Switch to English

మీటూ పోయింది.. మెన్ టూ వచ్చింది

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,438FansLike
57,764FollowersFollow

‌‘మీటూ’.. ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా బాగా పాపులర్ అయిన ఉద్యమం. పురుషుల చేతిలో తాము ఎలాంటి బాధలు అనుభవించామో పలువురు మహిళలు బయట పెట్టిన అంశాలు అనేకమంది ప్రముఖుల అసలు రూపాన్ని సాక్షాత్కరించాయి. ఘటన జరిగినప్పుడు పరిస్థితుల కారణంగా భయపడో, బటయకు చెప్పినా తమకు న్యాయం దక్కదనే భావించడం వల్లో అప్పట్లో ఇలాంటి విషయాలనూ ఏ మహిళా చెప్పలేదు. ఆ బాధలను తమలోనే దాచుకుని కుమలిపోయారు. అయితే, ప్రస్తుతం సోషల్ మీడియా విస్తృతంగా అందుబాటులోకి రావడంతో అందరిలో చైతన్యం బాగా పెరిగింది. దీంతో తాము గతంలో ఏ విధంగా ఇబ్బందులకు గురయ్యామో, ప్రముఖులుగా చెలామణి అవుతున్న వ్యక్తులు తమను ఎలా వేధించారో బయట పెట్టడం మొదలుపెట్టారు. దీంతో నేను కూడా అలాగే బాధపడ్డాను అంటూ పలువురు మహిళలు ఒక్కొక్కరుగా బయటకు రావడం ప్రారంభించారు. మీ టూ ఉద్యమంగా ఇది ఊపందుకుంది. మీటూ బాధితులకు ప్రపంచవ్యాప్తంగా మద్దతు పెరిగింది.

ఇంతవరకు బాగానే ఉంది.. నాణానికి రెండో వైపు ఉన్నట్టుగానే, ఏ అంశానికైనా రెండో కోణం కూడా ఉంటుంది. తాజాగా ఈ అంశమే తెరపైకి వచ్చింది. అదే ‘మెన్ టూ’. అంటే.. మహిళల చేతిలో బాధలు అనుభవించిన పురుషుల వెతలన్నమాట. ఇలాంటివారి కోసం గొంతు ఎత్తింది ఎవరో తెలుసా? ఓ మహిళ. ఆమె పేరు దీపికా నారాయణన్ భరద్వాజ్. డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ గా ఆమెకు పేరుంది. లింగ సమానత్వంలో పురుషుల హక్కుల కోసం గళం వినిపించే వ్యక్తిగా ఆమె చాలామందికి పరిచయం. తాజాగా మెన్ టూ ఉద్యమ అవసరాన్ని కూడా ప్రస్తావించింది దీపికానే కావడం విశేషం.

‘‘మహిళలపై అత్యాచారాలకు పాల్పడిన పురుషుల పేర్లు బయట పెట్టి వారిని దోషులుగా సమాజం ముందు నిలబెట్టడం ఎంత అవసరమో, పురుషులను వేధించి.. వారిపై తప్పుడు ఆరోపణలు చేసిన మహిళలను కూడా సమాజం ముందు నిలబెట్టడం అంతే అవసరం’’ అని ఆమె స్పష్టంచేశారు. మీడియా ఎందుకు ఇలాంటి అంశాలపై దృష్టి పెట్టడంలేదని ప్రశ్నించారు. పురుషులు కూడా మహిళల్లా మనుషులేనని, వారికి కూడా ఆత్మాభిమానం ఉంటుందనే విషయం గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు. డబ్బు గుంజాలనే దురుద్దేశంతో పలువురు పురుషులపై అసత్య ఆరోపణలు చేసిన ఓ మహిళా క్రీడాకారిణిపై కేసు నమోదు చేయాలని ఇటీవల హర్యానా కోర్టు ఆదేశించింది. దీనిని దీపికా నారాయణన్ భరద్వాజ్ స్వాగతించారు. ఇలా మహిళల చేతిలో వేధింపులకు గురైన మగాళ్లు చాలామందే ఉన్నారని, అలాంటి వారి కోసమే ఈ మెన్ టూ ఉద్యమం అని పేర్కొన్నారు.

ఇక మరో కేసులో ఎలాంటి నేరం చేయకపోయినప్పటికీ, ఓ యువకుడు ఏకంగా 8 నెలలు జైలులో గడపాల్సి వచ్చింది. తనను రేప్ చేశాడంటూ ఓ యువతి చేసిన అసత్య ఆరోపణల కారణంగా ఆ యువకుడి జీవితం ఇలా తలకిందులైంది. జైలుకు వెళ్లడంతో ఉన్న ఉద్యోగం పోయింది. బంధువులు, స్నేహితుల వద్ద తల దించుకునే పరిస్థితి వచ్చింది. సమాజం దోషిగా చూసింది. విచారణలో ఆ యువకుడు ఏం నేరం చేయలేదని రుజువు కావడంతో కోర్టు సైతం అతడిపై సానుభూతి చూపించింది. అతడికి జరిగిన నష్టానికి రూ.5 లక్షల పరిహారం ఇవ్వాలని ఆదేశించింది. అయితే, రెండేళ్లు గడిచినా అతడికి ఎలాంటి పరిహారం అందలేదు. తాజాగా ఈ పరిహారం విషయంపై హైకోర్టు స్టే విధించింది. ఈ విషయంలో కింది కోర్టు అధికారానికి మించి వ్యవహరించిందని వ్యాఖ్యానించింది. దీంతో అతడి పేరూ పోయింది. డబ్బూ రాలేదు. కాగా, మీటూ ఉద్యమం తరహాలోనే మెన్ టూ కూడా నెమ్మదిగా ఊపందుకుంటోంది. పలువురు ప్రముఖులు ఈ విషయంలో తమ మద్దతు తెలుపుతున్నారు.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

Chandrababu Naidu : యూట్యూబ్‌లో బాబు బయోపిక్‌ ‘తెలుగోడు’

Chandrababu Naidu : తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావుడి ఏ స్థాయిలో ఉందో మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి సమయంలో సోషల్‌ మీడియా క్రియాశీలక పాత్ర...

