MEGA 156: మెగాస్టార్ చిరంజీవి (Mega Star Chiranjeevi) హీరోగా వశిష్ఠ (Vassistha) దర్శకత్వంలో MEGA 156గా సినిమా తెరకెక్కుతోంది. ఇందుకు సంబంధించిన వీడియో అప్డేట్ ను నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ (UV creations) సోషల్ మీడియాలో పంచుకుంది. ఇప్పటికే విడుదలైన కాన్సెప్ట్ పోస్టర్ ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇప్పుడీ సినిమాను విజయదశమి రోజున అధికారికంగా ప్రారంభించారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
సినిమాను రీ-రికార్డింగ్ తో ప్రారంభించే ఆనవాయితీని మెగా 156తో మళ్లీ తీసుకొచ్చారు. ‘రీ-రికార్డింగ్ ను కూడా పూజా కార్యక్రమాలతో ప్రారంభించడం ఆనవాయితీ. ఇప్పుడు మళ్లీ ఆ పద్ధతిని తీసుకొస్తున్నాం. ఇప్పటికే ఓ సెలబ్రేషన్ పాటను రికార్డ్ చేశాం. సినిమాలో ఆరు పాటలుంటాయ’ని కీరవాణి అన్నారు. ‘అరుదైన సినిమాలో భాగమవుతున్నందుకు సంతోషంగా ఉంది. మంచి పాటలతో వస్తున్నా’మని చంద్రబోస్ అన్నారు.
పూజా కార్యక్రమానికి చిరంజీవి దంపతులు, కె.రాఘవేంద్రరావు, అల్లు అరవింద్, వివి.వినాయక్ హాజరయ్యారు. సోషియో ఫాంటసీ నేపథ్యంలో సినిమా తెరకెక్కనుంది. అనుష్క శెట్టి, మృణాల్ ఠాకూర్ హీరోయిన్లుగా నటించే అవకాశం ఉంది. యూవీ క్రియేషన్స్ బ్యానర్లో సినిమా తెరకెక్కుతోంది. చోటా కె.నాయుడు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
In the good old days, films used to begin with music compositions, and #Mega156 has brought the tradition back to Telugu Cinema 💫🔮
Beginning the MEGA MASS BEYOND UNIVERSE with a celebratory song composition followed by an auspicious Pooja Ceremony ❤️
Wishing everyone a very… pic.twitter.com/CRuG2f7fot
— UV Creations (@UV_Creations) October 24, 2023
