Switch to English

వాలంటీర్లకు పది వేలు.! ఎక్కడి నుంచి తెచ్చి ఇస్తారు.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,459FansLike
57,764FollowersFollow

తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఎన్నికల హామీల్లో భాగంగా, వాలంటీర్లకు నెలకు 10 వేల రూపాయల గౌరవ వేతనం చెల్లిస్తామంటూ సంచలన ప్రకటన చేశారు. అంతకు ముందు సామాజిక పెన్షన్లను నాలుగు వేల రూపాయలకు పెంచుతామనీ ఆయన ప్రకటించేశారు.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అందరికీ తెలిసిందే. అప్పుల కుప్ప ఆంధ్ర ప్రదేశ్. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అసలు అభివృద్ధి అన్నదే లేకుండా పోయింది గత ఐదేళ్ళుగా.! కేవలం సంక్షేమం మీదనే బండి నడిపేసింది వైసీపీ సర్కారు.!

ఈ ఎన్నికల్లో ఎవరు అధికార పీఠమెక్కినా, వారి ముందు బోల్డంత అప్పుల కుప్ప కనిపిస్తుంది. ఖజానా ఖాళీ అయిపోయి వుంది. రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఖర్చు చేస్తే, అంతా ప్రజల నుంచే పన్నుల రూపంలో రాబట్టాలి. అలా రాబట్టిన సొమ్మునే, సంక్షేమం కోసం ఖర్చు చేయాలి.. అప్పులు చెల్లించడానికీ చేయాలి.. రాష్ట్రం గడవాలి.

ఫస్ట్ టైమ్ సీఎం అయిన వైఎస్ జగన్, సంక్షేమం పేరుతో రాష్ట్రాన్ని నాశనం చేశారన్నది చంద్రబాబు అండ్ టీమ్ ఆరోపణ. అందులో నిజం లేకపోలేదు కూడా. రాజకీయ విమర్శకీ, బాధ్యతాయుతమైన విమర్శకీ చాలా తేడా వుంది. జనసేన పార్టీ, బాధ్యతాయుతమైన విమర్శలు చేస్తూ వస్తోంది.

టీడీపీ – జనసేన – బీజేపీ జతకట్టి, వైసీపీని ఓడించాలనుకుంటున్నాయి ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో. ఈ నేపథ్యంలో, సంక్షేమమే తమను గెలిపిస్తుందని నమ్ముతోన్న వైసీపీకి, అదే బాటలో దెబ్బ కొట్టాలన్నది చంద్రబాబు వ్యూహం అయితే అయి వుండొచ్చు. కానీ, ఇదా పద్ధతి.?

వాలంటీర్లు అంటే ప్రభుత్వ ఉద్యోగులేమీ కారు. రెండున్నర లక్షల మంది వాలంటీర్లున్నారు రాష్ట్రంలో ప్రస్తుతం. వాళ్ళంతా వైసీపీ కార్యకర్తలే. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇటీవల ప్రకటించారు. ఆ వైసీపీ కార్యకర్తలకు, టీడీపీ ప్రభుత్వం వస్తే నెలకు 10 వేల రూపాయల గౌరవ వేతనం ఇస్తారా.?

వందల కోట్లు కాదు, వేల కోట్లు ఖర్చు చేయాల్సి వస్తుంది ఇకపై వాలంటీర్లకి. ఇదంతా ప్రజాధనమే.! ఎన్నికల హామీ ఇచ్చేముందు ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాల్సిందే.! సుదీర్ఘ రాజకీయ అనుభవం వుందని చెప్పుకునే చంద్రబాబు, అనాలోచిత ప్రకటనలు చేస్తే ఎలా.?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Betting case: బెట్టింగ్ కేసులో బాలీవుడ్ నటుడు అరెస్టు.. సినీ ఫక్కీలో...

Betting case: సంచలనం రేపిన మహదేవ్ బెట్టింగ్ యాప్ (Mahadev betting app case) కుంభకోణంలో బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ (Sahil Khan) ను...

