Switch to English

టీడీపీలో కేశినేని తిరుగుబాటు ఆరంభం మాత్రమేనా?!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,459FansLike
57,764FollowersFollow

ఘోర ఓటమి నుంచి తెలుగుదేశం పార్టీ ఇంకా తేరుకోలేదు. కానీ.. అప్పుడే పార్టీలో తిరుగుబాట్లు మొదలయ్యాయి. నాయకత్వం బలహీనపడినపుడు.. అసంతృప్తి గళాలు స్వరం పెంచడం సహజం కనుక.. ఒక్కొక్కరుగా పార్టీలోని సీనియర్‌ నేతలు అధినాయకుడికి కోటరీగా మారిన వ్యక్తుల్ని టార్గెట్‌ చేస్తూ విమర్శలకు పదును పెడుతున్నారు.

పార్లమెంటరీ పార్టీ విప్‌ పదవి ఇచ్చినందుకు విజయవాడ లోక్‌సభ తెలుగుదేశం సభ్యుడు కేశినేని నాని అలకబూనాడని.. పత్రికల్లో వస్తున్న వార్తల్లో పాక్షిక నిజం మాత్రమే దాగున్నది. కేశినేని నాని ఎప్పట్నుంచో ఏళ్ల చిగువున్న తన అసహనాన్ని అణచుకొంటూ వస్తున్నారు. అతని టార్గెట్‌ అదే జిల్లాకు చెందిన మాజీమంత్రి దేవినేని ఉమ. వీరిద్దరికీ ఆది నుంచి పొసగడం లేదన్నది బహిరంగ రహస్యమే. సీనియారిటీ విషయానికొస్తే దేవినేని ఉమ మహేశ్వరరావు 1999 నుంచి 2014 వరకు వరుసగా 4 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2019లో క్యాబినెట్‌ మంత్రి అయ్యారు. నిజానికి, దేవినేని ఉమ రాజకీయ ప్రవేశం యాదృచ్ఛికంగా జరిగింది. 1998లో దేవినేని ఉమ సోదరుడైన దేవినేని రమణ వరంగల్‌ సమీపంలో జరిగిన రైల్వే ప్రమాదంలో మరణించారు. రమణ సతీమణి భర్త మరణాన్ని తట్టుకోలేక 24 గంటల వ్యవధిలో ప్రాణాలు వదిలారు. అన్న, వదినలు మరణించడంతో.. ఆ కుటుంబం నుంచి దేవినేని ఉమకు నందిగామ టిక్కెట్‌ లభించింది. ఒకప్పుడు తమ కజిన్‌ దేవినేని నెహ్రూ ఎమ్మెల్యేగా ఉండగా.. ఆయన వద్ద పిఏ తరహాలో పనిచేసిన దేవినేని ఉమకు కాలం కలిసొచ్చింది. రాజకీయాల్లోకి వచ్చి మంత్రి అయ్యారు.

ఇక, కేశినేని నానిది మొదట్నుంచీ స్థితిపరుల కుటుంబం. ప్రైవేటు బస్‌ ఆపరేటర్లుగా వారు బాగా సంపాదించారు. 2008లో మెగాస్టార్‌ చిరంజీవి ఏర్పాటు చేసిన ప్రజారాజ్యంలో కేశినేని నాని చేరారు. కొన్ని నెలలకే అల్లు అరవింద్‌ సమీప బంధువు ముత్తంశెట్టి కృష్ణారావుతో ఏర్పడిన వివాదంతో.. పార్టీ నుంచి బయటకొచ్చారు. చిరంజీవి పార్టీ టిక్కెట్లు అమ్ముకొన్నాడంటూ కేశినేని నాని అప్పట్లో చేసిన ఆరోపణలు సంచలనం సృష్టించాయి. 2014 ఎన్నికలకు ముందు కేశినేని నాని తెలుగుదేశంపార్టీలో చేరి లోక్‌సభ టిక్కెట్‌ సాధించి ఎన్నికల్లో గెలిచి లోక్‌సభ సభ్యుడయ్యారు.

అయితే, కృష్ణా జిల్లా తెలుగుదేశం రాజకీయాల్లో పెత్తనం విషయంలో ఇరువురి మధ్య విభేదాలు తలెత్తాయి. దేవినేని ఉమ, కేశినేని నానిల మధ్య ఏర్పడ్డ ‘ఈగో’ సమస్యలు పోనుపోను పెద్దవయ్యాయి. ఒక పార్టీ కార్యక్రమంలో అందరిముందు కేశినేని నానిని దేవినేని ఉమ.. ”ఏమ్మా నాని” అని అన్నాడని.. తనను ‘అమ్మ’ అని ఉమ పిలవడం నచ్చని కేశినేని నాని.. అప్పట్నుంచీ అతన్ని పలకరించడం మానేశాడని అంటారు.

