బాలీవుడ్ హాట్ బాంబ్ రాఖి సావంత్ గుర్తుందిగా .. అయినా ఆమెను మరచిపోయినప్పుడల్లా ఎదో దుమారం రేపుతూ మరచిపోకుండా చేస్తూనే ఉంటుంది లెండి. తాజాగా ఈ అమ్మడు పాకిస్తాన్ జెండా పట్టుకుని దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది. అసలే పాకిస్తాన్ విషయంలో ఫైర్ మీదున్న ఇండియన్స్ ఊరుకుంటారా .. రాఖి సావంత్ ను టార్గెట్ చేస్తూ కామెంట్స్ గుప్పిస్తూ ట్రోలింగ్ చేస్తున్నారు. అసలు నీకు పాకిస్తాన్ వారసత్వమే కరక్ట్ .. నువ్వు మిస్ పాకిస్తాన్ అంటూ విమర్శిస్తున్నారు. ఇలాంటి పిచ్చి పనులు చేస్తే నిన్ను అస్సలు ఫాలో అవ్వం అంటూ కూడా ఇస్తున్నారు నెటిజన్లు.
దాంతో అవాక్కయిన రాఖి సావంత్ దాన్ని కవర్ చేసుకునే పనిలో పడింది. ఈ నేపథ్యంలో తాను కావాలని పాకిస్తాన్ జెండా పట్టుకుని ఫోటోలకు పోజులు ఇవ్వలేదని, ఇది ధారా 370 అనే సినిమాలో తాను పాకిస్తానీ అమ్మాయిగా నటిస్తున్నానని, దానికోసమే ఇలా పాక్ జెండా పెట్టుకున్నానని తెలిపింది. అంతే కాదండోయ్ .. పాకిస్తానీ ప్రజలంతా చెడ్డవారు కాదని .. ఎవరో కొందరు మాత్రమే జిహాద్ పేరుతొ అరాచకాలు చేస్తున్నారని తెలిపింది. నాకు పాకిస్తాన్ అన్నా.. ఆ దేశ ప్రజలన్నా చాలా గౌరవం అని తెలిపింది. రాఖి సావంత్ ఎవ్వారం చూస్తుంటే కావాలని ఇలా పాకిస్తానీ జెండా పట్టుకుని ఫోటోలు దిగి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిందనే విమర్శలు కూడా వస్తున్నాయి.
చేతిలో సినిమాలు లేకపోవడంతో తనను మరచిపోతారనే భయంతోనే ఇలా కావాలని పబ్లిసిటీ స్టంట్ చేసిందని విమర్శిస్తున్న వారు ఉన్నారు. మొత్తానికి మొన్న పాక్, ఇండియా సంఘటన తరువాత రాఖి సావంత్ ఇలా పాకిస్తానీ జెండాతో రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయడం ఆమెకే మంచిది కాదని ఫైర్ అవుతున్నారు నెటిజన్లు.