Switch to English

బ్రేకింగ్: మరలిరాని లోకానికి గానగంధర్వుడు.. ఎస్పీ బాలు కన్నుమూత

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,433FansLike
57,764FollowersFollow

లక్షలాది మంది అభిమానుల ప్రార్థనలు ఫలించలేదు. వేలాది పాటలు పాడిగ గాత్రం మూగబోయింది. గానగంధర్వుడు మరలిరాని లోకానికి వెళ్లిపోయారు. 55 రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ నేపథ్య గాయకుడు, నటుడు, నిర్మాత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కన్నుమూశారు. చెన్నై ఎంజీఎం ఆస్పత్రిలో పది మంది వైద్య నిపుణుల పర్యవేక్షణలో అత్యంత నాణ్యమైన చికిత్స అందించినా ఆయన్ను కాపాడలేకపోయారు.

కరోనా నిర్ధారణ కావడంతో గతనెల 5న చెన్నై ఎంజీఎం ఆస్పత్రిలో చేరిన బాలు ఆరోగ్య పరిస్థితి క్రమంగా విషమించింది. ఈ నేపథ్యంలో ఆయనకు వెంటిలేటర్ పై చికిత్స అందించిన వైద్యులు.. అనంతరం ఎక్మో సపోర్ట్ తో చికిత్స చేశారు. ఈ క్రమంలో బాలు కరోనా నుంచి కోలుకున్నారు. నెమ్మదిగా ఆయన ఆరోగ్య పరిస్థితి కుదుటపడింది. దీంతో త్వరలోనే ఆయన పూర్తి ఆరోగ్యంతో డిశ్చార్జి అవుతారని అందరూ భావించారు. అయితే, గురువారం సాయంత్రం బాలు ఆరోగ్య పరిస్థితి ఒక్కసారిగా విషమించింది. రాత్రికి అది మరింత విషమంగా మారింది.

నిపుణులైన వైద్యులు అన్ని రకాలుగా ప్రయత్నించినా.. ఫలితం దక్కలేదు. చివరకు శుక్రవారం మధ్యాహ్నం 1.04 గంటలకు బాలు తుది శ్వాస విడిచారు. గురువారం సాయంత్రమే బాలు ఆరోగ్యం విషమంగా మారిందని తెలియడంతో అభిమానులతోపాటు సినీ ప్రముఖులు తీవ్ర ఆందోళనకు లోనయ్యారు. కమల్ హాసన్ ఆస్పత్రికి వచ్చి బాలు ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఇక శుక్రవారం ఉదయం నుంచి ఎంజీఎం ఆస్పత్రికి అభిమానులు పోటెత్తారు. బాలు కోలుకుని రావాలని ప్రార్థనలు చేశారు. కానీ అందరికీ తీరని శోకం మిగులుస్తూ బాలు తరలిరాని లోకానికి వెళ్లిపోయారు.

శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం 1946 జూన్ 4న నెల్లూరు జిల్లాలోని కోనేటమ్మపేటలో జన్మించారు. తండ్రి సాంబమూర్తి హరికథా కళాకారుడు కాగా, తల్లి శకుంతలమ్మ గృహిణి. ముగ్గురు కుమారులు, ఐదుగురు కుమార్తెలు కలిగిన పెద్ద కుటుంబంలో బాలు రెండో కుమారుడు. బాల్యం నుంచే బాలుకు పాటలపై మక్కువ ఎక్కువ. అయితే, ఇంజనీర్ కావాలనే తండ్రి ఆశయాన్ని నెరవేర్చేందుకు మద్రాసు ఏఎంఐఈ కోర్సులో చేరారు. ఆ సమయంలోనే పలు పాటల పోటీల్లో పాల్గొని సత్తా చాటారు. 1966లో పద్మనాభం నిర్మించిన శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న చిత్రంతో సినీ గాయకుడిగా ఆయన ప్రస్థానం ప్రారంభమైంది. అక్కడ నుంచి వెనుతిరిగి చూడలేదు.

