Switch to English

విజయ్ దేవరకొండపై ఇంత నెగెటివిటీ ఎందుకు.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,187FansLike
57,764FollowersFollow

విజయ్ దేవరకొండ చాలా మారాడు.! ఔను, చాలా చాలా మారాడు.! ‘అర్జున్ రెడ్డి’ ఫేం విజయ్ దేవరకొండ ఎక్కడ.? ‘ఫ్యామిలీ స్టార్’ విజయ్ దేవరకొండ ఎక్కడ.! ఈ మార్పు నిజంగానే అనూహ్యం. మూతి ముద్దులు, హీరోయిన్‌తో ఆన్ స్క్రీన్ ఘాటైన రొమాన్స్.. వీటికి మించి, బూతులు మాట్లాడటం.. ఇవన్నీ ‘అర్జున్ రెడ్డి’ ఆటిట్యూడ్‌లో బాగం. నిజ జీవితంలో కూడా విజయ్ దేవరకొండ అదే తరహా రఫ్‌నెస్‌తో వుండేవాడు.

అలా ‘రౌడీ’ అనే ముద్ర తగలించుకున్నాడు. ఓ సినీ వేదికపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశాడంటూ పెద్ద రచ్చ గతంలో జరిగితే, ఈ విషయమై అనసూయ మీడియాకెక్కి విజయ్ దేవరకొండ మీద నానా రకాల వ్యాఖ్యలూ చేసింది. ఆ వైరం ఇప్పటికీ కొనసాగుతున్నట్లే కనిపిస్తోంది.. విజయ్ దేవరకొండ సినిమా వస్తే, అనసూయ ప్రత్యక్షంగానో పరోక్షంగానో సెటైర్లు వేస్తుంటుంది విజయ్ దేవరకొండమీద.

ఇదంతా ఓ యెత్తు. విజయ్ దేవరకొండ నుంచి ఏదన్నా సినిమా వస్తే, అనూహ్యమైన రీతిలో నెగెటివిటీ ఆ సినిమా చుట్టూ విడుదలైన రోజు నుంచీ షురూ అవుతోంది. విజయ్ దేవరకొండ చాలా మారాడు కదా. ఆటిట్యూడ్ తగ్గించుకున్నాడు కదా.. అయినా, ఈ నెగెటివిటీ ఎందుకు.? ఇదో మిలియన్ డాలర్ క్వశ్చన్‌గా మారింది.

తమ సినిమాపై ఈ దారుణమై నెగెటివిటీని ‘ఫ్యామిలీ స్టార్’ టీమ్ అస్సలు జీర్ణించుకోలేకపోతోంది. విజయ్ దేవరకొండ ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేశాడు కూడా. అలాగని, సినిమాపై రివ్యూలు రాసినవారిపైనో, సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టేవారి మీదనో పోలీసులు చర్యలు తీసుకుంటారని అనుకోలేం. ఎవరి అభిప్రాయం వాళ్ళది. కాకపోతే, తన ఆవేదనను విజయ్ దేవరకొండ ఇలా వెల్లగక్కాడంతే.

సినిమా గురించి నెగెటివి అనే అంశాన్ని పక్కన పెడితే, విజయ్ దేవరకొండ మీద పెయిడ్ నెగెటివిటీ జరుగుతున్నమాట వాస్తవం. ఎవరు చేస్తున్నారు.? అన్నదానిపై భిన్నవాదనలున్నాయి. ఇదో టైపు చీప్ పబ్లిసిటీ అనేవారూ లేకపోలేదు. విజయ్ దేవరకొండ అభిమానులు, ఇతర హీరోల సినిమాల్ని ట్రోల్ చేస్తే, ఆ హీరోల అభిమానులు విజయ్ దేవరకొండ సినిమాల్ని ట్రోల్ చేస్తారు. ఇది జస్ట్ ట్రోల్ వ్యవహారం మాత్రమే.

కానీ, విజయ్ దేవరకొండ మీద అత్యంత జుగుప్సాకరమైన రీతిలో పెయిడ్ నెగెటివిటీ నడుస్తున్న తీరు, ‘ఖుషీ’ సినిమా టైమ్‌లోనే బయటపడింది. ‘ఫ్యామిలీ స్టార్’ విషయంలో అది ఇంకాస్త స్ఫష్టమైపోయింది. ఈ పెయిడ్ నెగెటివిటీకి కొన్ని పీఆర్ టీమ్స్, కొందరు ఇన్‌ఫ్ల్యూయెన్సర్స్ సహకరిస్తున్నారనే వాదనా లేకపోలేదు.

ఒక్క హిట్టు.. నిఖార్సయిన హిట్టు పడితే.. విజయ్ దేవరకొండ బౌన్స్ బ్యాక్ అవుతాడు. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. కానీ, ఈలోగా విజయ్ దేవరకొండ తన మీద వస్తున్న నెగెటివిటీని తట్టుకుని ఇంకా స్ట్రాంగ్‌గా నిలబడాల్సిందే. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం ఏమీ వుండదు.

