Switch to English

బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలు సరే.. ఏపీ ‘స్థానిక’ సమరమెప్పుడు.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,468FansLike
57,764FollowersFollow

బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలకు లైన్‌ క్లియర్‌ అయ్యింది. కేంద్ర ఎన్నికల సంఘం మూడు దశల్లో బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకుగాను అక్టోబర్‌ 28, నవంబర్‌ 3, నవంబర్‌ 7 తేదీల్లో.. అంటే మూడు దఫాలుగా పోలింగ్‌ జరగనుంది. కరోనా నేపథ్యంలో పోలింగ్‌ సమయాన్ని గంట పెంచిన ఈసీ, ఆన్‌లైన్‌ ద్వారా కూడా నామినేషన్ల స్వీకరణ జరుగుతుందని ప్రకటించడం గమనార్హం.

ఎన్నికలంటేనే భారీ ర్యాలీలు, బహిరంగ సభలు. కానీ, ఈసారి వాటికి అవకాశం లేకుండా పోయింది.. కరోనా కారణంగానే. బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలకు లైన్‌ క్లియర్‌ అవడంతో, ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి.? అన్న చర్చ షురూ అయ్యింది. కరోనా నేపథ్యంలో స్థానిక ఎన్నికల ప్రక్రియ మధ్యలో ఆగిపోయిన విషయం విదితమే. కొన్ని చోట్ల ఏకగ్రీవంగా అభ్యర్థులు ఎన్నికైపోవడమూ జరిగింది గతంలోనే. ఈ స్థానిక సమరం నేపథ్యంలో ప్రభుత్వానికీ, రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కీ మధ్య వివాదం తలెత్తడం.. హైకోర్టు, సుప్రీంకోర్టుల్లోనూ పిటిషన్లు దాఖలవడం, ప్రభుత్వానికి పలుమార్లు ఝలక్‌ ఎదురవడం తెలిసిన విషయాలే.

ఎన్నికల కమిషనర్‌ తొలగింపు ప్రక్రియతో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అప్రతిష్టను మూటగట్టుకుంది. అదే సమయంలో, ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఎన్నికల ప్రక్రియను వాయిదా వేయడం పట్ల ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ కూడా విమర్శల పాలయ్యారు. కరోనా లాక్‌డౌన్‌ నుంచి అనేక వెసులుబాట్లు వస్తున్న దరిమిలా, అతి త్వరలో స్థానిక ఎన్నికలు నిర్వహించాలన్న డిమాండ్‌ వస్తోంది. అయితే, ప్రభుత్వం మాత్రం, నిమ్మగడ్డ హయాంలో స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు సుముఖంగా లేదన్న ప్రచారం జరుగుతోంది.

‘నిమ్మగడ్డ తిరిగొస్తే బొచ్చు పీకుతాడా.?’ అంటూ ఓ మంత్రిగారు నోరు పారేసుకోవడం చూశాం. అయితే, బీహార్‌లో కరోనా కొంత అదుపులో వున్నా, ఆంధ్రప్రదేశ్‌లో ఆ పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక ఎన్నికలకు ఇంకాస్త సమయం పట్టే అవకాశం వుంది.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Puri Jagannadh: ఎవరు కొడితే బొమ్మ బ్లాక్ బస్టరవుద్దో.. అతనే ‘పూరి...

Puri Jagannadh: సినిమాకి హీరోకి ఉండే క్రేజే వేరు. సరైన సినిమాపడి స్టార్ స్టేటస్ వస్తే ఫ్యాన్స్ పెరుగుతారు.. డెమీ గాడ్ కూడా అయిపోతాడు. హీరో...

Harish Shankar: చోటా కె.నాయుడుపై హరీశ్ శంకర్ ఆగ్రహం.. బహిరంగ లేఖ

Harish Shankar: టాలీవుడ్ (Tollywood) సీనియర్ స్టార్ సినిమాటోగ్రాఫర్ చోటా కె.నాయుడు (Chota K Naidu) పై బ్లాక్ బస్టర్ దర్శకుడు హరీశ్ శంకర్ (Harish...

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

Ritu Varma: నభా నటేశ్-ప్రియదర్శికి రీతూవర్మ క్లాస్.. ట్వీట్ వార్ వైరల్

Ritu Varma: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ‘డార్లింగ్’ సంబోధనపై మాటల యుద్ధం వైరల్ అయిన సంగతి తెలిసిందే....

