Switch to English

రిజర్వేషన్స్‌: జగన్‌ సర్కార్‌కి షాకిచ్చిన హైకోర్టు

‘అత్యంత ప్రతిష్టాత్మకం’ అని చెప్పుకుంటూ వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు అడపా దడపా హైకోర్టు ‘చెక్‌’ పెడుతోంది. నిర్ణయాల్లో డొల్లతనమే ఇందుకు కారణంగా కన్పిస్తోంది. తాజాగా, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్ల కోటాపై హైకోర్టు, రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పు పట్టింది. 59.85 శాతాన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ల కోసం కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం విదితమే.

దీన్నొక ప్రతిష్టాత్మకమైన ఆలోచనలగా వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం చెప్పుకుంది. ఆయా వర్గాల పట్ల తమకున్న అంకిత భావానికి ఇదే నిదర్శనమనీ వైసీపీ నేతలు చెప్పుకుంటున్నారు. యఅఇతే, 50 శాతాన్ని మించి రిజర్వేషన్లను సుప్రీంకోర్టు గతంలోనే తప్పు పట్టింది. విషయం తెలిసీ, ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం.. కేవలం రాజకీయ లబ్ది కోసమేనన్నది ఓపెన్‌ సీక్రెట్‌. ఈ తరహా నిర్ణయాల్ని ఎవరో ఒకరు న్యాయస్థానాల్లో సవాల్‌ చేస్తారు. ఆ విషయం కూడా ప్రభుత్వానికి తెలుసు.

అలా అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పుడు, తెలివిగా ఆయా వ్యక్తులు లేదా పార్టీలపై రాజకీయ బురద జల్లి, ఆయా వర్గాలకు ఆయా పార్టీలు వ్యతిరేకమనే ముద్ర వేసేయడం పరిపాటిగా మారిపోయింది వైఎస్‌ జగన్‌ ప్రభుత్వానికి. నిజానికి, రిజర్వేషన్లను జగన్‌ సర్కార్‌ ప్రకటించినప్పుడే విపక్షాలు ఈ విషయాన్ని తెరపైకి తెచ్చాయి. రిజర్వేషన్ల పేరుతో ప్రభుత్వం పబ్లిసిటీ స్టంట్లు చేస్తోందని టీడీపీ సహా అన్ని రాజకీయ పార్టీలూ ఎద్దేవా చేవాయి. ఆయా పార్టీల వాదనే ఇప్పుడు నిజమని తేలింది.

ఆయా వర్గాల మీద ప్రేమ కంటే, ఇక్కడ రాజకీయ లబ్దినే ప్రభుత్వం చూసిందన్నది ఇంకోసారి నిరూపితమయ్యింది. ఇదొక్కటే కాదు చాలా అంశాల్లో ఇలాగే న్యాయస్థానం ముందు ప్రభుత్వం పదే పదే బొక్క బోర్లా పడాల్సి వస్తుండడం గమనార్హం. కింద పడ్డా తమదే పైచేయి.. అంటూ ఇంకో మార్గంలో తన పంతాన్ని నెగ్గించుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుందా.? మొట్టికాయలు పడ్డాయి కాబట్టి, ఇకనైనా సరైన ఆలోచనలు ప్రభుత్వం చేయగలుగుతుందా.? అన్నది వేచి చూడాలి.

సినిమా

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా...

కంగనా 50 కోట్ల ఆఫీస్‌ ప్రత్యేకతలు చూద్దాం రండి

సినిమా ఆఫీస్‌ లు ఎంత రాయల్‌ గా ఎంతో అహ్లాదకరంగా ఉంటాయి. ప్రతి చోట కూడా క్రియేటివిటీ కలగలిపి ఉంటాయి. అన్ని విధాలుగా కూడా ప్రశాంతతను...

సోను సూద్ ఆచార్య గురించి ఏమంటున్నాడు?

సోను సూద్ అనే పేరుకు టాలీవుడ్ లో పరిచయం అవసరం లేదు. అరుంధతిలో విలన్ గా చేసిన దగ్గరనుండి సోను సూద్ కు తెలుగులో పాపులారిటీ...

బన్నీకి ఇష్టమైన బాలీవుడ్ సినిమాలివే

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత కొన్నేళ్లుగా ప్యాన్ ఇండియా సినిమా చేయాలని అనుకుంటున్నాడు. అయితే అందుకు సరైన సందర్భం రావట్లేదు. ఇక ఇప్పుడు అల...

నాని మూవీకి ఎన్ని ఆఫర్స్ వచ్చినా నో అంటున్న దిల్ రాజు.!

టాలీవుడ్ అగ్రనిర్మాతల్లో ఒకరు దిల్ రాజు.. ప్రతి ఏడాది దిల్ రాజు నిర్మాణ సంస్థ నుంచి ఐదారు సినిమాలు విడుదలవుతుంటాయి, అంతే కాకుండా పలు సినిమాల...

