Switch to English

చంద్రబాబు అలా.. టీడీపీ నేతలు ఇలా..

విశాఖ గ్యాస్ లీక్ ఎపిసోడ్ లో టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. ఇన్నాళ్లు రాజకీయాల్లో ఉన్న తనకు స్టైరీన్ అంటే ఏమిటో తెలియదని, ఇక ఐఏఎస్ లకు ఏమి తెలుస్తుందని చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు ఆడుకుంటున్నారు. అసలు బాబుకు ఏమైందని, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారని ప్రశ్నలు గుప్పిస్తున్నారు. ప్రధానులను, రాష్ట్రపతులను ఎంపిక చేసిన ఆ బాబు ఈ బాబు ఒకరేనా అని ఎద్దేవా చేస్తున్నారు. ఇక పరిహారం విషయంలోనూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు పరిహాసానికి గురవుతున్నాయి.

రూ.కోటి మనిషి బతికి వస్తాడా? అసలు రూ.కోటి సరిపోతాయా? అయినా డబ్బులివ్వమని ఎవరైనా అడిగారా? అని ఆయన అనడంపై విస్తుపోతున్నారు. చనిపోయినవారిని తిరిగి తీసుకురావడం ఎవరి వల్లా కాదు. బాధిత కుటుంబీకులకు జరిగిన నష్టాన్ని దేంతోనూ పూడ్చలేం. కానీ ఏవైనా ప్రమాదాలు జరిగినప్పుడు మృతులు, క్షతగాత్రుల కుటుంబాలకు పరిహారం ప్రకటించడం ఆనవాయితీ. ఆ డబ్బులతో వారు సుఖపడిపోతారని కాదు.. చినపోయినవారిని తిరిగి ఎలాగూ తీసుకురాలేం, కానీ మీకు ఏ లోటూ రాకుండా చూసుకునేందుకు ఈ విధంగా సాయం చేస్తాం అని చెప్పడమే ఈ ఎక్స్ గ్రేషియా ప్రకటించడానికి కారణం. నిజానికి ఏదైనా ప్రమాదం జరిగిన వెంటనే రాజకీయ పార్టీల డిమాండ్ కూడా ఇదే ఉంటుంది. ఎవరికి తోచినరీతిలో వారు నష్టపరిహారం డిమాండ్ చేస్తుంటారు.

ప్రభుత్వం మాత్రం తాను ఇవ్వాలనుకున్నది ఇచ్చి చేతులు దులుపుకొంటుంది. విశాఖ గ్యాస్ దుర్ఘటనపై కూడా వివిధ రాజకీయ పార్టీలు పరిహారం ప్రకటించాలని డిమాండ్ చేశాయి. ఒక్కో పార్టీ రూ.10 లక్షల నుంచి రూ.50 లక్షలు నష్టపరిహారం ప్రకటించాల్సిందిగా డిమాండ్ చేయాలని అనుకున్నాయి. కానీ సీఎం జగన్ రూ.కోటి పరిహారం ప్రకటించడంతో వారికి మాట్లాడటానికి వేరే అంశం లేకుండా పోయింది. మరోవైపు టీడీపీ నేతలు ఈ విషయంలో విచిత్రమైన డిమాండ్లు చేస్తున్నారు. ఆ పార్టీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు రూ.కోటి పరిహారం సరిపోదని, దానిని పది రెట్లు పెంచాలని డిమాండ్ చేయడం గమనార్హం. ఇదే టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వివిధ ప్రమాదాల్లో చనిపోయిన కుటుంబాలకు ఎంత పరిహారం ఇచ్చారో అచ్చెన్నాయుడు మరచిపోయారా అని వైసీపీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి.

ఇక అధికార, ప్రతిపక్షాల మధ్య ఈ వాదోపవాదాలను పక్కన పెడితే.. తాజాగా ప్రమాదానికి కారణమైన కంపెనీని అక్కడ నుంచి తరలించాలనే డిమాండ్లు ఊపందుకున్నాయి. ప్రజా సంక్షేమం దృష్ట్యా ఇది సహేతుకమైందే. ప్రజల ప్రాణాలకు ముప్పుగా పరిణమించిన ఇలాంటి ప్లాంట్లు జవాసాలకు దూరంగా ఉండటమే శ్రేయస్కరం. ప్రభుత్వం ఆ దిశగా నిర్ణయం తీసుకుంటే చాలా బాగుంటుంది. కానీ సర్కారు ఆ కంపెనీకే వత్తాసు పలుకుతోందని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. మరి అధికార పక్షం దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

సినిమా

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా...

కంగనా 50 కోట్ల ఆఫీస్‌ ప్రత్యేకతలు చూద్దాం రండి

సినిమా ఆఫీస్‌ లు ఎంత రాయల్‌ గా ఎంతో అహ్లాదకరంగా ఉంటాయి. ప్రతి చోట కూడా క్రియేటివిటీ కలగలిపి ఉంటాయి. అన్ని విధాలుగా కూడా ప్రశాంతతను...

సోను సూద్ ఆచార్య గురించి ఏమంటున్నాడు?

సోను సూద్ అనే పేరుకు టాలీవుడ్ లో పరిచయం అవసరం లేదు. అరుంధతిలో విలన్ గా చేసిన దగ్గరనుండి సోను సూద్ కు తెలుగులో పాపులారిటీ...