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

రాజకీయం

సీమలో ‘సిరిగిపోయిన’ వైసీపీ మేనిఫెస్టో.!

దీన్ని మేనిఫెస్టో అంటారా.? 2019 ఎన్నికల మేనిఫెస్టోలోంచి కొన్ని అంశాల్ని తీసేస్తే, అది ‘నవరత్నాలు మైనస్’ అవుతుందిగానీ, ‘నవరత్నాలు ప్లస్’ ఎలా అవుతుంది.? ఈ మేనిఫెస్టో దెబ్బకి, ‘వైసీపీకి అధికారం మైనస్’ అంటూ...

Chiranjeevi: పిఠాపురంలో చిరంజీవి ప్రచారానికి వస్తారా..?!

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీ రాజకీయాలు వేసవి ఎండలకుమల్లే రోజురోజుకీ హీటెక్కిపోతున్నాయి. పార్టీలన్నీ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఈక్రమంలో రాజకీయాల్లో మిక్స్ అయ్యే సినీ గ్లామర్ ఈసారీ కనిపిస్తోంది. ఎన్నికల సమయంలో...

గెలిచాక పార్టీ మారతారట.! ఏపీలో ఇదో కొత్త ట్రెండ్.!

‘మమ్మల్ని గెలిపించండి.. గెలిచాక, ఈ పార్టీలో వుండం. మేం పార్టీ మారతాం.. ఖచ్చితంగా..!’ అంటూ కొందరు అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో భాగంగా చేస్తున్న వ్యాఖ్యలు, ఓటర్లకు భలే వినోదాన్ని ఇస్తున్నాయి. అధికార వైసీపీకి...

వంగా గీత ‘పార్టీ మార్పు’ ప్రచారం వెనుక.!

వంగా గీత పార్టీ మారుతున్నారట కదా.! వైసీపీకి గుడ్ బై చెప్పి, జనసేనలోకి ఆమె వెళ్ళబోతున్నారట కదా.! నామినేషన్‌ని వంగా గీత వెనక్కి తీసుకుంటున్నారట కదా.! ఇవన్నీ సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న...

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

ఎక్కువ చదివినవి

వంగా గీత ‘పార్టీ మార్పు’ ప్రచారం వెనుక.!

వంగా గీత పార్టీ మారుతున్నారట కదా.! వైసీపీకి గుడ్ బై చెప్పి, జనసేనలోకి ఆమె వెళ్ళబోతున్నారట కదా.! నామినేషన్‌ని వంగా గీత వెనక్కి తీసుకుంటున్నారట కదా.! ఇవన్నీ సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న...

పో..‘సాని’తనం.! ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం.!

‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.! ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.?...

Allari Naresh: అల్లరి నరేశ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’.. ఫన్ గ్యారంటీ: నిర్మాత రాజీవ్

Allari Naresh: చాన్నాళ్ల తర్వాత తన మార్కు కామెడీతో అల్లరి నరేష్ (Allari Naresh) నటించిన లేటెస్ట్ మూవీ 'ఆ ఒక్కటీ అడక్కు' (A. మల్లి అంకం దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమాను రాజీవ్...

జగన్ విషయంలో కేసీయార్ సెల్ఫ్ గోల్.! కానీ, ఎందుకిలా.?

కేసీయార్ మహా మాటకారి.! వ్యూహాలు రచించడంలో దిట్ట.! తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఆయనే.! వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీయార్, హ్యాట్రిక్ కొట్టలేకపోయారు.. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లా...

ఎన్టీయార్ అభిమానుల్నే నమ్ముకున్న కొడాలి నాని.!

మామూలుగా అయితే, గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నానికి తిరుగే లేదు.! కానీ, ఈసారి ఈక్వేషన్ మారినట్లే కనిపిస్తోంది. నియోజకవర్గంలో రోడ్ల దుస్థితి దగ్గర్నుంచి, చాలా విషయాలు కొడాలి నానికి...