకి ఉండే క్రేజే వేరు. సరైన సినిమాపడి స్టార్ స్టేటస్ వస్తే ఫ్యాన్స్ పెరుగుతారు.. డెమీ గాడ్ కూడా అయిపోతాడు. హీరో...

Harish Shankar: చోటా కె.నాయుడుపై హరీశ్ శంకర్ ఆగ్రహం.. బహిరంగ లేఖ

Harish Shankar: టాలీవుడ్ (Tollywood) సీనియర్ స్టార్ సినిమాటోగ్రాఫర్ చోటా కె.నాయుడు (Chota K Naidu) పై బ్లాక్ బస్టర్ దర్శకుడు హరీశ్ శంకర్ (Harish...

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

రాజకీయం

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

కులాంతరంలో కూడా రాజకీయ క్రీడ.!

ప్రజల నుంచి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోవాలి అంటే.. ప్రజలందరికి మంచి చెయ్యటం వ్యక్తులకి సాధ్యం కాదు. అందుకని మనుషులని ఎదో ఒకరకంగా కూడగట్టాలి. ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు,...

ఎన్డిఏ కూటమి అభ్యర్థులను గెలిపించండి.. అభిమానులకు మెగాస్టార్ పిలుపు

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు సీఎం రమేష్, పంచకర్ల రమేష్ బాబును గెలిపించాలంటూ మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi) తన అభిమానులకు పిలుపునిచ్చారు. ఏపీలో చంద్రబాబు నాయుడు,...

నర్సాపురం అసెంబ్లీ గ్రౌండ్ రిపోర్ట్: ఎడ్జ్ జనసేన పార్టీకే.!

2024 ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నర్సాపురం కూడా ఒకింత హాట్ టాపిక్ అవుతున్న నియోజకవర్గమే. నర్సాపురం లోక్ సభ నియోజకవర్గం అలాగే, ఆ పరిధిలోని నర్సాపురం అసెంబ్లీ నియోజకవర్గం.. ఈ...

ఎక్కువ చదివినవి

Nara Rohit: నారా రోహిత్ @20 ‘సుందరకాండ’.. ఫస్ట్ లుక్, రిలీజ్ డేట్ రివీల్

Nara Rohit: నారా రోహిత్ (Nara Rohit) హీరోగా నటిస్తున్న 20వ సినిమా ‘సుందరకాండ’. శ్రీరామనవమి పండగ సందర్భంగా చిత్ర బృందం టైటిల్ రివీల్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేసింది. నూతన దర్శకుడు...

CM Jagan: సీఎం జగన్ ఎదుటే పవన్ కల్యాణ్ నినాదం.. జేజేలు

CM Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (CM Jagan) కి జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అభిమానుల నుంచి నిరసన ఎదురైంది. సీఎం ఎదుటే...

ఎన్డిఏ కూటమి అభ్యర్థులను గెలిపించండి.. అభిమానులకు మెగాస్టార్ పిలుపు

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు సీఎం రమేష్, పంచకర్ల రమేష్ బాబును గెలిపించాలంటూ మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi) తన అభిమానులకు పిలుపునిచ్చారు. ఏపీలో చంద్రబాబు నాయుడు,...

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

బి-ఫామ్స్ అందిస్తూ.. ప్రమాణం చేయించిన పవన్ కళ్యాణ్.!

రాజకీయాల్లో ఇదొక కొత్త ఒరవడి.. అనడం అతిశయోక్తి కాదేమో.! జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్న 21 మంది అసెంబ్లీ అభ్యర్థులు, ఇద్దరు లోక్ సభ అభ్యర్థులకు (తనతో కలుపుకుని) జనసేన అధినేత...
సినిమా రివ్యూ: తెనాలి రామకృష్ణ బిఏబిఎల్   నటీనటులు:  సందీప్ కిషన్, హన్సిక, వరలక్ష్మీ శరత్ కుమార్, అయ్యప్ప, మురళీ శర్మ, వెన్నెల కిషోర్, సప్తగిరి, తదితరులు నిర్మాత:  అగ్రహారం నాగిరెడ్డి, సంజీవ్ రెడ్డి, రూప జగదీష్ దర్శకత్వం:  జి నాగేశ్వర రెడ్డి సినిమాటోగ్రఫీ: సాయి శ్రీరామ్ మ్యూజిక్: సాయి కార్తిక్ ఎడిటర్‌: ఛోటా కే ప్రసాద్ విడుదల తేదీ: నవంబర్ 15, 2019 రేటింగ్: 2/5 చాలా కాలం నుంచి ఓ స్ట్రాంగ్ కమర్షియల్ హిట్ కోసం ఎదురుచూస్తున్న హీరో సందీప్ కిషన్ కి 'నిను వీడని...సినిమా రివ్యూ: తెనాలి రామకృష్ణ బిఏ బిఎల్