బన్నీకి ఇష్టమైన బాలీవుడ్ సినిమాలివే

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత కొన్నేళ్లుగా ప్యాన్ ఇండియా సినిమా చేయాలని అనుకుంటున్నాడు. అయితే అందుకు సరైన సందర్భం రావట్లేదు. ఇక ఇప్పుడు అల...

నాని మూవీకి ఎన్ని ఆఫర్స్ వచ్చినా నో అంటున్న దిల్ రాజు.!

టాలీవుడ్ అగ్రనిర్మాతల్లో ఒకరు దిల్ రాజు.. ప్రతి ఏడాది దిల్ రాజు నిర్మాణ సంస్థ నుంచి ఐదారు సినిమాలు విడుదలవుతుంటాయి, అంతే కాకుండా పలు సినిమాల...

రాజకీయం

హైకోర్టుపై వైసీపీ నేతల వ్యాఖ్యలు.. 49 మందికి నోటీసులు!

డాక్టర్‌ సుధాకర్‌ వ్యవహారం, ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగుల వ్యవహారం... వంటి విషయాలపై న్యాయస్థానం ఇటీవల ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిన దరిమిలా, అధికార పార్టీకి చెందిన నేతలు న్యాయస్థానం తీర్పుపై అసహనం వ్యక్తం...

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా ల‌క్ష‌లాది మంది సినీ-టీవీ కార్మికులు రోడ్డున...

2021కి పోలవరం.. పోతిరెడ్డిపాడుతో ఎవరికీ నష్టం లేదు.. సీఎం జగన్

అమరావతి: ఎగువ రాష్ట్రాల్లో ప్రాజెక్టులు ఎక్కువగా కట్టడం వల్ల రాష్ట్రానికి నీరు అందని పరిస్థితి ఉందని.. ఈ సమయంలో రాష్ట్రంలో చేపడుతున్న ప్రాజెక్టులపై వివాదాలు సృష్టించడం తగదని ఏపీ సీఎం జగన్ మోహన్...

హైకోర్టు మొట్టికాయలేస్తే.. టీడీపీని టార్గెట్ చేస్తారెందుకు?

ప్రభుత్వ పాఠశాలల్లోంచి తెలుగు మీడియంని తొలగించి, ఇంగ్లీషు మీడియంని తీసుకురావాలని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నానికి న్యాయస్థానం మొట్టికాయలేసింది. దాంతో, రకరకాల మార్గాల్లో తన ఆలోచనను అమలు చేసేందుకు వైఎస్‌...

టీడీపీకి ‘మహా’ షాక్‌: వైసీపీలోకి ‘ఆ’ తెలుగు తమ్ముళ్ళు.?

తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ‘మహానాడు’కి ముందే పార్టీ అధినేతకు ఝలక్‌ ఇచ్చేందుకు వైసీపీ...

ఎక్కువ చదివినవి

యూపీ సీఎం యోగి నిర్ణయం అదిరింది

కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు భారత్ లో విధించిన లాక్ డౌన్ కారణంగా కోట్లాది మంది వలస కార్మికులు ఎన్ని అవస్థలు పడ్డారో చూశాం. లాక్ డౌన్ విధించి రెండు నెలలు పూర్తవుతున్నా.. ఇప్పటికీ...

ప్రభాస్‌ 21 : బాబోయ్‌ దీపిక అంత డిమాండ్‌ చేసిందా?

ప్రభాస్‌ ప్రస్తుతం తన 20వ చిత్రం రాధాకృష్ణ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్‌లో చేస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమాలో ప్రభాస్‌కు జోడీగా పూజా హెగ్డే నటిస్తున్న విషయం తెల్సిందే. ఇక ప్రభాస్‌ 21వ...

ఇండియాలో అక్కడ మాత్రమే కరోనా లేదు

ప్రపంచంలో దాదాపుగా 125 దేశాల్లో కరోనా వైరస్‌ నమోదు అయ్యింది. కొన్ని దేశాలు వైరస్‌ కారణంగా తీవ్ర ఆర్థిక నష్టాలు చవి చూస్తున్నాయి. మరి కొన్ని దేశాల్లో మాత్రం స్పల్పంగానే కరోనా ప్రభావం...

లాక్‌డౌన్‌తో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ లో వచ్చే మార్పులపై క్లారిటీ

పలు పెద్ద సినిమాలు కరోనా కారణంగా స్క్రిప్ట్‌లో మార్పులు చేర్పులు చేయడంతో పాటు షూటింగ్స్‌ను రీ షెడ్యూల్‌ చేయడం మరియు లొకేషన్స్‌ విషయంలో మార్పులు చేర్పులు చేయడం కూడా జరుగుతుంది. అలాగే ఆర్‌ఆర్‌ఆర్‌...

క్రైమ్ న్యూస్: కూతురు ప్రేమలో పడినందుకు శిక్షగా రేప్‌ చేసిన తండ్రి.. తల్లి సహకారం

నలుగురికి చదువు చెప్పాల్సి ఉపాధ్యాయుడు, నలుగురికి మంచి మార్గం చూపించే ఉపాధ్యాయుడు తన కన్న కూతురుపై అఘాయిత్యంకు పాల్పడటం సంచలనంగా మారింది. మద్యప్రదేశ్‌లో మోరెనా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 45 ఏళ్ల...