టాలీవుడ్ లో కమర్షియల్ సినిమాలను సరిగ్గా హ్యాండిల్ చేయగల దర్శకుల్లో హరీష్ శంకర్ ముందు వరసలో కచ్చితంగా ఉంటారు. హరీష్ శంకర్ ఆఖరుగా గతేడాది విడుదలైన గద్దలకొండ గణేష్ తో సూపర్ హిట్ ను సొంతం చేసుకున్నారు. ఆపై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమాను కన్ఫర్మ్ చేసుకున్నారు. అయితే పవన్ కళ్యాణ్ తో హరీష్ చేయబోయే సినిమా మొదలవ్వడానికి ఇంకా కనీసం ఏడాది పడుతుంది. ఎందుకంటే హరీష్ తో పవన్ సినిమాను మొదలుపెట్టాలంటే ముందు చేస్తున్న రెండు సినిమాలను పూర్తి చేయాలి. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వేణుశ్రీరామ్ దర్శకత్వంలో పింక్ రీమేక్ వకీల్ సాబ్, క్రిష్ దర్శకత్వంలో పీరియడ్ డ్రామా విరూపాక్షను చేస్తున్న విషయం తెల్సిందే. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో పవన్ ఈ రెండు సినిమాలను పూర్తి చేయడానికి కనీసం ఏడాది పడుతుంది.
అయితే ఈలోగా హరీష్ కు ఒక భారీ ఆఫర్ వచ్చింది. తెలుగులో హిట్ అయిన దువ్వాడ జగన్నాథం చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయమని ఒక ప్రముఖ బాలీవుడ్ ప్రొడక్షన్స్ సంస్థ హరీష్ ను అప్రోచ్ అయింది. అయితే హరీష్ శంకర్ మాత్రం ముందు తీసుకున్న పవన్ కమిట్మెంట్ కే కట్టుబడి ఉన్నాడు. బాలీవుడ్ సినిమా అంటూ అటు వెళిపోతే ఇక్కడ పవన్ సినిమా కోల్పోయే అవకాశం ఉంటుందన్నఆలోచనతో పవన్ తో చిత్రం చేశాకే బాలీవుడ్ ఆఫర్ గురించి ఆలోచిస్తా అంటున్నాడు. అదీ సంగతి.