జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్ మల్టీస్టారర్ చిత్రం ఆర్ఆర్ఆర్ గురించి రోజుకో వార్త వస్తూనే ఉంది. ఈ సినిమా అనే కాదు రాజమౌళి ఏ సినిమా చేసినా కూడా జనాల్లో ఉన్న ఆసక్తి కారణంగా రోజుకో పుకారు మీడియాలో షికారు చేయడం మనం గమనిస్తూనే ఉన్నాం. బాహుబలి సమయంలో ఏ స్థాయిలో పుకార్లు వచ్చాయో ఇప్పుడు అంతకు మించిన పుకార్లు సోషల్ మీడియాను ముంచెత్తుతున్నాయి. తాజాగా మరోఆసక్తికర పుకారు ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఆర్ఆర్ఆర్ సినిమాకు తమిళంలో భారీ క్రేజ్‌ను తెచ్చేందుకు తమిళ తంబీలకు ఈ సినిమాను మరింత దగ్గర చేసే ఉద్దేశ్యంతో తమిళ సూపర్ స్టార్ విజయ్ను ఈ చిత్రంలో నటింపజేసేందుకు రాజమౌళి ప్రయత్నాలు చేస్తున్నాడు అంటూ కొందరు ప్రచారం చేస్తున్నారు. కేవలం నెల రోజుల డేట్లు కావాలంటూ విజయ్‌ని రాజమౌళి విజ్ఞప్తి చేశాడని అందుకు భారీగా పారితోషికం కూడా ఆఫర్ చేశాడని పిచ్చి పుకార్లు పుట్టుకు వస్తున్నాయి.
నిజంగానే ఇవి పిచ్చి పుకార్లే. ఎందుకంటే జక్కన్న ఏ స్టార్‌ను మద్యలో ఇన్వాల్వ్ చేయాలనుకోడు. ముందే పక్కా ప్రణాళికతో సినిమాకు కావాల్సిన నటీనటులను ఎంపిక చేసుకుంటాడు. మద్యలో సినిమాకు ఏదో క్రేజ్‌ను పెంచే ఉద్దేశ్యంతో స్టార్స్‌ను నటింపజేయాలని అస్సలు భావించడు అంటూ ఆయన అభిమానులు అంటున్నారు. అందుకే ఇలాంటి పిచ్చి పుకార్లను నమ్మవద్దంటూ ఆయన అభిమానులు విజ్ఞప్తి చేస్తున్నారు.
343415 653986Will you care and attention essentially write-up most of the following in my webpage in essence your website mention of this blog? 178032
478015 908453Im not that much of a internet reader to be honest but your blogs actually nice, maintain it up! Ill go ahead and bookmark your website to come back inside the future. All of the best 96388