Switch to English

ఏడాది తర్వాత ‘టీ’ నుండి అమ్మడికి పిలుపు

ఉవ్వెత్తున ఎగసి పడ్డ కెరటంకు ప్రత్యక్ష సాక్ష్యం రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ అనడంలో ఎలాంటి సందేహం లేదు. టాలీవుడ్‌ లో దాదాపు స్టార్‌ హీరోలందరితో కూడా నటించిన ఈ అమ్మడు ప్రస్తుతం అవకాశాలు లేక దిక్కులు చూస్తుంది. ఒక్క ఛాన్స్‌ ఇవ్వండి అంటూ బాలీవుడ్‌ ఫిల్మ్‌ మేకర్స్‌ ను విజ్ఞప్తి చేస్తూ ఉంది. గత ఏడాది కాలంగా ఈమె తెలుగు సినిమా కెమెరా ముందుకే రాలేదు. దాంతో ఇక ఈమె టాలీవుడ్‌ కెరీర్‌ ఖతం అయినట్లే అంటూ అంతా అనుకుంటూ ఉన్నారు.

ఈ సమయంలోనే ఈ అమ్మడికి టాలీవుడ్‌ నుండి పిలుపు వచ్చింది. యంగ్‌ హీరో నితిన్‌కు జోడీగా ఈ అమ్మడిని ఎంపిక చేయడం జరిగింది. భవ్య క్రియేషన్స్‌ వారు తాజాగా ఈమెతో చర్చలు జరిపినట్లుగా సమాచారం అందుతోంది. పారితోషికం విషయంలో కూడా చర్చలు పూర్తి అయ్యాయని కథ ఇంకా ఆమె పాత్రపై రఫ్‌ గా ఒక క్లారిటీ ఇవ్వడంతో నితిన్‌తో నటించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లుగా చెబుతున్నారు.

ఈమద్య కాలంలో ఛాన్స్‌లు రావడమే గగనం అనుకుంటున్న సమయంలో నితిన్‌ వంటి క్రేజీ స్టార్‌తో నటించే ఛాన్స్‌ రావడంతో ఈ అమ్మడు ఆనందంతో ఎగిరి గంతేస్తుందట. ప్రస్తుతం కరోనా కారణంగా పూర్తిగా ఇంటికే పరిమితం అయ్యి కుటుంబ సభ్యులతో టైంను ఎంజాయ్‌ చేస్తున్న రకుల్‌కు ఇది ఒక మంచి గుడ్‌ న్యూస్‌గా చెబుతున్నారు. ఈ కరోనా కర్ఫ్యూ ఎత్తివేసిన తర్వాత భవ్య క్రియేషన్స్‌ నుండి నితిన్‌ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

సినిమా

నా భర్తతో ఉండలేక పోతున్నా అంటూ ట్వీట్‌.. సోనూ సూద్‌ సమాధానం...

గత నెల రోజులుగా సోషల్‌ మీడియాలో సోనూ సూద్‌ పేరు ఒక రేంజ్‌ లో మారు మ్రోగి పోతుంది. వలస కార్మికుల పాలిట దేవుడు అంటూ...

తమిళ, మలయాళ స్టార్స్‌తో తెలుగు మల్టీస్టారర్‌

ఈమద్య కాలంలో మల్టీస్టారర్‌ చిత్రాలు వరుసగా వస్తున్నాయి. మల్టీస్టారర్‌ చిత్రాలకు ఉన్న క్రేజ్‌ను క్యాష్‌ చేసుకునేందుకు మేకర్స్‌ ఎక్కువగా మల్టీస్టారర్‌ చిత్రాలను చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు....

ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ.. మల్టీస్టారర్ పై బాలయ్య స్పందన..

నందమూరి నట సింహం బాలకృష్ణ సినిమా గురించి మాట్లాడినా.. రాజకీయం గురించి మాట్లాడినా స్పష్టత ఉంటుంది. నిజాన్ని నిర్భయంగా చెప్పే ఆయన ఓ యూట్యూబ్ చానెల్...

క్షమాపణ చెప్పాలన్న నాగబాబు కామెంట్స్ పై బాలకృష్ణ రియాక్షన్.!

గత కొద్దిరోజులుగా తెలుగు సినీ పరిశ్రమలో కొన్ని వివాదాలు జరుగుతున్నాయి. ఈ వివాదం నందమూరి బాలకృష్ణ 'సినీ వర్గ మీటింగ్స్ కి నన్ను పిలవలేదు' అంటూ...

అనసూయకు పొలిటికల్‌ ఆఫర్స్‌ కూడా వస్తున్నాయా?

జబర్దస్త్‌ హాట్‌ యాంకర్‌ అనసూయ ప్రస్తుతం బుల్లి తెర మరియు వెండి తెరపై చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. సోషల్‌ మీడియాలో కూడా ఈమెకు...