నటీనటుల హవభావాలు, నటనా శైలికి అనుగుణంగా పాటలు పాడటం బాలుకు మరింత ప్రత్యేకత తెచ్చిపెట్టింది. గాయకుడిగానే కాకుండా నటుడిగానూ పలు పాత్రల్లో మెప్పించారు. 1969లో తొలిసారిగా తెరపై కనిపించిన బాలు.. తర్వాత పలు సినిమాల్లో నటించారు. ప్రేమ, ప్రేమికుడు, పవిత్రబంధం, ఆరోప్రాణం, రక్షకుడు, దీర్ఘసుమంగళీభవ వంటి చిత్రాల్లో చక్కని పాత్రలు పోషించారు. ప్రేమికుడు సినిమాలో ప్రభుదేవాతో కలిసి బాలు వేసిన స్టెప్పులు అభిమానులను అలరించాయి. తనికెళ్ల భరణి నిర్మించిన మిథునం చిత్రంలో కథానాయకుడిగా నటించారు. గాయకుడు, నటుడిగానే కాకుండా డబ్బింగ్ కళాకారుడిగా ఎందరో నటులకు గాత్రం అందించారు.

సినిమాల్లోనే కాకుండా బుల్లితెరపైనా బాలు ఎందరినో అలరించారు. పాడుతా తీయగా.. పాడాలని ఉంది వంటి కార్యక్రమాల ద్వారా పలువురునూతన గాయనీ గాయకులను పరిచయం చేశారు. తన గానంతో ఎందరినో ఉర్రూతలూగించిన బాలును ఎన్నో పురస్కారాలు వరించాయి. 2001లో పద్మశ్రీ, 2011లో పద్మభూషణ్ పురస్కారాలతో కేంద్రం సత్కరించింది. వివిధ విభాగాల్లో 29 సార్లు ఏపీ ప్రభుత్వం అందజేసే నంది అవార్డు లభించింది.

అలాగే తమిళనాడు, కర్ణాటక ప్రభుత్వాల నుంచి పలు అవార్డులు వచ్చాయి. 40 ఏళ్ల సినీ ప్రస్థానంలో 11 భాషాల్లో 40వేలకు పైగా పాటలు పాడారు. 40 సినిమాలకు సంగీత దర్శకత్వం వహించారు. బాలు సతీమణి సావిత్రి. వీరి పిల్లలు పల్లవి, చరణ్. బాలు కరోనాతో ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి చరణ్ ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్య సమాచారాన్ని అభిమానులకు తెలియజేస్తూ వస్తున్నారు.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

ఎక్కువ చదివినవి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్: వైసీపీకి చావు దెబ్బే.!

‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఇప్పటికే కొంతమందికి రిజిస్ట్రేషన్ పత్రాలు అందాయి..’ అని వైసీపీ చెబుతోంది. ఈ మేరకు, కొంతమంది మీడియా ముందుకొచ్చి, ఆ పత్రాల్ని చూపిస్తున్నారు కూడా.! అదే సమయంలో, ‘ఇంకా...

Chiranjeevi: పిఠాపురం ప్రజలు పవన్ ను గెలిపించండి.. అండగా ఉంటాడు: చిరంజీవి

Chiranjeevi: ‘జనమే జయం అని నమ్మే పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మీ ముందుకు వచ్చాడు. మీ కోసం సైనికుడిగా.. సేవకుడిగా నిలబడతాడు. మీకేం చేయగలడో చూడాలంటే పిఠాపురం ప్రజలు జనసేన (Janasena)కు...

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

Sukumar: సుకుమార్ కెరీర్ @20 ఆయన బ్రెయిన్ పవర్ 2.0

Sukumar: లెక్కలు.. ఈ సబ్జెక్టే ఎంతో కష్టం. కానీ.. ఇష్టంగా భావించేవాళ్లకు లెక్కలు తప్ప మరొకటి ఎక్కదు. లెక్కలతో పదునెక్కిన మనిషి మెదడు చేసే ఏ పనిలో అయినా అలాగే ఆలోచింపజేస్తుంది. అంతే...

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...