పార్టీ అధిష్టానం.. అంటే చంద్రబాబునాయుడు మాత్రం తన క్యాబినెట్‌లో కీలకమైన సాగునీటి రంగాన్ని చూస్తున్న దేవినేని ఉమ పక్షాన్నే నిలిచారు. అనేక భారీ సాగునీటి ప్రాజెక్టులు చేపట్టిన నేపథ్యంలో ఆ శాఖమంత్రిగా దేవినేని ఉమ సహకారం ముఖ్యమంత్రికి అవసరం కనుక చంద్రబాబు.. కృష్ణా జిల్లా పార్టీ వ్యవహారాల్లో మంత్రి ఉమ మాటే చెల్లుబాటు అయ్యేట్లు చూశారు. కృష్ణా జిల్లా పార్టీ కార్యాలయాన్ని ఉమ గొల్లపూడిలోని తన సొంత ఇంట్లో ఏర్పాటు చేస్తే చంద్రబాబు అభ్యంతరం చెప్పలేదు.

ఇదికాక, ఇంకా నామినేటెడ్‌ పోస్టులు తదితర వ్యవహారాల్లో కూడా ఉమ వర్గానికే అధిక ప్రాధాన్యం లభించింది. ఇది.. జిల్లాలోని ఇతర నాయకులకు రుచించలేదు. కానీ.. ‘నాని|లా ఎవరూ సాహసించి బయట పడలేదు. ఇక.. చంద్రబాబు కోటరీలో ఎమ్మెల్సీగా ఉన్న తొండెపు దశరధ జనార్ధన్‌, స్టాక్‌ బ్రోకర్‌గా పనిచేసిన కుటుంబరావు, ఎమ్మెల్సీ చౌదరి తదితరులు చెప్పిన ‘రాంగ్‌ ఫీడింగ్‌’ వల్ల పార్టీ నష్టపోయిందన్న భావన చాలామందిలో ఉంది. వారందరూ దేవినేని ఉమకు సన్నిహితులు కావడంతో.. వారందరూ ఒక్కటేనని.. కేశినేని నాని లాంటివారు భావిస్తున్నారు. ఎన్నికల సమయంలో.. ప్రధాని నరేంద్రమోదీని మోతాదుకుమించి విమర్శలు చేయడంలో కోటరీ పాత్ర ఉందని, అది బెడిసికొట్టిందని.. అలాగే, దేవినేని ఉమ.. జగన్‌ను చాలా నీచంగా తిట్టాడని అది పార్టీకి నష్టం కలిగించిందని చాలామంది భావిస్తున్నారు.

తటస్థంగా ఉండనున్న ‘నాని’

అధినేత చంద్రబాబు నచ్చచెప్పినా.. కేశినేని నాని వైఖరిలో మార్పు లేదు. లోక్‌సభలో పార్టీ ‘విప్‌’ పదవిని నాని తిరస్కరించాడు. తెలుగుదేశం నుండి బయటకు పోనని ‘నాని’ చెబుతున్నది నిజం కావొచ్చు. అయితే, రాబోయే ఐదేళ్లల్లో అతను పార్టీ కార్యక్రమాలకు హాజరు కాకుండా తటస్థంగా ఉండిపోతాడని సన్నిహితులు చెప్పుకొస్తున్నారు. దానివల్ల.. కేంద్రంలోని బీజేపీ నాయకత్వానికి దగ్గరై.. నియోజకవర్గ అభివృద్ధి పనుల్ని శాంక్షన్‌ చేయించుకోవాలన్నది ‘నాని’ ఆలోచనగా కనిపిస్తోంది.

ఇది ఆరంభం మాత్రమేనా?

తెలుగుదేశం పార్టీ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్న అనేక మంది సీనియర్లు లోలోపల రగిలిపోతున్నారు. సమయం కోసం వేచిచూస్తూ ‘కేశినేని నాని’లా పార్టీపై తిరుగుబాటు బావుటా ఎగరేయాలని చూస్తున్నారు. చంద్రబాబు నాయుణ్ణి అమరావతికి పరిమితం చేసి.. పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని కలవనీయకుండా తమచుట్టూ తిపుపకొని ‘మేతమేసిన’ నాయకుల బాగోతాన్ని బయటపెడతాం.. అంటూ కొందరు బాహాటంగా వ్యాఖ్యానిస్తున్నారు.

