టాలీవుడ్ కు సుపరిచితుడు అయిన బండ్ల గణేష్ గత కొంత కాలంగా నిర్మాతగా తీవ్రమైన గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న విషయం తెల్సిందే. ఆర్థికంగా దారుణమైన కష్టాలను ఎదుర్కొంటున్న బండ్ల గణేష్ మళ్లీ నటుడిగా రీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెల్సిందే. ఆర్థిక ఇబ్బందుల నుండి బయట పడేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నాలు అన్నీ కూడా బెడిసి కొడుతున్నాయి. బండ్ల ఫ్యామిలీ ముఖ్య ఆదాయ వనరు పౌల్ట్రీ ఫామ్ అనే విషయం ప్రతి ఒక్కరికి తెల్సిందే.
కరోనా నేపథ్యంలో ఫౌల్ట్రీ ఫామ్ తీవ్రంగా దెబ్బ తింటున్నాయి. వైరస్ భయంతో చాలా మంది చికెన్ ఇంకా గుడ్లు తినేందుకు భయపడుతున్నారు. ఈ సమయంలో ఫౌల్ట్రీ ఫామ్ నిర్వహణ సాధ్యం కాదని చాలా మంది వదిలేస్తున్నారు. కాని బండ్ల గణేష్ మాత్రం ఇప్పటికే కోట్ల రూపాయలు అందులో ఇన్వెస్ట్ పెట్టి ఉండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో ముందుకే వెళ్లాల్సి వస్తుందట.
తమ పరిస్థితి ముందుకు వెళ్తే గొయ్యి.. వెనక్కు వెళ్తే నుయ్యి అన్నట్లు ఉందని బండ్ల గణేష్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఫౌల్ట్రీ ఫామ్లో ఒక కోడికి ముద్దు పెడుతున్న ఫొటోను కూడా బండ్ల బాబు షేర్ చేశాడు. కేవలం బండ్ల గణేష్ పరిస్థితి మాత్రమే కాకుండా మొత్తం దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా ఫౌల్ట్రీ ఫామ్ యాజమాన్యాల పరిస్థితి దారుణంగా ఉందని మార్కెట్ వర్గాల వారు అంటున్నారు. నిర్మాతగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొని అప్పులపాలయిన బండ్లకు ఈ కరోనాతో మరింత పెద్ద కష్టం వచ్చి పడినట్లయ్యింది.
723514 281368Just a smiling visitor here to share the adore (:, btw outstanding design . “Audacity, far more audacity and always audacity.” by Georges Jacques Danton. 916058
836001 889787Im having just a little problem I cant subscribe your feed, Im employing google reader fyi. 723316
566670 660105Great post, I think internet site owners really should acquire a good deal from this internet web site its extremely user pleasant. 268882