రాజకీయం

అన్నదాతలకు శుభవార్త చెప్పిన కేంద్ర కేబినెట్

అన్నదాతలకు శుభవార్త: వివిధ పంటలకు మద్ధతు ధరలు పెంచిన కేంద్ర కేబినెట్( ఖరీఫ్ సీజన్ కోసం). ప్రతి క్వింటాల్ కు..... 1 . వరి - నూతన ధర రూ. 1,868/-( పెంచిన ధర రూ.53) 2....

నిమ్మగడ్డ ఇష్యూలో సుప్రీంను ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం

ఏపీ ఎన్నికల కమీషనర్‌గా విధులు నిర్వహిస్తున్న నిమ్మగడ్డ రమేష్‌ను ప్రభుత్వం అర్థాంతరంగా తొలగిస్తూ ఉతర్వులు తీసుకు వచ్చింది. ఆ ఉతర్వులను నిమ్మగడ్డ రమేష్‌ హైకోర్టులో సవాల్‌ చేశారు. ఏపీ హైకోర్టులో నిమ్మగడ్డ రమేష్‌కు...

జన్మంతా జగన్‌తోనేనంటున్న విజయసాయిరెడ్డి.. నమ్మొచ్చంటారా.?

‘వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డితో నాకున్న అనుబంధం చాలా విలువైనది. ఇప్పుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డితోనూ అదే అనుబంధం కొనసాగుతోంది. ఇకపైనా, అదే కొనసాగుతుంది. జన్మంతా జగన్‌ వెంటే నా ప్రయాణం. ఇందులో ఇంకో మాటకు...

కరోనా వారియర్లే రక్షకులు.. వారిపై దాడులు సహించం: ప్రధాని మోదీ

దేశంలో కరోనా విపత్కర పరిస్థితుల్లో అత్యుత్తమ సేవలు అందిస్తున్న వైద్యులు, హెల్త్ వర్కర్లపై దాడులు చేస్తే సహించేది లేదని ప్రధాని మోదీ తెలిపారు. కర్ణాటకలోని రాజీవ్ గాంధీ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్.....

బెజవాడలో గ్యాంగ్‌ వార్‌: హత్యా ‘రాజకీయం’లో కొత్త కోణం.!

రాష్ట్ర రాజధాని అమరావతి పరిధిలోని బెజవాడ ఒక్కసారిగా ‘గ్యాంగ్‌ వార్‌’తో ఉలిక్కిపడింది. రెండు గ్యాంగ్‌ల మధ్య గొడవలో ఓ గ్యాంగ్‌ లీడర్‌ హతమయ్యాడు. ఓ అపార్ట్‌మెంట్‌కి సంబంధించిన గొడవలో ఇద్దరు వ్యక్తులు ‘సెటిల్‌మెంట్‌’కి...

ఎక్కువ చదివినవి

వలస కూలీల కోసం ఏకంగా విమానం బుక్‌ చేసిన రియల్‌ హీరో

కొన్ని వందల కిలోమీటర్లు, వేల కిలో మీటర్ల దూరంను వలస కార్మికులు కేవలం కాలినడకన చేరుకున్న విషయం తెల్సిందే. లాక్‌ డౌన్‌ కారణంగా పనులు లేక పోవడంతో చాలా మంది తమ ప్రాంతాలకు...

రివ్యూ : పాతాళ్ లోక్ (వెబ్ సిరీస్)

చీకటి రాజ్యపు నెత్తుటి మరకలతో “పాతాళ్ లోక్” ప్రస్తుతం ప్రపంచాన్ని తన గుప్పిట్లో పెట్టుకుని శాసిస్తున్న కరోనా మహమ్మారి కారణంగా థియేటర్లు మూతబడి ఓటీటీ ప్లాట్ ఫాంలు కళకళలాడుతున్నాయి. అదే బాటలో అమెజాన్ ప్రైమ్...

కైలాష్ ఖేర్ ‘మ్యాడ్’ మూవీ పాటకి మంచి స్పంద‌న.!

ప్రస్తుత జనరేషన్ ని ప్రతిబింబించేలా పెళ్లి, సహజీవనంలో ఉన్న రెండు జంటల కథతో రాబోతున్న చిత్రం "మ్యాడ్".ఈ మూవీ ఫస్ట్ లుక్ ని రీసెంట్ గా రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.ఫ‌స్ట్ లుక్...

తాప్సీ ఇంట్లో విషాదం.. ఓదారుస్తున్న అభిమానులు.!

తెలుగు సినిమాల్లో తన గ్లామర్ తో నటనతో ఆకట్టుకున్న నటి తాప్పీ. పంజాబ్ కు చెందిన ఈ ముద్దుగుమ్మ ఝుమ్మంది నాదం సనిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఇటీవల తెలుగులో తన హవా...

విజయ్ సినిమాకు 20 కోట్ల నష్టం.. నిజమెంత?

తమిళ్ ఇండస్ట్రీలో ఇప్పుడు టాప్ హీరో ఎవరంటే కచ్చితంగా విజయ్ పేరు ముందు వినిపిస్తుంది. రీసెంట్ గా కూడా అజిత్, విజయ్ ఫ్యాన్స్ మధ్యన ఈ విషయంలో పెద్ద రచ్చే జరిగేది కానీ...