Switch to English

రాశి ఫలాలు: గురువారం 25 ఆగస్ట్ 2022

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,464FansLike
57,764FollowersFollow

పంచాంగం

శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయణం వర్షఋతువు శ్రావణ మాసం

సూర్యోదయం: ఉ.5:49
సూర్యాస్తమయం: సా.6:23
తిథి: శ్రావణ బహుళ త్రయోదశి ఉ.9:51 వరకు తదుపరి చతుర్దశి
సంస్కృతవారం: బృహస్పతి వాసరః (గురువారం)
నక్షత్రము: పుష్యమి సా.4:46 వరకు తదుపరి ఆశ్లేష
యోగం:వరీయాన్ రా.3:27 వరకు తదుపరి పరిఘ
కరణం వనిజ ఉ.9:47 వరకు తదుపరి విష్ఠి
దుర్ముహూర్తం:ఉ.10:00నుండి 10:48 వరకు తదుపరి మ.2:48 నుండి 3:36 వరకు
వర్జ్యం : లేదు
రాహుకాలం:మ.1:30 నుండి 3:00 వరకు
యమగండం: ఉ.6:00 నుండి 7:30 వరకు
గుళికా కాలం :ఉ.9:11 నుండి 10:44 వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.4:28 నుండి 5:16 వరకు
అమృతఘడియలు: ఉ.9:52 నుండి 11:38 వరకు
అభిజిత్ ముహూర్తం: ఉ.11:53 నుండి మ.12:43 వరకు

ఈరోజు. (25-08-2022) రాశి ఫలితాలు

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019

మేషం: వృత్తి వ్యాపారాలలో భాగస్థులతో వివాదాల నుండి కొంత వరకు బయటపడగలుగుతారు. కుటుంబ సభ్యుల సహాయంతో చాలాకాలంగా పూర్తి కాని పనులను పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రులకు ఏర్పడిన వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. దూర ప్రయాణాలలో నూతన మిత్రులతో పరిచయం కలుగుతాయి.

వృషభం: ఉద్యోగంలో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి అన్ని వైపుల నుండి ఆదాయం అందుతుంది. ఆర్థిక పరంగా ఉన్న ఇబ్బందులను అధిగమిస్తారు. ఇంటాబయట మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలలో నూతన ప్రోత్సాహకాలు పొందుతారు. బంధుమిత్రుల నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి.

మిథునం: ఒక వ్యవహరంలో సమాజంలో పేరు కలిగిన వారి సహాయంతో కార్యసిద్ధి కలుగుతుంది. గృహ నిర్మాణ విషయంలో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విలువైన, వస్త్ర, ఆభరణాలను కొనుగోలు చేస్తారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. వృత్తి వ్యాపారాలలో ఆకస్మిక లాభాలు పొందుతారు.

కర్కాటకం: ఆర్థిక పరిస్థితి కొంత అనుకూలంగా సాగుతుంది. చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. వృత్తి, వ్యాపారాలలో ఏర్పడిన అవరోధాలు అధిగమించి స్వల్ప లాభాలను అందుకుంటారు. గృహమున సంతాన వివాహ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఉద్యోగులకు అధికారుల ఆదరణతో పదోన్నతులు పెరుగుతాయి.

సింహం: ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. సోదరులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. వృత్తి ఉద్యోగాలలో శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపార విషయాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకోవడం మంచిది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు.

కన్య: సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి. దైవ చింతన పెరుగుతుంది. సన్నిహితులతో ఏర్పడిన వివాదాలు సమసిపోతాయి. అన్ని రంగాల వారికి ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఆర్ధిక సమస్యలు నుంచి బయట పడతారు. వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు.

తుల: వృత్తి ఉద్యోగాలలో నూతన అవకాశాలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో వివాదాలు రాజీ చేసుకుంటారు సంఘంలో పెద్దలతో పరిచయాలు విస్తృతం అవుతాయి నూతన వ్యాపారాలకు ప్రారంభానికి శ్రీకారం చుడతారు. నిరుద్యోగులకు అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి విలువైన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు.

వృశ్చికం: ఆర్ధిక లావాదేవీలు అనుకూలంగా సాగుతాయి. వృత్తి, వ్యాపారాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. సోదరుల నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. ఉద్యోగులకునూతనప్రోత్సాహకాలు అందుతాయి చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు.

