Switch to English

బాలూ.. మాటిచ్చావ్‌.. కానీ, మాట తప్పేశావ్‌.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,459FansLike
57,764FollowersFollow

ఒకప్పుడు ఆయన్ని ‘మిమిక్రీ ఆర్టిస్ట్‌’ అని వెటకారం చేశారు. కానీ, అలాంటి అవమానాలకి ఆయన భయపడిపోలేదు. తానేంటో నిరూపించుకోవాలనుకున్నాడు. అందుకే, గాన గంధర్వుడయ్యాడు. పాటకు తనదైన ‘అందాన్ని’ జోడించాడాయన. పరిచయం అక్కర్లేని పేరది. గాన గంధర్వుడంటే ఎస్పీ బాలసుబ్రమణ్యం మాత్రమే. తెలుగు, తమిళ, హిందీ.. ఇలా పలు భాషల్లో వేలాది పాటలు పాడిన ఎస్పీ బాలసుబ్రమణ్యం. నటుడిగానూ.. డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గానూ, సంగీత దర్శకుడిగానూ, నిర్మాతగానూ పలు సినిమాలతో ప్రేక్షకుల్ని అలరించారు.

ఎస్పీ బాలు లేరన్న వార్తని కోట్లాది మంది భారతీయులు జీర్ణించుకోలేకపోతున్నారు. ‘మన బాలు ఇక లేడన్న వార్త నమ్మలేనిది..’ అంటూ కన్నీరు మున్నీరవుతున్నారు. ‘పాటలోని భావం చచ్చిపోతోంటే, ఆ పాట పాడలేను..’ అంటూ కొన్నాళ్ళ క్రితం ఓ ఇంటర్వ్యూలో ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆవేదన వ్యక్తం చేశారు. అలా చాలా పాటలు ఆయనకు దూరమయ్యాయి.

అయితే, ఓ మంచి భావమున్న పాట మాత్రం ఆయన్ని ఎప్పుడూ వెతుక్కుంటూ వెళ్ళేది. బాలు పడితే, ఓ సాధారణమైన పాట కూడా అసాధారణమైన రీతిలో సంగీత ప్రియుల్ని అలరించేది. ఏ హీరోకి పాట పాడితే, ఆ హీరో నిజంగానే పాడినట్లుగా వుండేలా చేయడం బహుశా ఎస్పీ బాలసుబ్రమణ్యంకే చెల్లిందేమో.

ఎస్పీ బాలు పాడితే ఆ పాటలో చమక్కులుంటాయి. ప్రతి పదమూ, అందులోని ప్రతి అక్షరమూ వినేవారికి తెలుస్తుంది. అదీ బాలు ప్రత్యేకత. బుల్లితెరపై పలు మ్యూజిక్‌ కాంపిటీషన్స్‌లో పాల్గొనేవారు.. జడ్జిగా వ్యవహరించేవారు.. ఎందరో గాయకులకు పాటలు పాడటంలో మెలకువలు నేర్పించేవారు. బాలు చూపిన బాటలో.. అంటూ ఎంతోమంది మంచి గాయకులు వెండితెరకు పరిచయమయ్యారు. కానీ, బాలు ఇచ్చిన మాట తప్పారు.

కరోనా సోకిన నేపథ్యంలో ఆసుపత్రిలో చేరాక, ఓ సెల్పీ వీడియో విడుదల చేశారు బాలు. ‘పెద్దగా అనారోగ్య లక్షణాలేవీ లేవు. త్వరలోనే కోలుకుంటాను. ఇంట్లో వుండి, కుటుంబ సభ్యుల్ని ఇబ్బంది పెట్టే ఉద్దేశ్యం లేకనే ఆసుపత్రికి వచ్చాను.. అంతే తప్ప, నేను చాలా క్షేమంగా వున్నాను. కరోనా నుంచి కోలుకుని, మంచి మంచి పాటలు పాడతాను..’ అని చెప్పిన ఎస్పీ బాలు, ఆసుపత్రి నుంచి విగతజీవిగానే బయటకు రావాల్సి వచ్చింది. బాలు మరణంతో సినీ పాటల ప్రపంచం మూగబోయింది.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’లో పెళ్లి కాన్సెప్ట్ హైలైట్: దర్శకుడు...

Allari Naresh: చాలా కాలం తర్వాత అల్లరి నరేష్ (Allari Naresh) కామెడీ టైమింగ్ మళ్లీ తీసుకొస్తున్నారు దర్శకుడు మల్లి అంకం. ఆయన దర్శకత్వం వహించిన...

