తెలుగునాట ముందస్తు ఎన్నికలంటూ ఓ పక్క జోరుగా ఊహాగానాలు షికార్లు చేస్తున్నాయి. ఇంకోపక్క, 2024 ఎన్నికల కోసం ఆయా రాజకీయ పార్టీలు సర్వసన్నద్ధమవుతున్నాయి. సందట్లో సడేమియా అన్నట్టు.. పొలిటికల్ సినిమాల సందడి కూడా షురూ అవుతోంది.
2014 ఎన్నికల సమయంలో ‘యాత్ర’ సినిమాతోపాటు, ‘లక్ష్మీస్ ఎన్టీయార్’ సినిమా కూడా వచ్చిన సంగతి తెలిసిందే. ఒకటి వైసీపీకి అనుకూలంగా, ఇంకోటి టీడీపీకి వ్యతిరేకంగా తెరకెక్కింది.
2024 లెక్కే వేరప్పా.!
ఇటీవల ప్రముఖ సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్ రాజ్యసభ సభ్యుడిగా ఎంపికైన సంగతి తెలిసిందే. బీజేపీ వ్యూహాత్మకంగా ఆయన్ని రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు పంపింది. ఈ క్రమంలో ఆయన బీజేపీకి అనుకూలంగా ఓ స్క్రిప్ట్ రాసి, దాన్ని సినిమాగా తెరకెక్కించే బాధ్యతని తీసుకున్నారని తెలుస్తోంది.
‘కాశ్మీర్ ఫైల్స్’ తరహాలో హైద్రాబాద్ ఫైల్స్, రాజాకార్ల ఫైల్స్.. అనే పేర్లను బీజేపీ ఇప్పటికే ప్రచారంలోకి తెచ్చిన సంగతి తెలిసిందే.
కాగా, ‘యాత్ర’ సినిమాకి సీక్వెల్ వస్తుందని గతంలోనే ప్రచారం జరిగింది. అది కూడా సరిగ్గా 2024 ఎన్నికలకు ముందర విడుదలయ్యేలా తెరవెనుకాల సన్నాహాలు జరుగుతున్నాయట.
గులాబీ సినిమా కూడా..
మరి, గులాబీ పార్టీ ఏం చేస్తోంది.? తెలంగాణ రాష్ట్ర సమితికి అనుకూలంగా వుండేలా కేసీయార్ బయోపిక్ గురించి గతంలో సన్నాహాలు జరిగాయి. కొన్ని సినిమాల్లో కేసీయార్ ఘనకీర్తిని చాటే సన్నివేశాల్నీ జొప్పించారు.
తాజాగా కేసీయార్ మీద ఓ బయోపిక్ కోసం ప్రయత్నాలు ప్రారంభమయ్యాయట. నటీనటుల ఎంపిక కూడా జరిగిపోయిందట. సరైన సమయంలో సినిమా ప్రారంభించి, శరవేగంగా పూర్తి చేసేందుకు అన్ని వనరుల్నీ సమకూర్చుకున్నారని సమాచారం.
తెలంగాణ ఉద్యమం, తెలంగాణ రాష్ట్ర ప్రగతి.. తదితర అంశాల్ని ప్రత్యేకంగా ఇందులో ప్రస్తావిస్తారనీ, గతంలో చిన్నా చితకా సినిమాల్ని నర్మించిన ఓ నిర్మాత ఈ సినిమాని ఘనంగా నిర్మించబోతున్నారనీ అంటున్నారు.
తెలుగుదేశం పార్టీ కోసం కూడా ఓ సినిమా తయారవుతోందని తెలుస్తోంది. ఓ ప్రముఖ నిర్మాత (గతంలో టీడీపీ నేత కూడా) ఈ సినిమాకి అన్నీ తానే అయి వ్యవహరిస్తున్నారట.
జనసేన పార్టీ కోసం ఓ సినిమా రూపొందించాలనే ఆలోచనలు జరుగుతున్నా, జనసేనాని ఇందుకు సుముఖత వ్యక్తం చేయలేదని సమాచారం. అయితే, పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతోన్న సినిమాల్లోనే, పరోక్షంగా ఆయన్ని రాజకీయంగా ఎలివేట్ చేసే సన్నివేశాలు వుంటోన్న సంగతి తెలిసిందే.
664458 330337Id must verify with you here. Which isnt something I often do! I enjoy studying a publish that can make individuals believe. Also, thanks for permitting me to remark! 422618
894896 980460I enjoy seeking by way of and I conceive this site got some truly helpful stuff on it! . 718114