Switch to English

ఎమ్మెల్యేలకు ఎర.! కేసీయార్‌ది వృధా ప్రయాసే.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చాక దాదాపు 30 మంది ఎమ్మెల్యేలు ఇతర పార్టీల నుంచి గులాబీ పార్టీ వైపు దూకేశారు. వారిలో కొంతమందికి మంత్రి పదవులు దక్కాయి కూడా. రాజకీయ శక్తుల పునరేకీకరణ అనీ, బంగారు తెలంగాణ అనీ.. రకరకాల పేర్లు పెట్టి, గులాబీ బాస్ ‘పార్టీ ఫిరాయింపుల్ని’ ప్రోత్సహించారన్నది జగమెరిగిన సత్యం.

రాజకీయ నాయకులు పార్టీలెందుకు మారతారు.? అయితే పదవుల కోసం.. లేదంటే కాంట్రాక్టుల కోసం.! ఇవేవీ కాకపోతే, అధికార పార్టీ బెదిరింపులను తాళలేక ‘సరెండర్’ అయిపోవడం. రాజకీయ ప్రత్యర్థుల ఆర్థిక మూలాల్ని దెబ్బ తీయడమే, రాజకీయమైపోయిందిప్పుడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ చేస్తున్నదీ అదే, తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ చస్తున్నదీ అదే. చంద్రబాబు చేసిందీ అదే.. అంతకు ముందు వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిందీ అదే.

గత పాలకులు వ్యవస్థల్ని నాశనం చేశారు కాబట్టి, మేం చేస్తే తప్పేంటి.? అన్నట్లుగా ప్రస్తుత పాలకులు వ్యవహరిస్తున్నారు. కానీ, ఇప్పుడు బాధపెడుతున్నవారు భవిష్యత్తులో బాధితులయ్యే అవకాశం వుందన్న వాస్తవాన్ని మర్చిపోతే ఎలా.?

తెలంగాణలో నలుగురు అధికార పార్టీ ఎమ్మెల్యేలను కొనేందుకు బీజేపీ ఓ స్వామీజీతో స్కెచ్ వేసిందన్నది తెలంగాణలో ‘ఎమ్మెల్యేలకు ఎర’ వివాదానికి సంబంధించిన అంశం. ఇందులో బీజేపీకి ఏం పని.? అని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. బీజేపీనే ఇదంతా చేయించిందంటున్నారు తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు. పట్టుబడ్డ డబ్బు ఎంత.? అంటే సమాధానం లేదు. బీజేపీ నాయకులెవరైనా దొరికారా.? అంటే అదీ లేదు.

ఆడియో లీక్స్ అనేవి, వీడియో లీక్స్ అనేవి ఈ రోజుల్లో అర్థం పర్థం లేని వ్యవహారాలు. ఈ మొత్తం ఎపిసోడ్‌లో తెలంగాణ రాష్ట్ర సమితి అడ్డంగా బుక్కయిపోయింది. ‘మీ దిక్కున్న చోట చెప్పుకోండి..’ అంటోంది బీజేపీ. ‘మేం మీ దుర్మార్గాన్ని ఎండగడతాం’ అంటున్నారు గులాబీ బాస్. తెగే పంచాయితీయేనా ఇది.? మునుగోడు ఉప ఎన్నికలో గులాబీ పార్టీకి షాక్ తగిలితే, తెలంగాణలో పొలిటికల్ ఈక్వేషన్స్ మారిపోతాయ్.

అప్పటిదాకా ఈ రచ్చ ఇలాగే కొనసాగుతుంది. ఫలితాలొచ్చేవరకే ఎవరెంత లొల్లిపెట్టినా.!

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

రాజకీయం

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

ఎక్కువ చదివినవి

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు తమ మేధస్సుని రాత రూపంలోకి మలచి...

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా 100రోజులు దిగ్విజయంగా ప్రదర్శితమై సంచలనం రేపింది....

Prachi Nigam: యూపీ టాపర్ పై ట్రోలింగ్.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన బాలిక

Prachi Nigam: సోషల్ మీడియాలో కొందరి విపరీత పోకడకలకు హద్దు లేకుండా పోతోంది. ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) విద్యార్ధిని పదో తరగతి పరిక్షల్లో 98.5శాతం ఉత్తీర్ణత సాధించిన బాలిక సత్తాను కొనియాడకుండా రూపంపై...

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...