మోహన్ దాస్ కరమ్‌చంద్ గాంధీ.. ఎక్కడో గుజరాత్లో పుట్టి.. ప్రపంచ దేశాలు తిరిగి, ఉన్నత విద్యను అభ్యసించి.. దేశంలో స్వాతంత్య్ర స్ఫూర్తిని రగిల్చి.. ‘జాతి పిత’ అయ్యాడు. తెల్లదొరల దురహంకారాన్ని ‘అహింసాయుత’ మార్గంలో ఎదిరించిన ధీరుడు మహాత్మా గాంధీ. ఓ వైపు సాయుధ పోరాటం జరిగింది.. ఇంకో వైపు శాంతియుత పోరాటం నడిచింది. ఎందరో మహనీయులు స్వాతంత్రోద్యమంలో ప్రాణాలు విడిచారు. సాయుధ పోరాటాన్నీ మర్చిపోలేం.. అహింసాయుత పోరాటాన్నీ మర్చిపోలేం.
కానీ, ప్రపంచమంతా మహాత్ముడి ‘అహింసా మార్గం’ పట్ల ఫిదా అవుతోంది. మహాత్ముడి 150వ జయంతి వేడుకల్ని దేశంలో అంగరంగ వైభవంగా నిర్వహించేశాం. ప్రపంచ దేశాల్లోని భారతీయులే కాదు, ఆయా దేశాలకు చెందినవారూ మహాత్ముడ్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఇతర దేశాల సంగతి పక్కన పెడదాం.. మన దేశం గురించి మాట్లాడుకుందాం. గాంధీ మార్గం మనందరికీ అనుసరణీయం.. అని రాజకీయ నాయకులు చెబుతున్నారు.
ఖద్దరు వేస్తే అహింసాయుత మార్గంలో నడుస్తున్నట్టేనా.? ఆ ఖద్దరుకి అంటుకున్న రక్తపు మరకల మాటేమిటి.? మన దేశ రాజకీయాల్లో ఎవరి మీద ఎక్కువ కేసులున్నాయనే కోణంలో, ఆయా నాయకుల్ని ‘పెద్ద నాయకులు’గా గుర్తిస్తోన్న దుస్థితి. ఓట్ల కోసం కరెన్సీ నోట్లను విచ్చలవిడిగా వెదజల్లుతున్న రోజులివి. అలా అధికారంలోకి వచ్చినవారు, నిస్సిగ్గుగా మహాత్ముడి అడుగు జాడల్లో నడవాలంటూ దేశ ప్రజలకు పిలుపునిస్తున్నారు.
నిజంగానే మన ప్రజా ప్రతినిథుల్లో, రాజకీయ నాయకుల్లో ఎంతమందికి మహాత్ముడి పేరు స్మరించే నైతిక హక్కు వుంది.? ఈ ప్రశ్నకు సమాధానం వెతకడం చాలా కష్టమైన విషయంగా మారిపోయింది. మహాత్మాగాంధీ అంటే స్వచ్ఛతకు మారు పేరు. దురదృష్టవశాత్తూ ఆ స్వచ్ఛత మన రాజకీయాల్లో కనిపించదు. అందుకే, మహాత్మా మన్నించు.. అని ప్రజాస్వామ్య వాదులు వాపోతున్నారు.
202731 295278i was just browsing along and came upon your website. just wantd to say excellent job and this post truly helped me. 324333
155391 995116Yay google is my world beater aided me to uncover this outstanding web web site ! . 869682
503766 808919Glad to be one of numerous visitants on this awing internet internet site : D. 435190
281403 319571This is a great blog. Maintain up all of the work. I too adore to blog. This is wonderful every person sharing opinions 191458