ఇప్పటం గ్రామం గుర్తుందా.? ఈ ఏడాది గుంటూరు జిల్లాలోని ఈ గ్రామం జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు వేదికైన సంగతి తెలిసిందే. పార్టీ ఆవిర్భావ వేడుకల్ని నిర్వహించేందుకోసం జనసేన పార్టీ గుంటూరు జిల్లాలో పలు ప్రాంతాల్ని పరిశీలించగా, అన్ని చోట్లా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో అధికార పార్టీ ‘అతి తెలివి’ కారణంగా, సభ నిర్వహణకు ఇబ్బందులేర్పడ్డాయి.
దాంతో, ఇప్పటం గ్రామ ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. జనసేన పార్టీ సభ నిర్వహణ కోసం తమ భూముల్ని ఇచ్చారు. అలా అంగరంగ వైభవంగా ఆ బహిరంగ సభ జరిగింది. సాధారణంగా రాజకీయ పార్టీలకు సంబంధించిన ప్లీనరీలంటే ఆయా పార్టీలు జనాన్ని రప్పించడానికి నానా తంటాలూ పడతాయి. జనసేన పార్టీకి అలాంటి సమస్య లేదు.
పైగా, వచ్చినవారికి ఇప్పటం గ్రామస్తులు తమకు తోచిన రీతిలో సహాయ సహకారాలు అందించారు. సభ నిర్వహణ కోసం భూములిచ్చిన ఇప్పటం ప్రజలకు ఆ సభా వేదిక మీద నుంచే ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పిన జనసేనాని పవన్ కళ్యాణ్, ఇప్పటం గ్రామాభివృద్ధికి 50 లక్షలు ఇస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఇప్పుడిదంతా ఎందుకంటే, ఆ ఇప్పటం గ్రామం అధికార వైసీపీ నుంచి వేధింపుల్ని ఎదుర్కొంటోంది. గ్రామానికి జనసేనాని ఇచ్చిన 50 లక్షల విషయమై అధికార పార్టీ ‘చెత్త తెలివితేటలు’ ప్రదర్శిస్తోంది. గ్రామాభివృద్ధికి ఆ నిధుల్ని ఖర్చు చేస్తామని గ్రామస్తులు అంటోంటే, ఆ మొత్తాన్నీ ప్రభుత్వ ఖజానాకి జమ చేయాలని అధికార పార్టీ ఒత్తిడి తెస్తోన్న సంగతి తెలిసిందే.
అధికార పార్టీ ఒత్తిళ్ళకు ఇప్పటం గ్రామస్థులు తొలగ్గకపోవడంతో, రోడ్డు వెడల్పు చేసే పేరుతో.. గ్రామంలోని ఇల్ళ కూల్చివేతకు తెగబడింది వైసీపీ ప్రభుత్వం. ఈ వ్యవహారంపై జనసేన పార్టీ సీరియస్గా స్పందించింది. గ్రామ ప్రజల తరఫున హైకోర్టును ఆశ్రయించి, కూల్చవేతలపై స్టే తీసుకొచ్చింది జనసేన పార్టీ.
మరోపక్క, రేపు ఇప్పటం గ్రామంలో పర్యటించి, గ్రామస్తులకు అండగా నిలవాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారు. ఇదిలా వుంటే, జనసేన అధినేత హత్యకు కుట్ర పన్నుతోన్న కొన్ని రాజకీయ శక్తులు హైద్రాబాద్లోని ఆయన ఇంటి వద్ద రెక్కీ నిర్వహించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో జనసేనాని ఇప్పటం పర్యటనకు ప్రత్యేక భద్రతా చర్యలు చేపడుతోంది జనసేన పార్టీ. ఇప్పటంలో జనసేన అధినేత ఏం మాట్లాడతారు.? ఆయన్ని అడ్డుకునేందుకు వైసీపీ ఎలాంటి ప్రయత్నాలు చేస్తుందన్నది వేచి చూడాల్సిందే.
799438 925053youve got an essential weblog proper here! would you wish to make some invite posts on my blog? 107568
133513 359757Youre so cool! I dont suppose Ive learn something like this before. So excellent to search out any person with some unique thoughts on this topic. realy thanks for starting this up. this web site is 1 thing thats wanted on the net, somebody with a bit originality. useful job for bringing 1 thing new to the internet! 161200