బర్త్ డే స్పెషల్ : రౌడీ స్టార్‌ టు ఫ్యామిలీ స్టార్‌

2012 లో వచ్చిన లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌ సినిమాలో చిన్న పాత్రలో కనిపించిన విజయ్ దేవరకొండ 2015 లో మొదటి సారి మెయిన్ లీడ్‌ రోల్‌...

రాజకీయం

ట్రోలింగ్ కంటెంట్: జగన్ ఇంటర్వ్యూతో వైసీపీకే నష్టం.!

మద్రాసు ఎలా చెన్నయ్ అయ్యిందో తెలుసా.? పోర్టు వల్లనే.! ముంబై ఎందుకు ముంబై అయ్యిందో తెలుసా.? అది కూడా పోర్టు వల్లనే.! ఆంధ్ర ప్రదేశ్‌లోనూ పోర్టులు కడుతున్నాం.. కాబట్టి, ఆయా పోర్టులున్న ప్రాంతాలు...

చేతులెత్తేసిన జగన్.! ఎందుకీ పరిస్థితి.?

ఎన్నికల కోడ్ రాకుండానే, వైసీపీకి చాలామంది ప్రజా ప్రతినిథులు గుడ్ బై చెప్పేశారు. సిట్టింగ్ ప్రజా ప్రతినిథుల్లో సగానికి పైగా ప్రజా ప్రతినిథులు ఓడిపోతారంటూ అంతర్గత సర్వేల్లో తేలడంతో, టిక్కెట్ల విషయమై వైఎస్...

Jaya Prakash Narayana: కమిటీ కుర్రోళ్లు నుంచి ‘గొర్రెల్లా..’ పాట విడుదల చేసిన జయప్రకాశ్ నారాయణ

Jaya Prakash Narayana: ఎన్నికల్లో డబ్బులు పంచి.. ఓట్లను కొనేసి.. గెలిచాక ప్రజలకు మంచి చేయని రాజకీయ నాయకులను నమ్మొద్దంటూ ‘గొర్రెలా..’ అని రూపొందించిన పాటను విడుదల చేశారు జయప్రకాష్ నారాయణ (Jaya...

తమ్ముడి గెలుపు కోసం అన్నయ్య.! వైసీపీకి కంగారెందుకు.?

ఏదన్నా కుటుంబం కలిసి మెలిసి వుంటే, చూసి ఓర్చుకోలేని నైజం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆయన తల్లి దూరం పెట్టడం చూస్తున్నాం. సోదరి షర్మిల అయితే, ఏకంగా...

Chiranjeevi: పిఠాపురం ప్రజలు పవన్ ను గెలిపించండి.. అండగా ఉంటాడు: చిరంజీవి

Chiranjeevi: ‘జనమే జయం అని నమ్మే పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మీ ముందుకు వచ్చాడు. మీ కోసం సైనికుడిగా.. సేవకుడిగా నిలబడతాడు. మీకేం చేయగలడో చూడాలంటే పిఠాపురం ప్రజలు జనసేన (Janasena)కు...

ఎక్కువ చదివినవి

చేతులెత్తేసిన జగన్.! ఎందుకీ పరిస్థితి.?

ఎన్నికల కోడ్ రాకుండానే, వైసీపీకి చాలామంది ప్రజా ప్రతినిథులు గుడ్ బై చెప్పేశారు. సిట్టింగ్ ప్రజా ప్రతినిథుల్లో సగానికి పైగా ప్రజా ప్రతినిథులు ఓడిపోతారంటూ అంతర్గత సర్వేల్లో తేలడంతో, టిక్కెట్ల విషయమై వైఎస్...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా ‘సత్య’ (Satya)’ అని చిత్ర దర్శక,...

Sukumar: సుకుమార్ కెరీర్ @20 ఆయన బ్రెయిన్ పవర్ 2.0

Sukumar: లెక్కలు.. ఈ సబ్జెక్టే ఎంతో కష్టం. కానీ.. ఇష్టంగా భావించేవాళ్లకు లెక్కలు తప్ప మరొకటి ఎక్కదు. లెక్కలతో పదునెక్కిన మనిషి మెదడు చేసే ఏ పనిలో అయినా అలాగే ఆలోచింపజేస్తుంది. అంతే...

Samantha: దుమారం రేపుతున్న సమంత ఫొటో.. ఆగ్రహంలో ఆమె ఫ్యాన్స్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఇన్ స్టాలో పోస్ట్ ఆమె పోస్ట్ చేసినట్టుగా వైరల్ అవుతున్న ఓ ఫొటో సంచలనాలకు వేదికైంది. నిజానికి ఆ ఫొటో ఆమె పోస్ట్ చేయలేదని...

Chiranjeevi: పిఠాపురంకు చిరంజీవి ఖాయమే..? బాబును కలిసే అవకాశం..!?

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామాలు జరుగబోతున్నాయా..? ఇప్పటికే వైసీపీ - జనసేన, టీడీపీ,బీజేపీ కూటమి హోరాహోరీ ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఈక్రమంలో తమ్ముడు పవన్ కోసం అన్నయ్య చిరంజీవి...