Switch to English

వలస కూలీల వేదన వర్ణణాతీతం.. ఎవరిదీ పాపం?

నెత్తిన మూట.. చంకలో బిడ్డ.. చేతిలో సంచి.. కాలినడకన వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న సొంతూరికి పయనం.. మధ్యలో ఎన్నో అష్టకష్టాలు.. తీరా అన్నీ దాటుకుని సొంత రాష్ట్రానికి వచ్చినా అనుమతిస్తారో లేదో తెలియని పరిస్థితి.. ఇదీ వివిధ రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలసకూలీల దుస్థితి. లాక్ డౌన్ కారణంగా పరిశ్రమలు మూతపడటంతో ఉపాధి కోల్పోయిన వీరంతా.. కలో గంజో తాగి సొంతూళ్లోనే ఉందామనే భావనతో కాలినడకన ఇంటికి వెళ్లే సాహసానికి పూనుకున్నారు. మార్గమద్యంలో కొంతమంది అసువులు బాసినవారు కూడా ఉన్నారు. అసలు వీరికి ఇలాంటి దుస్థితి రావడానికి కారణమెవరు? మన పాలకులకు ముందు చూపు లేకపోవడమేనా? అంటే ఔననే సమాధానాలు వినిపిస్తున్నాయి.

భారత్ వంటి పెద్ద దేశంలో కోట్లాది మంది బతుకుతెరువు కోసం వివిధ రాష్ట్రాలకు వలస వెళ్తుంటారు. తాత్కాలిక నివాసాలు ఏర్పరుచుకుని పనులు చేసుకుంటుంటారు. అయితే, కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా దేశంలో లాక్ డౌన్ విధించారు. దీంతో దేశం మొత్తం రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. పేదలకు అటు రాష్ట్ర ప్రభుత్వాలు, ఇటు కేంద్ర ప్రభుత్వం సాయం ప్రకటించినా.. అది రేషన్ కార్డు ఉన్నవారికి మాత్రమే అందింది. కానీ కోట్లాది మంది ఉన్న వలస కూలీల సంగతిని ఎవరూ పట్టించుకోలేదు. అసలు వారికి సాయం చేయాలనే సంగతినే దాదాపుగా విస్మరించారు. దీంతో ఉంటున్న చోట పనులు లేకపోవడంతో పస్తులుండలేక ఇంటికి వెళ్లిపోదామని వేలాది మంది కాలినడక బయలుదేరారు.

నెలరోజులపాటు పాలకులు వారి బాధలు పట్టించుకోకుండా చివరకు వలస కార్మికుల కోసం శ్రామిక్ రైళ్లను ప్రవేశపెట్టారు. కానీ కోట్లాది మేర ఉన్న కార్మికులను తరలించడం అంత సులభమైన విషయం కాదనే సంగతి వెంటనే అర్థమైపోయింది. దీంతో వలస కార్మికుల తరలింపు మార్గదర్శకాల్లో మళ్లీ మార్పులు చేయాల్సి వచ్చింది. కేవలం లాక్ డౌన్ ముందు వేరే ప్రాంతాలకు వెళ్లి చిక్కుకుపోయినవారిని మాత్రమే తరలిస్తామని పేర్కొన్నారు. వలస కార్మికుల విషయంలో ప్రభుత్వాలు ముందుచూపుతో వ్యవహరించకపోవడం వల్లే వారు ఇన్ని ఇబ్బందులు పడుతున్నారంటూ విపక్షాలు మండిపడుతున్నాయి. కొన్ని రాష్ట్రాలు వీరి విషయంలో సానుకూలంగానే వ్యవహరించినా.. కొన్ని రాష్ట్రాలు మాత్రం చేతులెత్తేశాయి. ఇక సొంతూళ్లకు వెళ్లిన కార్మికులు మళ్లీ తిరిగి వస్తారా లేదా అనే మీమాంస కూడా పలువురిని వెంటాడుతోంది. ఒకవేళ వారు రాకుంటే నిర్మాణరంగం బాగా ప్రభావితమయ్యే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది.

సినిమా

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా...

కంగనా 50 కోట్ల ఆఫీస్‌ ప్రత్యేకతలు చూద్దాం రండి

సినిమా ఆఫీస్‌ లు ఎంత రాయల్‌ గా ఎంతో అహ్లాదకరంగా ఉంటాయి. ప్రతి చోట కూడా క్రియేటివిటీ కలగలిపి ఉంటాయి. అన్ని విధాలుగా కూడా ప్రశాంతతను...

సోను సూద్ ఆచార్య గురించి ఏమంటున్నాడు?

సోను సూద్ అనే పేరుకు టాలీవుడ్ లో పరిచయం అవసరం లేదు. అరుంధతిలో విలన్ గా చేసిన దగ్గరనుండి సోను సూద్ కు తెలుగులో పాపులారిటీ...

బన్నీకి ఇష్టమైన బాలీవుడ్ సినిమాలివే

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత కొన్నేళ్లుగా ప్యాన్ ఇండియా సినిమా చేయాలని అనుకుంటున్నాడు. అయితే అందుకు సరైన సందర్భం రావట్లేదు. ఇక ఇప్పుడు అల...