పార్టీలో జరుగుతున్న పరిణామాలు చేయి దాటి పోకుండా చూసేందుకే.. చంద్రబాబు తన విదేశీ ప్రయాణాన్ని వాయిదా వేసుకొన్నారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. కొందరితో రాజీ యత్నాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఏదిఏమైనా.. తెలుగుదేశం పార్టీ తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నదన్నది వాస్తవం!

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’లో పెళ్లి కాన్సెప్ట్ హైలైట్: దర్శకుడు...

Allari Naresh: చాలా కాలం తర్వాత అల్లరి నరేష్ (Allari Naresh) కామెడీ టైమింగ్ మళ్లీ తీసుకొస్తున్నారు దర్శకుడు మల్లి అంకం. ఆయన దర్శకత్వం వహించిన...

Anand Devarakonda: మే 31న ఆనంద్ దేవరకొండ “గం..గం..గణేశా”

Anand Devarakonda: ‘బేబి’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) నటించిన కొత్త సినిమా "గం..గం..గణేశా" (Gum...

Betting case: బెట్టింగ్ కేసులో బాలీవుడ్ నటుడు అరెస్టు.. సినీ ఫక్కీలో...

Betting case: సంచలనం రేపిన మహదేవ్ బెట్టింగ్ యాప్ (Mahadev betting app case) కుంభకోణంలో బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ (Sahil Khan) ను...

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

రాజకీయం

ఎన్నికల వేళ గిట్టబాటవుతున్న ‘కూలీ’.!

ఎన్నికల ప్రచారం ఓ ప్రసహనం ఈ రోజుల్లో.! మండుటెండల్లో అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీల క్యాడర్ పడే పాట్లు వేరే లెవల్.! కింది స్థాయి నేతల కష్టాలూ అన్నీ ఇన్నీ కావు.! ఇంతకీ, ఎన్నికల...

Hassan Sex Scandal: హాసన్ లో సెక్స్ కుంభకోణం.. బాధితురాలు ఎంపీకి బంధువే

Hassan: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో హాసన్ సెక్స్ కుంభకోణం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మాజీ మంత్రి రేవణ్ణ, ఆయన కుమారుడు ఎంపీ ప్రజ్వల్ పై లైంగిక దౌర్జన్యం కేసులు నమోదవడమే ఇందుకు...

సీమలో ‘సిరిగిపోయిన’ వైసీపీ మేనిఫెస్టో.!

దీన్ని మేనిఫెస్టో అంటారా.? 2019 ఎన్నికల మేనిఫెస్టోలోంచి కొన్ని అంశాల్ని తీసేస్తే, అది ‘నవరత్నాలు మైనస్’ అవుతుందిగానీ, ‘నవరత్నాలు ప్లస్’ ఎలా అవుతుంది.? ఈ మేనిఫెస్టో దెబ్బకి, ‘వైసీపీకి అధికారం మైనస్’ అంటూ...

Chiranjeevi: పిఠాపురంలో చిరంజీవి ప్రచారానికి వస్తారా..?!

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీ రాజకీయాలు వేసవి ఎండలకుమల్లే రోజురోజుకీ హీటెక్కిపోతున్నాయి. పార్టీలన్నీ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఈక్రమంలో రాజకీయాల్లో మిక్స్ అయ్యే సినీ గ్లామర్ ఈసారీ కనిపిస్తోంది. ఎన్నికల సమయంలో...

గెలిచాక పార్టీ మారతారట.! ఏపీలో ఇదో కొత్త ట్రెండ్.!

‘మమ్మల్ని గెలిపించండి.. గెలిచాక, ఈ పార్టీలో వుండం. మేం పార్టీ మారతాం.. ఖచ్చితంగా..!’ అంటూ కొందరు అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో భాగంగా చేస్తున్న వ్యాఖ్యలు, ఓటర్లకు భలే వినోదాన్ని ఇస్తున్నాయి. అధికార వైసీపీకి...

ఎక్కువ చదివినవి

పిఠాపురంలో జనసునామీ.! నభూతో నభవిష్యతి.!

సమీప భవిష్యత్తులో ఇలాంటి జనసునామీ ఇంకోసారి చూస్తామా.? ప్చ్.. కష్టమే.! అయినాసరే, ఆ రికార్డు మళ్ళీ ఆయనే బ్రేక్ చేయాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు...

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ సరికొత్త కథాంశంతో సినిమా నిర్మిస్తోంది....

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి..

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ ప్రాణకోటిలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఉన్నారు....

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా 100రోజులు దిగ్విజయంగా ప్రదర్శితమై సంచలనం రేపింది....

పో..‘సాని’తనం.! ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం.!

‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.! ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.?...