Anand Devarakonda: మే 31న ఆనంద్ దేవరకొండ “గం..గం..గణేశా”

Anand Devarakonda: ‘బేబి’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) నటించిన కొత్త సినిమా "గం..గం..గణేశా" (Gum...

Betting case: బెట్టింగ్ కేసులో బాలీవుడ్ నటుడు అరెస్టు.. సినీ ఫక్కీలో...

Betting case: సంచలనం రేపిన మహదేవ్ బెట్టింగ్ యాప్ (Mahadev betting app case) కుంభకోణంలో బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ (Sahil Khan) ను...

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

రాజకీయం

Hassan Sex Scandal: హాసన్ లో సెక్స్ కుంభకోణం.. బాధితురాలు ఎంపీకి బంధువే

Hassan: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో హాసన్ సెక్స్ కుంభకోణం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మాజీ మంత్రి రేవణ్ణ, ఆయన కుమారుడు ఎంపీ ప్రజ్వల్ పై లైంగిక దౌర్జన్యం కేసులు నమోదవడమే ఇందుకు...

సీమలో ‘సిరిగిపోయిన’ వైసీపీ మేనిఫెస్టో.!

దీన్ని మేనిఫెస్టో అంటారా.? 2019 ఎన్నికల మేనిఫెస్టోలోంచి కొన్ని అంశాల్ని తీసేస్తే, అది ‘నవరత్నాలు మైనస్’ అవుతుందిగానీ, ‘నవరత్నాలు ప్లస్’ ఎలా అవుతుంది.? ఈ మేనిఫెస్టో దెబ్బకి, ‘వైసీపీకి అధికారం మైనస్’ అంటూ...

Chiranjeevi: పిఠాపురంలో చిరంజీవి ప్రచారానికి వస్తారా..?!

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీ రాజకీయాలు వేసవి ఎండలకుమల్లే రోజురోజుకీ హీటెక్కిపోతున్నాయి. పార్టీలన్నీ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఈక్రమంలో రాజకీయాల్లో మిక్స్ అయ్యే సినీ గ్లామర్ ఈసారీ కనిపిస్తోంది. ఎన్నికల సమయంలో...

గెలిచాక పార్టీ మారతారట.! ఏపీలో ఇదో కొత్త ట్రెండ్.!

‘మమ్మల్ని గెలిపించండి.. గెలిచాక, ఈ పార్టీలో వుండం. మేం పార్టీ మారతాం.. ఖచ్చితంగా..!’ అంటూ కొందరు అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో భాగంగా చేస్తున్న వ్యాఖ్యలు, ఓటర్లకు భలే వినోదాన్ని ఇస్తున్నాయి. అధికార వైసీపీకి...

వంగా గీత ‘పార్టీ మార్పు’ ప్రచారం వెనుక.!

వంగా గీత పార్టీ మారుతున్నారట కదా.! వైసీపీకి గుడ్ బై చెప్పి, జనసేనలోకి ఆమె వెళ్ళబోతున్నారట కదా.! నామినేషన్‌ని వంగా గీత వెనక్కి తీసుకుంటున్నారట కదా.! ఇవన్నీ సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న...

ఎక్కువ చదివినవి

Hassan Sex Scandal: హాసన్ లో సెక్స్ కుంభకోణం.. బాధితురాలు ఎంపీకి బంధువే

Hassan: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో హాసన్ సెక్స్ కుంభకోణం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మాజీ మంత్రి రేవణ్ణ, ఆయన కుమారుడు ఎంపీ ప్రజ్వల్ పై లైంగిక దౌర్జన్యం కేసులు నమోదవడమే ఇందుకు...

జగన్ విషయంలో కేసీయార్ సెల్ఫ్ గోల్.! కానీ, ఎందుకిలా.?

కేసీయార్ మహా మాటకారి.! వ్యూహాలు రచించడంలో దిట్ట.! తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఆయనే.! వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీయార్, హ్యాట్రిక్ కొట్టలేకపోయారు.. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లా...

ఉప్మాకి అమ్ముడుపోవద్దు: పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్.!

ఇది మామూలు వార్నింగ్ కాదు.! చాలా చాలా స్ట్రాంగ్ వార్నింగ్.! అయితే, ఆ హెచ్చరిక ఎవర్ని ఉద్దేశించి.? ఉప్మాకి అమ్ముడుపోయేటోళ్ళు రాజకీయాల్లో ఎవరుంటారు.? ఉప్మాకి అమ్ముడుపోవద్దని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎవర్ని...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా 100రోజులు దిగ్విజయంగా ప్రదర్శితమై సంచలనం రేపింది....