Switch to English

మోహన్‌బాబు ముక్కుసూటితనం.. ఇంతేనా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,466FansLike
57,764FollowersFollow

సినీ నటుడు మోహన్‌బాబు, ‘మా’ ఎన్నికల్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని, తన కుమారుడ్ని బరిలోకి దింపారు. కులం, మతం, ప్రాంతం.. ఇలా ఒకటేమిటి.? అన్ని కోణాల్నీ ‘మా’ ఎన్నికల కోసం మంచు విష్ణు వర్గం తెరపైకి తెచ్చినప్పుడు, ‘అది తప్పు..’ అని వారించలేకపోయిన మోహన్‌బాబు, ‘నేను ముక్కుసూటిగా వున్నది వున్నట్లు మాట్లాడే వ్యక్తిని.. నాకు రాగద్వేషాలు లేవు..’ అంటూ సొంత డబ్బా కొట్టుకుంటున్నారు.

చెప్పే మాటలకూ, చేసే చేతలకీ అస్సలు పొంతన లేకపోవడమంటే, అందుకు కేరాఫ్ అడ్రస్ మోహన్‌బాబు.. అని చెప్పుకోవాల్సి వస్తోందిప్పుడు.. అన్నది సినీ పరిశ్రమలో బలంగా వినిపిస్తోన్న మాట. ‘చిరంజీవి నాకు మంచి స్నేహితుడు..’ అని పదే పదే చెప్పే మోహన్‌బాబు, తన కుమారుడు మంచు విష్ణు.. ‘మా’ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన కార్యక్రమానికి చిరంజీవిని ఆహ్వానించలేకపోయారు.

‘మేమంతా సినీ కళామతల్లి బిడ్డలం..’ అని ఓ వైపు చెబుతూనే, ఇంకో వైపు.. పరిశ్రమను రెండు వర్గాలుగా విభజించి, ఓ వర్గానికి ‘నాయకత్వం’ వహించేందుకోసం సర్వశక్తులూ ఒడ్డుతున్నారు మోహన్‌బాబు. నాయకత్వం అంటే ఏంటి.? నాయకుడన్నవాడు, తనను నమ్మకున్నవారికోసం నిలబడాలి. వారికి కష్టమొస్తే ఆదుకోవాలి. చిత్రంగా, నాయకుడ్ని, ప్రజలకు అప్పగించి.. ‘వాడి బాధ్యత మీదే..’ అని చెప్పడం మోహన్‌బాబుకే చెల్లింది.

అవును మరి, ‘మా’ ఎన్నికల్లో మంచు విష్ణు అధ్యక్షుడిగా గెలిస్తే, సభ్యుల్ని ఉద్దేశించి ప్రసంగించిన సమయంలో మోహన్‌బాబు వ్యాఖ్యానిస్తూ, ‘మీకు నా బిడ్డను అప్పగిస్తున్నా.. బాగా చూసుకోండి..’ అంటూ మోహన్‌బాబు చెప్పడంతో ‘మా’ సభ్యులంతా ఆశ్చర్యపోయారు.

ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి గెలిచినవారు రాజీనామా చేశారు.. ప్రకాష్ రాజ్, నాగబాబు తమ సభ్యత్వాలకే రాజీనామా చేసేశారు. మరి, మోహన్‌బాబు బాధ్యత తీసుకుని, వాళ్ళతో మాట్లాడాలి కదా.? ఇదేం పెద్దరికం.? పైగా, ‘ముక్కుసూటిగా మాట్లాడతాను.. నాకు ఎవరి మీదా రాగద్వేషాలు లేవు..’ అని చెప్పడం.

ఇందుకే, ఈ వైఖరి కారణంగానే.. మంచు విష్ణు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సినీ పెద్దలెవరూ హాజరు కాలేదన్న చర్చ సినీ పరిశ్రమలో గట్టిగా వినిపిస్తోంది. క్రమశిక్షణ.. అని పదే పదే చెప్పుకునే మోహన్‌బాబు, సాటి నటుడ్ని ప్రాంతం పేరుతో.. పరిశ్రమకు దూరం పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నప్పుడు తన కుమారుడ్ని, తన కుమారుడి వెంట వుండి ప్రకాష్ రాజ్ మీద విమర్శలు చేస్తున్నవారిని వారించలేకపోవడమేంటి.?

9 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను...

Upasana: ఆవకాయ పట్టిన అత్తమ్మ.. ఆటపట్టించిన ఉపాసన.. వీడియో వైరల్  

Upasana: టాలీవుడ్ (Tollywood) లో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఒక సందడి. ఒక బ్రాండ్. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi). ఆయనొక ఇన్ స్పిరేషన్...