103 COMMENTS

  1. I’m writing to let you understand of the impressive experience our princess undergone browsing your blog. She noticed some pieces, not to mention what it’s like to possess a wonderful helping mindset to make a number of people without hassle fully grasp specific complex things. You undoubtedly did more than my desires. Many thanks for delivering those great, trusted, educational and also cool tips about this topic to Janet.

  2. Good – I should definitely pronounce, impressed with your site. I had no trouble navigating through all the tabs as well as related information ended up being truly easy to do to access. I recently found what I hoped for before you know it in the least. Quite unusual. Is likely to appreciate it for those who add forums or anything, site theme . a tones way for your client to communicate. Excellent task..

  3. Good V I should certainly pronounce, impressed with your website. I had no trouble navigating through all the tabs as well as related information ended up being truly simple to do to access. I recently found what I hoped for before you know it in the least. Reasonably unusual. Is likely to appreciate it for those who add forums or something, site theme . a tones way for your customer to communicate. Excellent task..

  4. What i don’t realize is in reality how you are now not actually a lot more well-liked than you might be now. You’re so intelligent. You understand thus considerably in relation to this subject, made me individually believe it from numerous various angles. Its like men and women are not involved except it is something to do with Girl gaga! Your individual stuffs excellent. At all times take care of it up!

  5. I have been exploring for a little bit for any high quality articles or blog posts in this kind of house . Exploring in Yahoo I eventually stumbled upon this web site. Reading this info So i am glad to convey that I have a very just right uncanny feeling I discovered just what I needed. I such a lot surely will make certain to do not fail to remember this web site and provides it a glance regularly.

  6. I’m impressed, I need to say. Actually rarely do I encounter a blog that’s both educative and entertaining, and let me inform you, you have got hit the nail on the head. Your thought is outstanding; the problem is something that not sufficient persons are speaking intelligently about. I am very joyful that I stumbled throughout this in my search for one thing referring to this.

  7. I simply wanted to say thanks again. I’m not certain what I would have achieved without the entire pointers shown by you about such a area of interest. It truly was a very depressing difficulty in my view, however , finding out this professional avenue you managed it forced me to jump for delight. Now i am happier for your information and even sincerely hope you are aware of a powerful job you are always undertaking educating people today by way of your web blog. More than likely you haven’t got to know any of us.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

కొరియోగ్రాఫర్‌ని అడ్డంగా ఇరికించిన ఆ హీరో ఎవరు.?

తెలుగు సినీ పరిశ్రమలో ఓ ప్రముఖ కొరియోగ్రాఫర్ వ్యవహారం హాట్ టాపిక్ అయ్యింది. సినీ పరిశ్రమలోనే కాదు, రాజకీయాల్లోనూ ఈ వ్యవహారం రచ్చ రచ్చగా మారింది....

నటి పూనమ్ కౌర్ సంచలనం.. ఆ స్టార్ దర్శకుడిపై ఆరోపణలు..!

ఇప్పుడు టాలీవుడ్ లో వేధింపుల ఆరోపణలు దుమారం రేపుతున్నాయి. ప్రస్తుతం జానీ మాస్టర్ వివాదం కొనసాగుతుండగానే ఒక్కొక్కరుగా బయటకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదే అదునుగా నటి...

జానీ మాస్టర్ కేసు విచారణ.. కమిటీ వేసిన ఫిల్మ్ ఛాంబర్

ఇప్పుడు టాలీవుడ్ లో దుమారం రేపుతున్న జానీ మాస్టర్ కేసుపై ఒక్కొక్కరుగా అందరూ స్పందిస్తున్నారు. ఇక ఇండస్ట్రీ తరఫున ఫిల్మ్ ఛాంబర్స్ అసోసియేషన్ ఆఫ్ కామర్స్...

దిమ్మతిరిగే బిజినెస్.. త్రిబుల్ ఆర్ ను పుష్ప-2 దాటేసిందా..?

ఇప్పుడు అందరి చూపు పుష్ప-2 మీదనే ఉంది. ఈ సినిమాకు భారీ అంచనాలు ఉన్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. మొదటి పార్టు పెద్ద హిట్ అయింది...

పెళ్లి చేసుకున్న స్టార్ హీరో-హీరోయిన్.. ఫొటోలు వైరల్..!

అనుకున్నదే జరిగింది. సీనియర్ హీరో సిద్దార్థ్, హీరోయిన్ అదితి రావు హైదరీ పెళ్లి చేసుకున్నారు. హిందూ సంప్రదాయం ప్రకారం వీరిద్దరూ ఒక్కటయ్యారు. గతంలోనే ఎంగేజ్ మెంట్...