ధనస్సు: దీర్ఘకాలిక రుణాలు తీరి ఊరట చెందుతారు. వ్యాపార పెట్టుబడులు ఈ విషయంలో పునరాలోచన మంచిది. ఉద్యోగులకు అదనపు పని భారం నుండి ఉపశమనం కలుగుతుంది. చుట్టుపక్కల వారితో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. దూరప్రయాణాలు కలసివస్తాయి. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి.

మకరం: కుటుంబ పెద్దల నుండి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు చేయటం మంచిది కాదు. వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. ధనాదాయం బాగుంటుంది. విద్యార్థులు నూతన విద్యలపై ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగులకు పని ఒత్తిడి పెరిగినా సమయానికి పూర్తిచేస్తారు.

కుంభం: గృహనిర్మాణ పనులు వేగవంతం చేస్తారు. సంఘంలో నూతన వ్యక్తులతో పరిచయాలు కలుగుతాయి చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమౌతాయి. నూతన వాహన యోగం ఉన్నది. వ్యాపారాలు ప్రారంభానికి ఆప్తుల నుండి పెట్టుబడులు అందుతుంది.

మీనం: మొండి బాకీలు వసూలవుతాయి. మిత్రులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులుకు పెద్దల అనుగ్రహంతో నూతన అవకాశాలు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాలు విశేషంగా రాణిస్తాయి. ఉద్యోగమున పురోగతి కలుగుతుంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తవుతాయి.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి...

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో...

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా...

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు...

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ...

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్...

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు...

రాజకీయం

Chiranjeevi: పిఠాపురం కు చిరంజీవి వస్తున్నారా..? వాస్తవం ఇదీ..

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిపై ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ్ముడు పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేయనున్నారని.. ఇందుకు మే 5వ తేదీన...

పిఠాపురంలో జనసునామీ.! నభూతో నభవిష్యతి.!

సమీప భవిష్యత్తులో ఇలాంటి జనసునామీ ఇంకోసారి చూస్తామా.? ప్చ్.. కష్టమే.! అయినాసరే, ఆ రికార్డు మళ్ళీ ఆయనే బ్రేక్ చేయాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు...

సింగిల్ సింహం కాదు సజ్జలా.! అది రేబిస్ సోకిన కుక్క.!

‘మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త.! నోటికొచ్చినట్లు మాట్లాడితే బాగోదు.!’ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అది కూడా వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన సజ్జల...

పో..‘సాని’తనం.! ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం.!

‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.! ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.?...

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...

ఎక్కువ చదివినవి

Harish Shankar: చోటా కె.నాయుడుపై హరీశ్ శంకర్ ఆగ్రహం.. బహిరంగ లేఖ

Harish Shankar: టాలీవుడ్ (Tollywood) సీనియర్ స్టార్ సినిమాటోగ్రాఫర్ చోటా కె.నాయుడు (Chota K Naidu) పై బ్లాక్ బస్టర్ దర్శకుడు హరీశ్ శంకర్ (Harish Shankar) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్దేశపూర్వకంగా...

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

Ritu Varma: నభా నటేశ్-ప్రియదర్శికి రీతూవర్మ క్లాస్.. ట్వీట్ వార్ వైరల్

Ritu Varma: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ‘డార్లింగ్’ సంబోధనపై మాటల యుద్ధం వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ గొడవలోకి హీరోయిన్ రీతూ వర్మ...

Chiranjeevi: ‘పేదలకు అందుబాటులో..’ యోదా డయోగ్నోస్టిక్స్ ప్రారంభోత్సవంలో చిరంజీవి

Chiranjeevi: ‘ఓవైపు వ్యాపారం మరోవైపు ఉదాసీనత.. రెండూ చాలా రేర్ కాంబినేషన్. యోదా డయాగ్నోస్టిక్స్ అధినేత కంచర్ల సుధాకర్ వంటి అరుదైన వ్యక్తులకే ఇది సాధ్య’మని మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)...

సింగిల్ సింహం కాదు సజ్జలా.! అది రేబిస్ సోకిన కుక్క.!

‘మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త.! నోటికొచ్చినట్లు మాట్లాడితే బాగోదు.!’ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అది కూడా వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన సజ్జల...