నాని మూవీకి ఎన్ని ఆఫర్స్ వచ్చినా నో అంటున్న దిల్ రాజు.!

టాలీవుడ్ అగ్రనిర్మాతల్లో ఒకరు దిల్ రాజు.. ప్రతి ఏడాది దిల్ రాజు నిర్మాణ సంస్థ నుంచి ఐదారు సినిమాలు విడుదలవుతుంటాయి, అంతే కాకుండా పలు సినిమాల...

రాజకీయం

హైకోర్టుపై వైసీపీ నేతల వ్యాఖ్యలు.. 49 మందికి నోటీసులు!

డాక్టర్‌ సుధాకర్‌ వ్యవహారం, ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగుల వ్యవహారం... వంటి విషయాలపై న్యాయస్థానం ఇటీవల ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిన దరిమిలా, అధికార పార్టీకి చెందిన నేతలు న్యాయస్థానం తీర్పుపై అసహనం వ్యక్తం...

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా ల‌క్ష‌లాది మంది సినీ-టీవీ కార్మికులు రోడ్డున...

2021కి పోలవరం.. పోతిరెడ్డిపాడుతో ఎవరికీ నష్టం లేదు.. సీఎం జగన్

అమరావతి: ఎగువ రాష్ట్రాల్లో ప్రాజెక్టులు ఎక్కువగా కట్టడం వల్ల రాష్ట్రానికి నీరు అందని పరిస్థితి ఉందని.. ఈ సమయంలో రాష్ట్రంలో చేపడుతున్న ప్రాజెక్టులపై వివాదాలు సృష్టించడం తగదని ఏపీ సీఎం జగన్ మోహన్...

హైకోర్టు మొట్టికాయలేస్తే.. టీడీపీని టార్గెట్ చేస్తారెందుకు?

ప్రభుత్వ పాఠశాలల్లోంచి తెలుగు మీడియంని తొలగించి, ఇంగ్లీషు మీడియంని తీసుకురావాలని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నానికి న్యాయస్థానం మొట్టికాయలేసింది. దాంతో, రకరకాల మార్గాల్లో తన ఆలోచనను అమలు చేసేందుకు వైఎస్‌...

టీడీపీకి ‘మహా’ షాక్‌: వైసీపీలోకి ‘ఆ’ తెలుగు తమ్ముళ్ళు.?

తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ‘మహానాడు’కి ముందే పార్టీ అధినేతకు ఝలక్‌ ఇచ్చేందుకు వైసీపీ...

ఎక్కువ చదివినవి

తిరుపతి లడ్డూ అమ్మకంపై రమణ దీక్షితులు అసహనం

రమణ దీక్షితులు.. చంద్రబాబు హయాంలో ‘ఉద్యోగం’ కోల్పోయిన టీటీడీ మాజీ ప్రధాన అర్చకుడీయన. అప్పట్లో రమణ దీక్షితులు చేసిన పొలిటికల్‌ యాగీ అంతా ఇంతా కాదు. ఆ తర్వాత ఆయన అప్పటి ప్రతిపక్ష...

దయనీయస్థితిలో బాలీవుడ్ నటుడు

కరోనా నేపథ్యంలో ఇండియాలో పెట్టిన లాక్ డౌన్ వల్ల చాలా మంది ఉపాధి కోల్పోయారు. ఆర్ధిక ఇబ్బందులతో చాలా మంది అల్లాడిపోతున్నారు. వారిలో ప్రముఖ హిందీ నటుడు, మహాభారత్ సీరియల్ లో ఇంద్రుడి...

చిరు, ఎన్.టి.ఆర్ సినిమాలలో సరసన ఒకప్పటి హీరోయిన్.?

తెలుగు సినిమాలలో ప్రస్తుతం ఒకప్పటి హీరో, హీరోయిన్స్ ని, నటీనటుల్ని మళ్ళీ తెరపైకి తీసుకొచ్చి కాంబినేషన్స్ ని చాలా ఫ్రెష్ గా ఉండేలా డైరెక్టర్స్ ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూనే ఉన్నారు. అందులో భాగంగానే...

రంజాన్‌ స్పెషల్‌: ఇఫ్తార్‌.. ఈ ఏడాదికి ఇంతే.!

ఇస్లాం మతంలో ఇఫ్తార్‌ విందుకి ఎంతో ప్రత్యేకత వుంది. రంజాన్‌ సీజన్‌లో ఇఫ్తార్‌ విందులు చాలా చాలా ప్రత్యేకమైనవి. ప్రభుత్వాలు సైతం ఇఫ్తార్‌ విందుల్ని ఏర్పాటు చేస్తుంటాయి అధికారికంగా. ముస్లింల ఓటు బ్యాంకు...

కంగనా 50 కోట్ల ఆఫీస్‌ ప్రత్యేకతలు చూద్దాం రండి

సినిమా ఆఫీస్‌ లు ఎంత రాయల్‌ గా ఎంతో అహ్లాదకరంగా ఉంటాయి. ప్రతి చోట కూడా క్రియేటివిటీ కలగలిపి ఉంటాయి. అన్ని విధాలుగా కూడా ప్రశాంతతను కలిగించేలా సినిమా ఆఫీస్‌ లను ఫిల్మ్‌...