Switch to English

కరోనాతో యుద్ధమే చేస్తున్నారు.. అయినా అలసిపోవద్దు: మంత్రి ఈటెల

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,449FansLike
57,764FollowersFollow

‘వైద్య శాఖ సిబ్బంది కరోనాతో యుద్ధ రంగంలో పోరాడుతున్నారు.. అయినా అలసిపోవద్దు’ అని తెలంగాణ వైద్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల సూపరింటెండెంట్లతో మంత్రి టెలి కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఇతర రాష్ట్రాల సరిహద్దుల్లోని జిల్లాల వైద్యాధికారులు అప్రమత్తంగా ఉండాలి. కరోనా మరణాలను అడ్డుకునేందుకు సమన్వయంతో పని చేయాలి. అన్ని ఆస్పత్రుల్లో పీపీఈ కిట్లు, ఎన్‌-95 మాస్కులు, లిక్విడ్‌ ఆక్సిజన్‌ సిలిండర్లు, మందులను అందుబాటులో ఉంచుకోవాలి. ఆస్పత్రుల్లో పడకల కొరత లేకుండా చూడాలి.

 

అవసరమైన చోట వైద్యులు, సిబ్బందిని తాత్కాలికంగా నియమించుకోవాలి. గ్రామాల్లో జ్వరం వచ్చిన ప్రతి ఒక్కరిని, ప్రతిరోజూ పరిశీలించాలి. వైద్య, ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న వారి సెలవులు రద్దు చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం ఆదేశానుసారం ఆదివారం కూడా వ్యాక్సిన్‌ వేయాలి. 45 ఏళ్లు పైబడిన వారందరినీ వాక్సిన్‌ సెంటర్‌కు పంపించాలి. ఆర్టీపీసీఆర్‌ పరీక్షల సంఖ్య పెంచాలి. కరోనాతో అవిశ్రాంతంగా పోరాడే సమయమిదని.. ప్రజా జీవనంలో జీవిస్తూనే కరోనాను నియంత్రించాలని అన్నారు.

 

ఈ సందర్భంగా ప్రజారోగ్య సంచాలకులు జి.శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ‘ఏప్రిల్ మూడో వారం నుంచి మే చివరి వరకు కేసుల భారీగా పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం వందల్లో నమోదవుతున్న కేసులు వేలల్లోకి వెళ్లే ప్రమాదం లేకపోలేదు. ప్రస్తుతం పాత వైర్‌సతోనే కేసులు పెరుగుతున్నాయి. దేశంలో కొత్త వైరస్ కారకాలు గుర్తించినా రాష్ట్రంలో వాటి ప్రభావం అంతగా లేదు. కానీ ప్రజల అలసత్వం వల్ల కేసుల మళ్లీ పెరుగుతున్నాయి. చాలామందిలో లక్షణాలు కనిపించకుండా వైరస్ వ్యాపిస్తోంది’.

 

‘కరోనా వైరస్‌ లేదని భావించడం తగదు. కరోనా కొత్త శక్తిని వృద్ధి చేసుకొని దాడి చేసేందుకు సిద్ధమవుతోంది. సెకండ్‌ వేవ్‌లో యువత సైపర్‌ స్పైడర్లుగా మారే ప్రమాదం ఎక్కువగా ఉంది. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, వృద్ధులు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. వైర్‌సను గుర్తించేందుకు రోజూ దాదాపుగా 50వేలకు పైగా టెస్టులు చేస్తున్నాం. ఆర్‌టీపీసీఆర్‌ విధానంలో టెస్టులు చేస్తున్నాం’ అని అన్నారు.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

రాజకీయం

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

ఎక్కువ చదివినవి

గాజు గ్లాసు ఫ్రీ సింబల్.! ఎవరికి నష్టం.?

గాజు గ్లాసుని కేవలం జనసేన పార్టీకి కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసినట్లుగా ప్రచారం జరిగింది. కానీ, ఇంతలోనే, గాజు గ్లాసు ఫ్రీ సింబల్ అయిపోయింది.! జనసేన పోటీ చేస్తున్న...

Allari Naresh: నా కామెడీ టైమింగ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’లో మళ్లీ చూస్తారు: అల్లరి నరేశ్

Allari Naresh: ‘ప్రేక్షకులకు వేసవిలో 'ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkatee Adakku) పర్ఫెక్ట్ ట్రీట్.. ఇందులో కంటెంట్ నవ్విస్తూనే ఎమోషనల్ కనెక్ట్ అవుతుంద’ని హీరో అల్లరి నరేశ్ (Allari Naresh) అన్నారు....

Chiranjeevi: పిఠాపురంలో చిరంజీవి ప్రచారానికి వస్తారా..?!

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీ రాజకీయాలు వేసవి ఎండలకుమల్లే రోజురోజుకీ హీటెక్కిపోతున్నాయి. పార్టీలన్నీ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఈక్రమంలో రాజకీయాల్లో మిక్స్ అయ్యే సినీ గ్లామర్ ఈసారీ కనిపిస్తోంది. ఎన్నికల సమయంలో...

వెబ్‌చారమ్.! చిరంజీవిపై విషం చిమ్మడమేనా పాత్రికేయమ్.?

కొన్ని మీడియా సంస్థలు రాజకీయ పార్టీలకు అమ్ముడుపోయాయ్.! ఔను, ఇందులో కొత్తదనం ఏమీ లేదు.! కాకపోతే, మీడియా ముసుగులో వెబ్‌చారానికి పాల్పడుతుండడమే అత్యంత హేయం.! ఫలానా పార్టీకి కొమ్ముకాయడం ఈ రోజుల్లో తప్పు...

Mudragada: ముద్రగడ ఇంట రాజకీయ చిచ్చు.. కుమార్తె వ్యాఖ్యలపై పద్మనాభం స్పందన

Mudragada: మాజీ మంత్రి, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభంకు సొంత ఇంటి నుంచే వ్యతిరేకత ఎదురైంది. పవన్ ను ఓడించకపోతే పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానన్న వ్యాఖ్యలను ఆయన కుమార్తె క్రాంతి ఖండించారు. ఆమె...