Switch to English

లోకేష్‌.. మీకిది తగునా?!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,459FansLike
57,764FollowersFollow

”ఎవ్వరూ అధైర్యపడొద్దు.. నేను అండగా ఉంటా” ఈ మాటలు గత ఆరేడు రోజులుగా తనను కలుస్తున్న పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులతో తెలుగుదేశం అధినేత చంద్రబాబు పదేపదే చెబుతున్నవి. మీడియాలో ఫోటోలతోసహా ఆయన స్టేట్‌మెంట్లు చూస్తున్న తెలుగుదేశం నేతల్లో ఒకింత భరోసా కలుగుతూ ఉండొచ్చు. పార్టీ తమను వదిలేయదన్న నమ్మకం కొందరిలో ఏర్పడి ఉండొచ్చు.

అయితే, సాక్షాత్తూ చంద్రబాబుగారి పుత్రరత్నం, నిన్నమొన్నటివరకు పంచాయితీ, ఐటీశాఖలతోపాటు డిఫాక్టో సిఎంగా వ్యవహరించిన నారా లోకేష్‌ వ్యవహారశైలి అందుకు పూర్తి భిన్నంగా ఉంది. వివరాల్లోకి వెళితే..

తెలుగుదేశం అధికారంలో ఉండగా.. కన్సల్టెంట్లు పేరుతో, లైజనింగ్‌ ఆఫీసర్ల పేరుతో, పీఆర్వోల పేరుతో.. ఇంకా అనేక పదవుల్లో తమకు కావాల్సిన వ్యక్తులను తగిన అర్హతలు లేకున్నా.. అంతకుముందు పార్టీకి పనిచేశారనే కారణంగా సదరు వ్యక్తులకు కనిష్టంగా 50 వేల నుండి లక్షన్నర జీతాలపై తీసుకొని ఆ మొత్తాన్ని ప్రభుత్వ ఖజానా నుంచి చెల్లించారు.

ఐదేళ్ల కాలం సజావుగా సాగిపోయింది. లోకేష్‌ వద్ద ఓ అరడజను మంది పీఆర్వోలు, లైజనింగ్‌ ఆఫీసర్లు పని చేశారు. ప్రభుత్వం మారడంతో.. గత ప్రభుత్వం నియమించిన తాత్కాలిక ఉద్యోగులకు మే 31 వరకు మాత్రమే వారికి ప్రభుత్వ ఖజానా నుంచి చెల్లింపులు జరిగాయి. ప్రభుత్వం మారడంతో వారి ఉద్యోగాలు ఊడిపోయాయి. తనకు ఐదేళ్లు సేవలందించిన ఉద్యోగుల్లో ముగ్గురిని లోకేష్‌ పంపించేశారు. మరో ముగ్గురికి మాత్రం ”ప్రభుత్వం ఇచ్చిన జీతంలో 50% మాత్రమే ఇస్తాను.. ఉంటే ఉండండి.. లేదంటే పొండి..” అని నిక్కచ్చిగా చెప్పేశారట.

దాంతో, నిశ్చేష్టులైన సదరు ఉద్యోగులు ఏం చేయాలో పాలుపోక, మీడియా మిత్రుల వద్ద తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లోకేష్‌ ఇంత నిర్దయగా వ్యవహరిస్తాడనుకోలేదు.. అంటూ లోకేష్‌ వద్ద లైజనింగ్‌ ఆఫీసర్‌గా చేసిన ఓ మహిళా జర్నలిస్ట్‌ వాపోతోంది. కొసమెరుపు ఏమిటంటే.. ఆమెను కలుసుకోవడానిక్కూడా లోకేష్‌ ఇష్టపడలేదట. తెలుగుదేశం పార్టీకి నిధుల కొరత లేదు. అందులోంచి ఉద్యోగులకు జీతాలు చెల్లించవచ్చు.

అయితే, ఇన్ఫర్మేషన్‌ డిపార్ట్‌మెంట్‌లో, ‘ఆంధ్రప్రదేశ్‌’ మాసపత్రికలో, సోషల్‌ మీడియాలో.. ఇంకా అనేక చోట్ల వందల సంఖ్యలో అస్మదీయులకు పునరావాసం కల్పించి వారికి ప్రభుత్వపరంగా భారీగా జీతాలు అందించారు. అంతమందికి ఇపుడు పార్టీ నిధుల నుండి జీతాలివ్వడం ఎలా సాధ్యం?! అయినా, అందులో చాలామందికి పని రాదు.. పునరావాసం కోసం తీసుకోవడం జరిగిందంతే.. అని తెలుగుదేశం సీనియర్‌ నేత ఒకరు తేలిగ్గా తేల్చేశారు. ఉద్యోగాలు పోయిన వారిని కలుసుకోకుండానే చంద్రబాబు, లోకేష్‌లు హైదరాబాద్‌ వెళ్లిపోవడం చర్చనీయాంశంగా మారింది.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’లో పెళ్లి కాన్సెప్ట్ హైలైట్: దర్శకుడు...

