మనం ఎక్కడైనా 50 రూపాయలో 100 రూపాయలో పోగొట్టుకుంటే కాసేపు బాధపడి ఆ విషయాన్ని వదిలేస్తాం, ఎందుకంటే ఆ డబ్బు మన జీవితాన్ని ఏం మార్చేయదు అని మనకు తెలుసు.. అలాంటింటి ఒక వ్యక్తి తనకు రావాల్సిన 35 రూపాయల కోసం ఏకంగా రెండేళ్ల పాటు పోరాటం చేసి విజయాన్ని సాధించాడు. 35 రూపాయలకు బదులు 33 రూపాయలు రావడం తో మిగిలిన ఆ రెండు రూపాయల కోసం మళ్ళీ పోరాటం చేస్తా అంటున్నాడు.. ఇంతకీ అసలు విషయంలోకి వెళ్తే…
రాజస్థాన్‌లోని కోటాకు చెందిన సుజీత్ స్వామి ఓ ఇంజనీర్. ఆయన 2017 జూలై 2న తను నివసిస్తున్న ప్రదేశం నుండి ఢిల్లీ కి వెళ్లాలనుకున్నాడు.దానికోసం దాదాపు రెండు నెలల ముందుగా టికెట్ బుక్ చేసుకున్నారు. అయితే వెయిటింగ్ లిస్ట్ ఎక్కువ ఉండటంతో కొద్దిరోజుల ముందు సుజీత్ తన టికెట్ రద్దు చేసుకున్నారు. కానీ టికెట్ రద్దు చేసుకున్న తర్వాత సుజీత్‌కు రావాల్సిన పూర్తి మొత్తం డబ్బు వెనక్కి రాలేదు. అతను చెల్లించిన మొత్తం టికెట్ ధరలో ( రూ.765 ) రూ.100 తగ్గించి, రూ.665 రీఫండ్ చేశారు.రైల్వేశాఖ నిబంధనల ప్రకారం వెయిటింగ్ జాబితాలో ఉన్న టికెట్‌ను రద్దు చేసుకుంటే రూ.65 ఛార్జ్ ని టికెట్ మొత్తం ధరలో నుండి తీసివేసి మిగిలిన మొత్తాన్ని వాపసు ఇస్తారు. అయితే తన నుంచి రూ. 65 ఛార్జ్ చేయడంతో సుజీత్ రైల్వేశాఖను సంప్రదించారు.అదే ఏడాది జీఎస్టీ అమల్లోకి రావడంతో మిగతా రూ.35 సర్వీస్ ట్యాక్స్ కింద ఛార్జ్ చేసినట్లు రైల్వేశాఖ తెలిపింది. అయితే తాను జీఎస్టీ అమల్లోకి రావడానికి ముందే టికెట్‌ను రద్దు చేసుకున్నానని తన రూ.35 తనకు ఇవ్వాలని ఐఆర్సీటీసీని కోరారు.
కానీ రైల్వే శాఖల నుండి అతనికి ఎటువంటి సమాచారం రాలేదు దీనితో అతను 2018 ఏప్రిల్‌లో లోక్ అదాలత్‌ను ఆశ్రయించారు. ఇక్కడ కూడా తన సమస్య పరిష్కారం కాకపోవడంతో సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేసుకున్నారు.ఈ విధంగా సుమారు రెండేళ్ల పాటు సుజీత్ రైల్వేశాఖతో పోరాటం చేశారు. ఈ క్రమంలో మే 1న ఆయన పోరాటానికి ఫలితం దక్కింది. ఆయన ఖాతాలోకి రూ. 33ను ఐఆర్సీటీసీ జమ చేసింది.ఇన్నాళ్లపాటు తనకు రావాల్సిన సొమ్మును ఇవ్వకపోవడంతో పాటు రూ.2 తగ్గించి ఇవ్వడంతో సుజీత్ ఆవేదన వ్యక్తం చేశారు. రూ.35 కి బదులుగా రూ.33 చెల్లించడం తో మిగిలిన ఆ రెండు రూపాయల కోసం తాను మళ్ళీ పోరాటం చేస్తానని తెలిపారు..
352749 580582Immigration […]the time to read or go to the content or web sites we have linked to below the[…] 179818
620615 603189Attractive part of content. I just stumbled upon your web site and in accession capital to claim that I acquire in fact enjoyed account your weblog posts. Any way Ill be subscribing to your feeds and even I achievement you get entry to constantly swiftly. 170926
910171 551737I truly enjoy examining on this site , it has excellent content material . 342773
590718 178752I want to start a blog but would like to own the domain. Any ideas how to go about this?. 351836
83356 227067I like this internet internet site very a lot, Its a really nice post to read and get info . 86641