రాజకీయం

ఏపీ రాజకీయాల్లో సంచలనం.. చంద్రబాబును కలిసిన వైఎస్ సునీత దంపతులు

ఏపీ రాజకీయాల్లో సంచలనం చోటు చేసుకుంది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని వైఎస్ సునీత దంపతులు కలుసుకున్నారు. ఈ మలుపు ఇప్పుడు ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది. అసలే సునీత ఏపీ రాజకీయాల్లో ఎప్పుడూ...

ఆంధ్ర, తెలంగాణ.. అట్టర్ ఫ్లాప్ అయిన గులాబీ లొల్లి.!

ఒకప్పుడు తెలంగాణ సెంటిమెంట్‌ని క్యాష్ చేసుకోవడంలో కేసీయార్ పార్టీ తర్వాతే ఎవరైనా. తెలంగాణ అంటే కేసీయార్, కేసీయార్ అంటే తెలంగాణ.! ఎప్పుడైతే కేసీయార్ నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి కాస్తా భారత్ రాష్ట్ర...

జానీ మాస్టర్ విషయంలో అసలేం జరిగింది.?

జీరో ఎఫ్ఐఆర్ నమోదైంది.. పోలీసులు, ఆధారాల్ని సేకరించి విచారణ జరుపుతామంటున్నారు. బాధితురాలు ఎవరన్నదానిపై స్పష్టత లేదు. ఇలాంటి కేసుల్లో, బాధితురాలి పేరు, వివరాల్ని బయటపెట్టడం సమంజసం కాదు కాబట్టి, గోప్యత సబబే.! కానీ, కొరియోగ్రాఫర్...

బీజేపీకి మద్దతు ఉపసంహరించుకుంటారా.. ఆ విషయంలో చంద్రబాబు వ్యూహం..?

ఏపీకి కేంద్రం అవసరం ఎంత ఉందో.. కేంద్రానికి టీడీపీ మద్దతు కూడా అంతే అవసరం ఉంది. అందుకే చంద్రబాబు అన్నీ ఆలోచించి కొన్ని కండీషన్ల మీద బీజేపీతో పొత్తులు పెట్టుకున్నారు. ఏపీకి రాజధానితో...

వివేకా హత్య కేసు.. వైఎస్ భారతి అరెస్ట్ తప్పదా..?

ఏపీ రాజకీయాల్లో పెను సంచలనం జరగబోతోందా.. మాజీ సీఎం వైఎస్ జగన్ భార్య భారతిరెడ్డిని అరెస్ట్ చేయబోతున్నారా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. అదికూడా వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులోనే. వివేకా హత్య కేసు...

ఎక్కువ చదివినవి

జానీ మాస్టర్ విషయంలో అసలేం జరిగింది.?

జీరో ఎఫ్ఐఆర్ నమోదైంది.. పోలీసులు, ఆధారాల్ని సేకరించి విచారణ జరుపుతామంటున్నారు. బాధితురాలు ఎవరన్నదానిపై స్పష్టత లేదు. ఇలాంటి కేసుల్లో, బాధితురాలి పేరు, వివరాల్ని బయటపెట్టడం సమంజసం కాదు కాబట్టి, గోప్యత సబబే.! కానీ, కొరియోగ్రాఫర్...

బిగ్ బ్రేకింగ్.. సీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా..!

దేశ రాజకీయాల్లో మరో సంచలనం తెరమీదకొచ్చింది. దేశంలోనే ఫేమస్ సీఎం అయిన కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. తాను సీఎం పదవికి రాజీనామా చేసి.. తాను నిర్దోషిని అని నిరూపించుకున్న...

ఇంతకీ జగన్ ప్రకటించిన ‘కోటి’ విరాళం ఎక్కడ.?

విపత్తుల వేళ ప్రముఖులు విరాలాలు ప్రకటించడం మామూలే. జాతీయ స్థాయిలో ప్రధాన మంత్రి సహాయ నిధికి, రాష్ట్రాల స్థాయిలో ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు ప్రకటిస్తుంటారు. తొలుత విరాళాన్ని ప్రకటించడం, ఆ తర్వాత...

Daily Horoscope: రాశి ఫలాలు: గురువారం 12 సెప్టెంబర్ 2024

పంచాంగం తేదీ 12- 09 - 2024, గురువారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయణం, భాద్రపద మాసం, వర్ష ఋతువు. సూర్యోదయం: ఉదయం 5:51 గంటలకు. సూర్యాస్తమయం: సాయంత్రం 6:11 గంటలకు. తిథి: శుక్ల నవమి...

Jr. ఎన్టీఆర్ ని ఇంటర్వ్యూ చేసిన సందీప్ రెడ్డి వంగా.. ఆ ప్రాజెక్టు పై క్లారిటీ ఇస్తారా?

జూనియర్ ఎన్టీఆర్( Jr NTR) ప్రస్తుతం "దేవర"( Devara ) ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ఈనెల 27న థియేటర్లలో విడుదల కానుంది. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్...