Chiranjeevi: చిరంజీవితో రష్యన్ సినిమా ప్రతినిధుల భేటీ.. చర్చించిన అంశాలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)తో రష్యా నుంచి వచ్చిన మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి...

రాజకీయం

పిఠాపురంలో వంగా గీతకు అదే పెద్ద మైనస్.!

నామినేషన్ల పర్వం షురూ అయ్యింది.! జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 23న పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు. పిఠాపురంలో జనసేనాని పోటీ చేస్తున్నారని కన్ఫామ్ అయినప్పటికీ, ఇప్పటికీ.....

గ్రౌండ్ రిపోర్ట్: నిడదవోలులో జనసేన పరిస్థితేంటి.?

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని నిడదవోలు నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు ఎలా వున్నాయ్.? 2024 ఎన్నికల్లో ఏ పార్టీ ఈ నియోజకవర్గం నుంచి గెలవబోతోంది.? నాటకీయ పరిణామాల మధ్య జనసేన పార్టీకి ‘కూటమి’ కోటాలో...

స్క్రిప్ట్ చేతిలో వైఎస్ జగన్ ఎందుకు బందీ అయ్యారు.!?

అసలేమయ్యింది వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి.? సుదీర్ఘ పాదయాత్ర చేసిన సమయంలో ఎవరి స్క్రిప్ట్ అవసరం లేకుండానే ప్రసంగాలు చేశారు కదా.? కానీ, ఇప్పుడేమయ్యింది.? స్క్రిప్టు చేతిలో వుంటే తప్ప మాట్లాడలేకపోతున్నారు.. ఆ...

CM Jagan: సీఎం జగన్ ఎదుటే పవన్ కల్యాణ్ నినాదం.. జేజేలు

CM Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (CM Jagan) కి జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అభిమానుల నుంచి నిరసన ఎదురైంది. సీఎం ఎదుటే...

రఘురామకృష్ణరాజు పంతం పట్టి మరీ సాధించుకున్నారుగానీ.!

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు, వైసీపీని వీడి టీడీపీలో చేరి, టీడీపీ నుంచి ఉండి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీకి దిగుతున్న సంగతి తెలిసిందే. నర్సాపురం లోక్ సభ సీటుని బీజేపీ నుంచి ఆశించి...

ఎక్కువ చదివినవి

పవన్ కళ్యాణ్ పై రాయితో దాడి

ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన 'వారాహి' యాత్రలో స్వల్ప అపశృతి చోటుచేసుకుంది. గుంటూరు జిల్లా తెనాలిలో పవన్ ప్రసంగిస్తుండగా.. గుర్తుతెలియని దుండగుడు ఆయనపై రాయి విసిరాడు. రాయి...

CM Jagan: సీఎం పై దాడి వివరాలిస్తే క్యాష్ ప్రైజ్.. బెజవాడ పోలీసుల ప్రకటన

CM Jagan: ఎన్నికల పర్యటనలో ఉండగా సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan mohan reddy) పై జరిగిన రాళ్ల దాడి కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఎడమ కంటి పై...

CM Jagan: సీఎం జగన్ ఎదుటే పవన్ కల్యాణ్ నినాదం.. జేజేలు

CM Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (CM Jagan) కి జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అభిమానుల నుంచి నిరసన ఎదురైంది. సీఎం ఎదుటే...

స్క్రిప్ట్ చేతిలో వైఎస్ జగన్ ఎందుకు బందీ అయ్యారు.!?

అసలేమయ్యింది వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి.? సుదీర్ఘ పాదయాత్ర చేసిన సమయంలో ఎవరి స్క్రిప్ట్ అవసరం లేకుండానే ప్రసంగాలు చేశారు కదా.? కానీ, ఇప్పుడేమయ్యింది.? స్క్రిప్టు చేతిలో వుంటే తప్ప మాట్లాడలేకపోతున్నారు.. ఆ...

ఎలక్షన్ కమిషన్ నెక్స్ట్ టార్గెట్ ఏపీ సీఎస్, డీజీపీ!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో ఫిర్యాదులు అందిన పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఇప్పటికే బదిలీ...