నందమూరి కళ్యాణ్ రామ్ తన కెరీర్ లోనే హయ్యస్ట్ బడ్జెట్ అనదగ్గ బింబిసార చిత్రంలో నటించిన విషయం తెల్సిందే. ఈ సినిమాను కళ్యాణ్ రామ్ స్వయంగా నిర్మించాడు. కొత్త దర్శకుడు మల్లిడి వశిష్ట్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ సినిమాకు నిన్న సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. యూ/ఏ సర్టిఫికెట్ అందుకుంది ఈ చిత్రం.
ఇక ఈ సినిమాకు రన్ టైమ్ కూడా ప్లస్ కానుంది. కేవలం 2 గంటల 26 నిమిషాల నిడివి ఉన్నట్లు అధికారికంగా తెలిసింది. ఒక కమర్షియల్ బడ్జెట్ చిత్రానికి ఈ రన్ టైమ్ చాలా ప్లస్ అనే చెప్పాలి. ఇక ఈ సినిమా టైమ్ ట్రావెల్ జోనర్ లో రూపొందింది. రెండు భిన్న టైమ్ లైన్స్ లో ఈ సినిమా జరుగుతుంది. బింబిసార అనే క్రూరమైన రాజుగా ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ నటించాడు.
ఈరోజే సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ జరగనుంది. ముఖ్య అతిథిగా ఎన్టీఆర్ హాజరుకానున్నాడు.