నేచురల్ స్టార్ నాని తెలుగు సినీ పరిశ్రమలో అందరికీ అత్యంత సన్నిహితుడు. నిర్మాతగా మారి రెండు సినిమాల్ని ప్రెజెంట్ చేశాడు కూడా. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వుండే నానికి సామాజిక బాధ్యత కూడా ఎక్కువే. అయితే, రాజకీయాల జోలికి మాత్రం అస్సలు వెళ్ళడు. కానీ, హీరో నాని తాజా ట్వీట్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.
‘పాలిటిక్స్, కులం, మతం, పవర్, డబ్బు, ఫేమ్ .. తొక్క తోలు ఏమీ వుండదు.. చివరికి మనిషికి మనిషే.. వి ఆర్ ఆల్ వన్ బిగ్ ఫ్యామిలీ అండ్ వి నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ ఈచ్ అదర్.. బి రెస్పాన్సిబుల్.. బి సేఫ్..’ అంటూ నాని ఓ ట్వీటేశాడు తాజాగా.
కరోనా వైరస్‌పై ప్రపంచమంతా ఆందోళన చెందుతున్న వేళ, నాని ట్వీట్ చాలా బాధ్యతాయుతమైనదే. కానీ, దీన్ని రకరకాలుగా అన్వయించేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ చుట్టూ చాలా రాజకీయం నడుస్తోంది. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ సెగలు కాస్తా, కుల రాజకీయాన్ని తెరపైకి తెచ్చాయి.
సాక్షాత్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి కులం ‘కంపు’ అంటించే ప్రయత్నం చేశారు. స్థానిక ఎన్నికల్ని కరోనా వైరస్ తీవ్రత కారణంగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వాయిదా వేయడమే ఇందుకు కారణం. ఈ వ్యవహారమ్మీదనే నాని సెటైర్ వేశాడని కొందరు నాని ట్వీట్‌ని రీ-ట్వీట్ చేస్తూ పేర్కొంటున్నారు. మరోపక్క, సినీ పరిశ్రమలో కుల జాడ్యం గురించి నాని ప్రస్తావించాడన్నది ఇంకొందరి వాదన. ఇవేవీ కాదు, దేశంలో సీఏఏ మంటల నేపథ్యంలో నాని తనదైన స్టయిల్లో స్పందించాడని ఇంకొందరు అంటున్నారు.
ఎవరి వాదన నిజం.? అన్నది పక్కన పెడితే, నాని చెప్పిన విషయంలో నూటికి నూరు పాళ్ళూ వాస్తవం వుంది. రాజకీయమైనా, కులం అయినా, మతం అయినా, పవర్, డబ్బు, ఫేమ్ .. వంటివైనా.. మనిషి తర్వాతే. ఆ మనిషే లేనప్పుడు ఇవన్నీ దండగ. అలాంటిది, వాటిని పట్టుకుని మనిషి తనను తాను గొప్ప.. అనుకుంటే అంతకన్నా మూర్ఖత్వం ఇంకోటుండదు. నా కులం, నా మతం.. నా డబ్బు.. అని ఎవడు అనుకున్నా, చచ్చాక మిగిలేది పిడికెడు బూడిద మాత్రమే.
పాలిటిక్స్, కులం, మతం, పవర్, డబ్బు, ఫేమ్ తొక్క తోలు ఏమీ ఉండదు చివరకి
మనిషికి మనిషే
We are all one big family and we need to take care of each other #BeResponsible #BeSafe
— Nani (@NameisNani) March 17, 2020
67757 409943Thoughts speak within just around the web control console video clip games have stimulated pretty specialist to own on microphone as nicely as , resemble the perfect tough guy to positively the mediocre ones. Basically fundamental difficulties in picture gaming titles. Drug Recovery 259620
625458 111914Wonderful post, I conceive weblog owners should acquire a lot from this internet blog its real user pleasant. 942744