Puri Jagannadh: ఎవరు కొడితే బొమ్మ బ్లాక్ బస్టరవుద్దో.. అతనే ‘పూరి...

Puri Jagannadh: సినిమాకి హీరోకి ఉండే క్రేజే వేరు. సరైన సినిమాపడి స్టార్ స్టేటస్ వస్తే ఫ్యాన్స్ పెరుగుతారు.. డెమీ గాడ్ కూడా అయిపోతాడు. హీరో...

Harish Shankar: చోటా కె.నాయుడుపై హరీశ్ శంకర్ ఆగ్రహం.. బహిరంగ లేఖ

Harish Shankar: టాలీవుడ్ (Tollywood) సీనియర్ స్టార్ సినిమాటోగ్రాఫర్ చోటా కె.నాయుడు (Chota K Naidu) పై బ్లాక్ బస్టర్ దర్శకుడు హరీశ్ శంకర్ (Harish...

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

రాజకీయం

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

కులాంతరంలో కూడా రాజకీయ క్రీడ.!

ప్రజల నుంచి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోవాలి అంటే.. ప్రజలందరికి మంచి చెయ్యటం వ్యక్తులకి సాధ్యం కాదు. అందుకని మనుషులని ఎదో ఒకరకంగా కూడగట్టాలి. ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు,...

ఎన్డిఏ కూటమి అభ్యర్థులను గెలిపించండి.. అభిమానులకు మెగాస్టార్ పిలుపు

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు సీఎం రమేష్, పంచకర్ల రమేష్ బాబును గెలిపించాలంటూ మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi) తన అభిమానులకు పిలుపునిచ్చారు. ఏపీలో చంద్రబాబు నాయుడు,...

నర్సాపురం అసెంబ్లీ గ్రౌండ్ రిపోర్ట్: ఎడ్జ్ జనసేన పార్టీకే.!

2024 ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నర్సాపురం కూడా ఒకింత హాట్ టాపిక్ అవుతున్న నియోజకవర్గమే. నర్సాపురం లోక్ సభ నియోజకవర్గం అలాగే, ఆ పరిధిలోని నర్సాపురం అసెంబ్లీ నియోజకవర్గం.. ఈ...

మెగాస్టార్ చిరంజీవి మీద పడి ఏడుస్తున్న వైసీపీ బ్యాచ్.!

2024 ఎన్నికల్లో దారుణ పరాజయాన్ని ముందే ఊహించుకున్న వైసీపీ, ప్రతి చిన్న విషయానికీ కలత చెందుతోంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పుట్టినరోజు సందర్భంగా పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు...

ఎక్కువ చదివినవి

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్ అంటున్న మేకర్స్

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad Square) తెరకెక్కబోతోంది. యూత్ ఓరియంటెడ్ మూవీస్...

పిఠాపురంలో వంగా గీతకు అదే పెద్ద మైనస్.!

నామినేషన్ల పర్వం షురూ అయ్యింది.! జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 23న పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు. పిఠాపురంలో జనసేనాని పోటీ చేస్తున్నారని కన్ఫామ్ అయినప్పటికీ, ఇప్పటికీ.....

Jr.Ntr: ఎన్టీఆర్ తో ఊర్వశి రౌతేలా సెల్ఫీ..! సారీ చెప్పిన నటి.. ఎందుకంటే..

Jr.Ntr: యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr.Ntr) బాలీవుడ్ (Bollywood) లోకి అడుగు పెడుతున్న సంగతి తెలిసిందే. హృతిక్ రోషన్ తో కలిసి వార్-2 (War 2) సినిమాలో నటిస్తున్నాడు. ఇందుకు సంబంధించిన షూటింగ్...

Tollywood: టాలీవుడ్ లో కలకలం.. కిడ్నాప్ కేసులో ప్రముఖ నిర్మాత..!

Tollywood: జూబ్లీహిల్స్ లోని క్రియా హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ కు సంబంధించి కిడ్నాప్, షేర్ల బదలాయింపు కేసులో ప్రముఖ సినీ నిర్మాత నవీన్ యర్నేని (Naveen Yerneni) పేరు వెలుగులోకి వచ్చింది....

Ritu Varma: నభా నటేశ్-ప్రియదర్శికి రీతూవర్మ క్లాస్.. ట్వీట్ వార్ వైరల్

Ritu Varma: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ‘డార్లింగ్’ సంబోధనపై మాటల యుద్ధం వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ గొడవలోకి హీరోయిన్ రీతూ వర్మ...