రాజకీయం

హైకోర్టుపై వైసీపీ నేతల వ్యాఖ్యలు.. 49 మందికి నోటీసులు!

డాక్టర్‌ సుధాకర్‌ వ్యవహారం, ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగుల వ్యవహారం... వంటి విషయాలపై న్యాయస్థానం ఇటీవల ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిన దరిమిలా, అధికార పార్టీకి చెందిన నేతలు న్యాయస్థానం తీర్పుపై అసహనం వ్యక్తం...

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా ల‌క్ష‌లాది మంది సినీ-టీవీ కార్మికులు రోడ్డున...

2021కి పోలవరం.. పోతిరెడ్డిపాడుతో ఎవరికీ నష్టం లేదు.. సీఎం జగన్

అమరావతి: ఎగువ రాష్ట్రాల్లో ప్రాజెక్టులు ఎక్కువగా కట్టడం వల్ల రాష్ట్రానికి నీరు అందని పరిస్థితి ఉందని.. ఈ సమయంలో రాష్ట్రంలో చేపడుతున్న ప్రాజెక్టులపై వివాదాలు సృష్టించడం తగదని ఏపీ సీఎం జగన్ మోహన్...

హైకోర్టు మొట్టికాయలేస్తే.. టీడీపీని టార్గెట్ చేస్తారెందుకు?

ప్రభుత్వ పాఠశాలల్లోంచి తెలుగు మీడియంని తొలగించి, ఇంగ్లీషు మీడియంని తీసుకురావాలని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నానికి న్యాయస్థానం మొట్టికాయలేసింది. దాంతో, రకరకాల మార్గాల్లో తన ఆలోచనను అమలు చేసేందుకు వైఎస్‌...

టీడీపీకి ‘మహా’ షాక్‌: వైసీపీలోకి ‘ఆ’ తెలుగు తమ్ముళ్ళు.?

తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ‘మహానాడు’కి ముందే పార్టీ అధినేతకు ఝలక్‌ ఇచ్చేందుకు వైసీపీ...

ఎక్కువ చదివినవి

బిగ్‌ బ్రేకింగ్‌: ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌ ఎత్తివేత

టీడీపీ హయాంలో ఇంటెలిజెన్స్‌ హెడ్‌గా బాధ్యతలు నిర్వహించిన సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకి హైకోర్టు ఊరటనిచ్చింది. వైసీపీ రాజకీయ ఆరోపణల నేపథ్యంలో ఎన్నికల సమయంలోనే ఏబీ వెంకటేశ్వరరావుని కేంద్ర ఎన్నికల సంఘం...

జగన్ క్లాప్ కొట్టాడు, కేసీఆర్ ఎప్పుడో?

రెండు నెలల సుదీర్ఘ విరామం తర్వాత ఎట్టకేలకు ఏపీ లో సినిమా సీరియల్స్ ఇతర షోల షూటింగ్స్ కు అనుమతులు ఇస్తూ ఏపీ ప్రభుత్వం ఎట్టకేలకు ప్రకటన జారీ చేసింది. అయితే తెలుగు...

క్రైమ్ న్యూస్: గొడవలతో భార్య భర్తల ఆత్మహత్య, 9 నెలల చిన్నారిని కూడా..!

మహబూబాబాద్‌ జిల్లాలో దారుణం జరిగింది. డోర్నకల్‌ మండలం మన్నెగూడెంకు చెందిన రాంబాబు మరియు ఆయన భార్య కృష్ణవేణిలు ఆత్మహత్య చేసుకున్నారు. వారితో పాటు 9 నెలల చిన్నారిని కూడా వారు చంపేశారు. ఈ...

కంగనా 50 కోట్ల ఆఫీస్‌ ప్రత్యేకతలు చూద్దాం రండి

సినిమా ఆఫీస్‌ లు ఎంత రాయల్‌ గా ఎంతో అహ్లాదకరంగా ఉంటాయి. ప్రతి చోట కూడా క్రియేటివిటీ కలగలిపి ఉంటాయి. అన్ని విధాలుగా కూడా ప్రశాంతతను కలిగించేలా సినిమా ఆఫీస్‌ లను ఫిల్మ్‌...

ఫ్లాష్ న్యూస్: లారీ క్యాబిన్‌లో ఉరి వేసుకున్న డ్రైవర్‌

నెలన్నర రోజుల తర్వాత ఎట్టకేలకు లారీలు రోడ్డు ఎక్కాయి. ఈ సమయంలో ఆర్థికంగా డ్రైవర్లు చితికి పోయారు. వారి జీవితం ఆందోళనకరంగా మారింది. ఎంతో మంది ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవతున్నారు. ఆ...