Allari Naresh: చాలా కాలం తర్వాత అల్లరి నరేష్ (Allari Naresh) కామెడీ టైమింగ్ మళ్లీ తీసుకొస్తున్నారు దర్శకుడు మల్లి అంకం. ఆయన దర్శకత్వం వహించిన...

Anand Devarakonda: మే 31న ఆనంద్ దేవరకొండ “గం..గం..గణేశా”

Anand Devarakonda: ‘బేబి’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) నటించిన కొత్త సినిమా "గం..గం..గణేశా" (Gum...

Betting case: బెట్టింగ్ కేసులో బాలీవుడ్ నటుడు అరెస్టు.. సినీ ఫక్కీలో...

Betting case: సంచలనం రేపిన మహదేవ్ బెట్టింగ్ యాప్ (Mahadev betting app case) కుంభకోణంలో బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ (Sahil Khan) ను...

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

రాజకీయం

ఎన్నికల వేళ గిట్టబాటవుతున్న ‘కూలీ’.!

ఎన్నికల ప్రచారం ఓ ప్రసహనం ఈ రోజుల్లో.! మండుటెండల్లో అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీల క్యాడర్ పడే పాట్లు వేరే లెవల్.! కింది స్థాయి నేతల కష్టాలూ అన్నీ ఇన్నీ కావు.! ఇంతకీ, ఎన్నికల...

Hassan Sex Scandal: హాసన్ లో సెక్స్ కుంభకోణం.. బాధితురాలు ఎంపీకి బంధువే

Hassan: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో హాసన్ సెక్స్ కుంభకోణం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మాజీ మంత్రి రేవణ్ణ, ఆయన కుమారుడు ఎంపీ ప్రజ్వల్ పై లైంగిక దౌర్జన్యం కేసులు నమోదవడమే ఇందుకు...

సీమలో ‘సిరిగిపోయిన’ వైసీపీ మేనిఫెస్టో.!

దీన్ని మేనిఫెస్టో అంటారా.? 2019 ఎన్నికల మేనిఫెస్టోలోంచి కొన్ని అంశాల్ని తీసేస్తే, అది ‘నవరత్నాలు మైనస్’ అవుతుందిగానీ, ‘నవరత్నాలు ప్లస్’ ఎలా అవుతుంది.? ఈ మేనిఫెస్టో దెబ్బకి, ‘వైసీపీకి అధికారం మైనస్’ అంటూ...

Chiranjeevi: పిఠాపురంలో చిరంజీవి ప్రచారానికి వస్తారా..?!

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీ రాజకీయాలు వేసవి ఎండలకుమల్లే రోజురోజుకీ హీటెక్కిపోతున్నాయి. పార్టీలన్నీ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఈక్రమంలో రాజకీయాల్లో మిక్స్ అయ్యే సినీ గ్లామర్ ఈసారీ కనిపిస్తోంది. ఎన్నికల సమయంలో...

గెలిచాక పార్టీ మారతారట.! ఏపీలో ఇదో కొత్త ట్రెండ్.!

‘మమ్మల్ని గెలిపించండి.. గెలిచాక, ఈ పార్టీలో వుండం. మేం పార్టీ మారతాం.. ఖచ్చితంగా..!’ అంటూ కొందరు అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో భాగంగా చేస్తున్న వ్యాఖ్యలు, ఓటర్లకు భలే వినోదాన్ని ఇస్తున్నాయి. అధికార వైసీపీకి...

ఎక్కువ చదివినవి

సీమలో ‘సిరిగిపోయిన’ వైసీపీ మేనిఫెస్టో.!

దీన్ని మేనిఫెస్టో అంటారా.? 2019 ఎన్నికల మేనిఫెస్టోలోంచి కొన్ని అంశాల్ని తీసేస్తే, అది ‘నవరత్నాలు మైనస్’ అవుతుందిగానీ, ‘నవరత్నాలు ప్లస్’ ఎలా అవుతుంది.? ఈ మేనిఫెస్టో దెబ్బకి, ‘వైసీపీకి అధికారం మైనస్’ అంటూ...

‘సాక్షి’ పత్రికని బలవంతంగా అంటగడుతున్నారెందుకు.?

సాక్షి పత్రికని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉచితంగా పంచి పెడుతున్నారట.! ఈనాడు, ఆంధ్ర జ్యోతి పత్రికలదీ అదే పరిస్థితి అట.! అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, ఆంధ్ర ప్రదేశ్‌లో ఈ ‘ఉచిత...

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

జగన్ విషయంలో కేసీయార్ సెల్ఫ్ గోల్.! కానీ, ఎందుకిలా.?

కేసీయార్ మహా మాటకారి.! వ్యూహాలు రచించడంలో దిట్ట.! తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఆయనే.! వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీయార్, హ్యాట్రిక్ కొట్టలేకపోయారు.. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లా...